'చార్లీ 777 మూవీ'ని తలపించే స్టోరీ..! ఏకంగా 12 వేల కిలోమీటర్లు.. | Viral Video: Bihar Man Travels 12000 Km Across India With His Dog | Sakshi
Sakshi News home page

'చార్లీ 777 మూవీ'ని తలపించే స్టోరీ..! ఏకంగా 12 వేల కిలోమీటర్లు..

Jun 30 2025 11:01 AM | Updated on Jun 30 2025 1:12 PM

Viral Video: Bihar Man Travels 12000 Km Across India With His Dog

చార్లీ 777 అనే కన్నడ మూవీ తెలుగు ప్రేక్షకులను ఎంతగా అలరించిందో తెలిసిందే. దర్శకుడు కిరణ్‌రాజ్‌ కె తీసిన ఈ మూవీ టైటిల్‌ లీడ్‌ రోల్‌లో చార్లీగా లాబ్రాడర్‌ కుక్క, హీరోగా రక్షిత్‌ శెట్టి, నటి సంగీత శృంగేరి తదితరులు నటించారు. ఈ సినిమాలో కొన్ని రోజుల్లో దూరమైపోతున్న ఆ కుక్క డ్రీమ్‌ని నెరవేర్చి, దాని జ్ఞాపకాలను పదిల పర్చుకోవాలని కోరికతో హీరో రక్షిత్‌ శెట్టి బైక్‌పై దాన్ని కూర్చోబెట్టుకుని టూర్‌లు చుట్టివస్తుంటాడు. ఆ క్రమంలో ఇద్దరి మధ్య పెనవేసుకున్న ప్రేమానురాగాలు సైలెంట్‌గా సాగే ఈ మూవీలో హైలెట్‌గా ఉంటాయి. అచ్చం అలాంటి కథే ఈ బిహార్‌ వ్యక్తిది. కాకపోతే ఇక్కడ ఈ వ్యక్తి సైకిల్‌పై తన పెంపుడు కుక్కతో టూర్లు చుట్టొచ్చాడు. అలా ఎంత దూరం వెళ్లాడో తెలిస్తే విస్తుపోతారు. 

బిహార్‌కి చెందిన సోను అనే వ్యక్తి, తాను కాపాడిన చార్లీ అనే కుక్కతో భారతదేశం అంతటా సుమారు 12,000 కి.మీ.ల దూరం పైనే పర్యటించాడు. ఒక ప్రమాదంలో గాయపడిన ఆ కుక్కతో అనుకోకుండా అటాచ్‌మెంట్‌ పెరిగిపోయింద ఇద్దరికి. అది అతడు ఎక్కడికి వెళ్తే అక్కడకు అనుసరించడంతో ఇలా ఆ కుక్కతో కలిసి ట్రావెల్‌ చేసినట్లుగా తెలిపాడు. 

అంతేగాదు అతడు తన ఇంటిని వదిలి ఇప్పటికీ దాదాపు  11 నెలలు పైనే అయ్యిందట. ఇప్పటి వరకు ఇద్దరూ కలిసి రామేశ్వరం, కేదార్‌నాథ్, బద్రీనాథ్ వంటి పుణ్యక్షేత్రాలను సందర్శించారు. ప్రస్తుతం ప్రయాగ్‌రాజ్‌ మార్గంలో ఉన్నట్లు ఇన్‌స్టాగ్రాంలో షేర్‌ చేసిన వీడియోలో చెప్పుకొచ్చాడు. అందుకు సంబంధించిన వీడియోని అంతకుమునుపే పోస్ట్‌ చేసినప్పటికీ అందులో ఆడియో సరిగా లేకపోవడంతో మరోసారి రీపోస్ట్‌ చేశాడు సోను. 

దాంతో ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు కూడా..ఆ కుక్క నిజంగా చాలా అదృష్టవంతురాలు..ఏ కుక్కకి దక్కని అద్భుత అవకాశం లభించింది. బ్రో మీ ఇద్దరి మధ్య పెనవేసుకున్న ప్రేమకి ఫిదా అని కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు.

 

(చదవండి: అమెరికా ఆఫీసులో భారతీయ మహిళ ఆకలి తిప్పలు..! పాపం ఆ రీజన్‌తో..)

 

Advertisement
 
Advertisement
Advertisement