అమ్మాయిలూ ఎల్లప్పుడూ ‘మంచి’గా వద్దు..! పరిశోధనలు సైతం.. | women diagnosed autoimmune diseases and the reason behind | Sakshi
Sakshi News home page

అమ్మాయిలూ ఎల్లప్పుడూ ‘మంచి’గా వద్దు..! పరిశోధనలు సైతం..

Jun 26 2026 4:43 PM | Updated on Jun 26 2026 5:04 PM

women diagnosed autoimmune diseases and the reason behind

చిన్నప్పటి నుంచి ఆడిపిల్లలకు సర్దుకుపోవడం, అందరికి చేదోడు వాదోడుగా, మంచిగా వ్యవహరించేలా పెంచుతారు. పైగా వాళ్ల భావోద్వేగాలను బయటకు వ్యక్తం చేయనివ్వరు పెద్దలు. దాని కారణంగానే మహిళలు ఆ వ్యాధి బారిన పడుతున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో వార్తలు గుప్పుమన్నాయి. ఆ కారణంగానే ఈ వ్యాధి అని పరిశోధనలు కూడా చెబుతున్నాయి. అందుకు సంబంధించిన ఓ మహిళా సంభాషణ వీడియో నెట్టిటంట తెగ వైరల్‌గా మారింది. ఇంతకీ ఇందులో వాస్తవమెంత? వైద్య నిపుణులు ఏమంటున్నారు?

ఇటీవల సామాజిక మాధ్యమాల్లో మహిళలకు ఆ కారణంగానే ఆటోఇమ్యూన్‌ వ్యాధి వస్తోందంటూ పోస్టులు వైరల్‌ అయ్యాయి. అందుకు లక్షలాదిమంది మహిళలు మద్దతు తెలపడం విశేషం. ప్రతి ఒక్కరు అది వాస్తవమని, ఇప్పటికైన మనమంతా మేల్కొందాం అంటూ పిలుపునివ్వడం విశేషం. 

అంతేగాదు అమ్మాయిలూ సదా ‘మంచిగా’ ఉండొద్దు అది మన ఆరోగ్యానికే హానికరం అనే నినాదం మొదలైంది. ఇతరులను సంతోషపెట్టే అలవాటు మనల్ని మానసికంగా కుంగదీయడమే కాదు, చివరికీ శారీరక అనారోగ్యానికి గురిచేస్తుందని వాదన మొదలైంది నెట్టింట. 

ఇలా ఎందుకు అంటున్నారంటే..
ఆటోఇమ్యూన్‌ వ్యాధులతో బాధపడుతోంది అధికంగా మహిళలే కావడంతో ఈ వాదన ఊపందుకుంది నెట్టింట. ఇటీవల ఒక ఇన్‌ఫ్లుయెన్సర్‌  హర్పిందర్‌ కౌర్‌ ఈ ట్రెండీ వాదన గురించి షేర్‌ చేస్తూ..'మంచి' అమ్మాయి అంటే అందరితో ఏకీభవించే, నిస్వార్థపరురాలైన సర్దుకుపోయే అమ్మాయిగా నాకు నేర్పించారు. ఇదే ఆ అనారోగ్య సమస్యకు కారణం అని అంటోందామె. ఆ కారణంగానే మహిళల్లో ఈ సమస్య ఎక్కువని. అందుకు ప్రధాన కారణాలు సాంస్కృతిక అలవాట్లు, దీర్ఘకాలిక ఒత్తిడి, వ్యక్తపరచని భావోద్వేగాలు, తమ అవసరాల కంటే ఇతరుల అవసరాలకే ప్రాధాన్యత ఇవ్వడం తదితరాలేనని తేల్చి చెప్పింది. 

అంతేగాదు ఏళ్ల తరబడి చాలామంది తమ బావోద్వేగాలను అణిచివేసి, నిరంతర సంరక్షణ, ఇతరులను సంతోషపెట్టే తపనతో జీవిస్తారు. దాంతో శరీరం దీర్ఘకాలిక ఒత్తిడికి గురై చివరిక దీర్ఘాకాలిక అనారోగ్యానికి బలి అవుతోందంటూ అవేదన వ్యక్తం చేసింది. ఆఖరికి పరిశోధనలు కూడా ఆటోఇమ్యూన్ వ్యాధులతో బాధపడుతున్న వారిలో దాదాపు 80 శాతం మంది మహిళలేనని పేర్కొంది. 

 

లూపస్‌, స్జోగ్రెన్‌ సిండ్రోమ్‌ వంటి వ్యాధులు పురుషుల కంటే మహిళలల్లో ముఖ్యంగా 20 నుంచి 50 ఏళ్ల మధ్య వయసు వారిలో గణనీయంగా అధిక రేట్లలో ప్రభావం చూపుతోందని చెప్పింది. నిజానికి ఈ వైరల్‌ పోస్టులన్నీ మహిళలు తీవ్ర నిరాశనిస్ప్రహలకు లోనవ్వడంతోనే ఈ వ్యాధులు బాధపడుతున్నారనే విషయాన్ని వ్యక్తం చేశాయి. అలాగే ఇది ఒత్తిడి రుగ్మతలకు సంబంధించిందేనని శాస్త్రవేత్తలు గుర్తించారు కూడా. అయితే దృఢంగా ఉన్నంత మాత్రాన ఈ సమస్యను తిప్పికొట్టగలమని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు లేవు. 

పైగా ఆటోఇమ్యూన్‌ వ్యాధికి అవే కారణమని శాస్త్రీయంగా నిరూపితం కాలేదు కానీ  మహిళలు ఏ విధంగా ఒత్తిడికి లోనవ్వుతున్నారనేది వెల్లడైందంటున్నారు నిఫుణులు. అతేగాదు అమ్మాయిలూ..వద్దు అని చెప్పడం నేర్చుకోవడం, కోపాన్ని వ్యక్తపరచగలగడం, మనకోసం మనం నిలబడటం వంటివి చేస్తే ఈ సమస్య బారిన పడమని ముక్తకంఠంతో నినదించారు. అంతేగాదు ఇలా వ్యవహరించాలంటే మనకు యోగా ఉపకరిస్తుందని, స్వతంత్రంగా, ధైర్యంగా బతకడం ఎలాగో నేర్పిస్తుందని అన్నారు. మానసిక నిపుణులు కూడా ఇవన్నీ సరైనా కారణాలే అయినా..శాస్త్రీయంగా నిర్థారించలేమని అన్నారు.

 

(చదవండి: కలెక్టర్ గారూ..అదే నా చివరి కోరిక! 94 ఏళ్ల బామ్మ విజ్ఞప్తి..)

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement