
నర్సులకు నియామక పత్రాలను అందజేస్తున్న ఆర్‌డి శోభారాణి
గుంటూరు మెడికల్: గుంటూరు ప్రాంతీయ వైద్య ఆరోగ్య శాఖ సంచాలకులు (ఆర్డీ) కార్యాలయంలో శుక్రవారం స్టాఫ్‌నర్సుల భర్తీ ప్రక్రియ జరిగింది. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానించి శుక్రవారం సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలకు అర్హులైన వారికి నియామకపు ఉత్తర్వులు ఆర్డీ డాక్టర్ శోభారాణి అందజేశారు. ఉమ్మడి మూడు జిల్లాల్లో 60 స్టాఫ్‌నర్సుల పోస్టుల భర్తీకి మెరిట్ ప్రాతిపదికన కౌన్సిలింగ్‌కు అభ్యర్థులను పిలిచారు. వీరిలో 49 మంది శుక్రవారం కౌన్సెలింగ్‌కు హాజరై నియామకపు ఉత్తర్వులు అందుకున్నారు. ఒకరు స్పోర్ట్స్ కోటా ఎంపిక అవగా సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం వెయిటింగ్ లిస్టులో పెట్టారు. పది మంది అభ్యర్థులు కౌన్సిలింగ్‌కు గైర్హాజరయ్యారు. కౌన్సిలింగ్ ప్రక్రియలో డెప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి, సూపరింటెండెంట్ గోపవరపు స్టాన్లి రాజ్‌కుమార్, సీనియర్ అసిస్టెంట్ షేక్ నాగూర్‌షరీఫ్ పాల్గొన్నారు.