దుర్గాపూజ లిస్ట్‌.. చిన్న కత్తి పెప్పర్‌ స్ప్రే! | Women's Safety Is A Matter Of Self-Care | Sakshi
Sakshi News home page

దుర్గాపూజ లిస్ట్‌.. చిన్న కత్తి పెప్పర్‌ స్ప్రే!

Sep 3 2024 8:46 AM | Updated on Sep 3 2024 10:12 AM

Women's Safety Is A Matter Of Self-Care

కోల్‌కత్తాలో జూనియర్‌ డాక్టర్‌ హత్యాచార ఘటన ‘మహిళల భద్రత’ అంశాన్ని మరోసారి చర్చల్లోకి తీసుకువచ్చింది. ఈ నేపథ్యంలో శ్రేయసి బిస్వాస్‌ అనే ఇన్‌ఫ్లూయెన్సర్‌ చేసిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

‘రాబోయే దుర్గా పూజ కోసం మీ షాపింగ్‌ లిస్ట్‌లో ఉండాల్సిన ఐటమ్స్‌’ అనేది వీడియో సారాంశం. ఇన్‌ఫ్లూయెన్సర్స్‌ శ్రేయసి ‘దుర్గా పూజా జాబితా’లో పండగకు అవసరమైన వస్తువులతో పాటు చిన్న కత్తి, పెప్పర్‌ స్ప్రే, అలారమ్‌ కీచైన్‌... లాంటివి జత చేసింది. ‘పెప్పర్‌స్ప్రే, అలారమ్‌ కీచైన్‌ల మీద వీడియో చేస్తానని ఎప్పుడూ అనుకోలేదు. కానీ కోల్‌కతా దుర్ఘటన నేపథ్యంలో తప్పకుండా చేయాలనిపించింది. మహిళల భద్రత ప్రమాదంలో పడింది. ఎక్కడ ఏ ప్రమాదం పొంచి ఉందో తెలియదు. ఈ నేపథ్యంలో మహిళలు తమ భద్రత గురించి తామే జాగ్రత్త పడాలి. బ్యాగులో సెల్ప్‌–డిఫెన్స్‌ టూల్స్‌ తప్పనిసరిగా ఉండాలి’ అంటుంది శ్రేయసి బిస్వాస్‌. సెల్ఫ్‌–డిఫెన్స్‌ టూల్స్‌ను ప్రేక్షకులకు చూపుతూ వాటి వల్ల ఉపయోగం ఏమిటో చెప్పింది శ్రేయసి. ‘ఈ సెల్ఫ్‌–డిఫెన్స్‌ ్రపాడక్ట్స్‌ అమెజాన్‌లో అందుబాటులో ఉన్నాయి. జస్ట్‌ సెర్చ్‌ చేయండి చాలు’ అని సలహా కూడా ఇచ్చింది. ఈ వీడియో 7.6 లక్షల వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

‘కోల్‌కతా దుర్ఘటన తరువాత కొత్త వాళ్లు ఎవరైనా మిల్లీ సెకన్‌ నా వైపు చూసినా చాలా భయంగా ఉంది’ అని ఒక యూజర్‌ రాసింది. ‘మా పరిస్థితి కూడా అదే’ అన్నారు చాలామంది. ‘భయపడితే ఎలా! మహిళలలో దుర్గాదేవి అంశ ఉంది. దుర్మార్గుల అంతు చూసే అపార శక్తి ఉంది’ అని ఒక యూజర్‌ రాశారు.

Advertisement
 
Advertisement
Advertisement