ఫిరంగిపురం: ఫిరంగిపురం నుంచి సత్తెనపల్లి వెళ్లే మార్గంలోని అల్లంవారిపాలెం వద్ద ఉన్న రైల్వేగేటు ఎల్‌సీ 298కి శనివారం నుంచి అత్యవసర మరమ్మతులు నిర్వహించనున్నట్లు రైల్వే శాఖ నల్లపాడు సీనియర్ సెక్షన్ ఇంజినీర్ పి. ఉమామహేశ్వరరావు శుక్రవారం ఒక ప్రటనలో పేర్కొన్నారు. మరమ్మతు పనుల్లో భాగంగా శనివారం నుంచి జూన్ మూడో తేదీ వరకు గేటు మూసివేస్తామన్నారు. ప్రత్యామ్నాయంగా ఆరోగ్యనగర్ వద్ద ఉన్న అండర్ పాస్‌ను వాహనదారులు వినియోగించుకోవాలని సూచించారు.
రైల్వే గడ్డర్‌ను ఢీకొన్న భారీ వాహనం
తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరం రైల్వే ట్రాక్ వద్ద ఏర్పాటుచేసిన రైల్వే గడ్డర్‌ను ఓ భారీ వాహనం ఢీకొట్టిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం రైల్వేట్రాక్ అండర్‌పాస్ వద్ద భారీ వాహనాల రాకపోకల నిషేధానికి ఏర్పాటు చేసిన రైల్వే గడ్డర్‌ను చూసుకోకుండా వాహన డ్రైవర్ ఢీకొట్టాడు. దీంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.
యోగాతో సంపూర్ణ ఆరోగ్యం
వీసీ ఆచార్య కె.గంగాధరరావు
ఏఎన్‌యూ: యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సొంతమవుతుందని వీసీ ఆచార్య కె గంగాధరరావు అన్నారు. యోగాంధ్రలో భాగంగా శుక్రవారం ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో అధికారులు, సిబ్బంది, పరిశోధకులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం యూనివర్సిటీ యోగా సెంటర్‌లో యోగా సాధన చేశారు. వీసీ ఆచార్య కె గంగాధరరావు యోగా ఆవశ్యకతను తెలియజేశారు. ప్రతి ఒక్కరూ యోగాను దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు. యోగా ఆవశ్యకతను మనం గుర్తించడంతోపాటు, సమాజానికి అవగాహన కల్పించాలని సూచించారు. రిజిస్ట్రార్ ఆచార్య జి.సింహాచలం, ప్రిన్సిపాల్స్ ఆచార్య పీపీఎస్ పాల్ కుమార్, ఆచార్య పి సిద్దయ్య, దూరవిద్యా కేంద్రం డైరెక్టర్ ఆచార్య వి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
నేటి నుంచి రైల్వే గేటు మూసివేత
యోగాతో సంపూర్ణ ఆరోగ్యం


