breaking news
Charlie
-
సౌమ్య కేసు: దుస్తులే తాడుగా.. జైలు గోడ దూకి పరార్.. కేరళలో హైఅలర్ట్
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సౌమ్య(23) హత్యాచార కేసులో జీవితఖైదు అనుభవిస్తున్న గోవిందచామీ అలియాస్ ఛార్లీ థామస్ జైలు నుంచి పరారయ్యాడు. దీంతో పోలీస్ శాఖ కేరళవ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించి అప్రమత్తమైంది. అయితే గంటల వ్యవధిలో.. ఓ స్థానికుడి సహాయంతో పోలీసులు ఆ మానవ మృగాన్ని పట్టుకోగలిగారు.2011లో సౌమ్య అనే యువతిని రైలు నుంచి బయటకు నెట్టేసి మరీ అఘాయిత్యానికి పాల్పడ్డాడు చార్లీ థామస్. ఈ కేసులో బాధితురాలు చికిత్స పొందుతూ నాలుగు రోజులకే కన్నుమూసింది. దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైన ఈ కేసులో ఘటన జరిగిన మరుసటిరోజే నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే కన్నూరు జైలులో ప్రస్తుతం జీవిత ఖైదు అనుభవిస్తున్న చార్లీ.. గత అర్ధరాత్రి సమయంలో జైలు నుంచి పరారయ్యాడు. తాను ఉంటున్న సెల్ ఊచలను తొలగించి బయటకు వచ్చిన చార్లీ.. ఆపై తోటి ఖైదీల దుస్తులను తాడుగా మార్చేసి కరెంట్ ఫెన్సింగ్‌ను దాటేసి మరీ పరారయ్యాడు. గోడ దూకాక.. రోడ్డు మీద తాపీగా నడుచుకుంటున్న దృశ్యాలు అక్కడి సీసీటీవీల్లో రికార్డయ్యాయి. దీంతో పోలీసు శాఖ స్టేట్ వైడ్ అలర్ట్ ప్రకటించింది. బస్టాండులు, రైల్వే స్టేషన్లు, ఆలయాలు.. ఇలా అన్నిచోట్ల చార్లీ ఫొటోలతో గాలింపు ముమ్మరం చేసింది. చార్లీని గుర్తిస్తే 9446899506 నెంబర్‌కు సమాచారం ఇవ్వాలని కోరింది.ఈలోపు.. కన్నూరు తలప్పు ఏరియాలో ఓ పాడుబడ్డ ఇంటి ఆవరణలో చార్లీని చూసినట్లు స్థానికుడు ఒకరు సమాచారం అందించారు. దీంతో పోలీసులు అక్కడికి వెళ్లగా.. అక్కడ బావిలో దాక్కుని కనిపించాడు. దీంతో తాడు సాయంతో అతన్ని బయటకు తీశారు. ఉదయం. 11గం. ప్రాంతంలో చార్లీని పోలీసులు అదుపులోకి తీసుకుని మళ్లీ జైలుకు తరలించారు. 2011, ఫిబ్రవరి 1వ తేదీన కొచ్చి నుంచి షోరణూర్ వెళ్తున్న రైలులో సౌమ్య(23) ఒంటరిగా ప్రయాణిస్తోంది. అది గమనించిన గోవిందచామీ.. ఆమెను రైలు నుంచి తోసి, ట్రాక్ పక్కన అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి బలాత్కారం చేశాడు. అటుపై ఆమె ఫోన్‌తో ఉడాయించాడు. ఆ ఫోన్ ఆధారంగానే పోలీసులు ఆ మరుసటిరోజే నిందితుడ్ని అరెస్ట్ చేశారు. ఇటు త్రిసూర్ మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతూ సౌమ్య ఫిబ్రవరి 6వ తేదీన కన్నుమూసింది.ఈ ఘటన కేరళతో పాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అదే ఏడాది నవంబర్ 11న ఫాస్ట్‌ట్రాక్ కోర్టు గోవిందచామీకి మరణశిక్ష విధించింది. కోర్టు నుంచి బయటకు వస్తున్న టైంలో చార్లీ నవ్వుతూ కనిపించాడు. పైగా శిక్ష ప్రకటించే సమయంలోనూ అతనిలో ఏమాత్రం పశ్చాత్తాపం కనిపించలేదని న్యాయమూర్తి అన్నారు. అయితే.. 2013లో కేరళ హైకోర్టు ఆ శిక్షను నిలుపుదల చేయగా, 2014లో సుప్రీం కోర్టు సైతం స్టే ఇచ్చింది. 2016లో గోవిందచామీపై మర్డర్ అభియోగాన్ని తొలగించి.. కేవలం రేప్‌కేసు కింద జీవిత ఖైదును సుప్రీం కోర్టు విధించింది. అంత కట్టుదిట్టమైన భద్రత నుంచి ఎలా?కన్నూరు సెంట్రల్ జైలు కట్టుదిట్టమైన భద్రత నడుమ ఉంటుందని, అలాంటి జైలు నుంచి చార్లీ తప్పించుకోవడం ఏంటి? అని బాధిత కుటుంబం ప్రశ్నిస్తోంది. ఎవరో అతనికి సాయం చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తోంది. మరోవైపు.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఈ పరిణామంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘‘చార్లీ కరడుగట్టిన నేరస్తుడు. అర్ధరాత్రి 1గం. సమయంలో తప్పించుకున్నాడు. అధికారులేమో ఉదయం 5గం. గుర్తించారు. ఏడుగంటలకు పోలీసులు అప్రమత్తం అయ్యారు. సరిగ్గా అతను తప్పించుకునే టైంలోనే జైల్లో కరెంట్ పోయింది. ఇది పక్కా స్కెచ్‌తోనే జరిగి ఉంటుంది’’ అనే అనుమానాలు వ్యక్తం చేశారాయన. అయితే కేరళ పోలీస్ శాఖ మాత్రం అతని కోసం వేట కొనసాగుతోందని తెలిపింది. ఈలోపు అతను దొరకడం విశేషం. -
'చార్లీ 777 మూవీ'ని తలపించే స్టోరీ..! ఏకంగా 12 వేల కిలోమీటర్లు..
చార్లీ 777 అనే కన్నడ మూవీ తెలుగు ప్రేక్షకులను ఎంతగా అలరించిందో తెలిసిందే. దర్శకుడు కిరణ్‌రాజ్ కె తీసిన ఈ మూవీ టైటిల్ లీడ్ రోల్లో చార్లీగా లాబ్రాడర్ కుక్క, హీరోగా రక్షిత్ శెట్టి, నటి సంగీత శృంగేరి తదితరులు నటించారు. ఈ సినిమాలో కొన్ని రోజుల్లో దూరమైపోతున్న ఆ కుక్క డ్రీమ్‌ని నెరవేర్చి, దాని జ్ఞాపకాలను పదిల పర్చుకోవాలని కోరికతో హీరో రక్షిత్ శెట్టి బైక్‌పై దాన్ని కూర్చోబెట్టుకుని టూర్లు చుట్టివస్తుంటాడు. ఆ క్రమంలో ఇద్దరి మధ్య పెనవేసుకున్న ప్రేమానురాగాలు సైలెంట్‌గా సాగే ఈ మూవీలో హైలెట్‌గా ఉంటాయి. అచ్చం అలాంటి కథే ఈ బిహార్ వ్యక్తిది. కాకపోతే ఇక్కడ ఈ వ్యక్తి సైకిల్‌పై తన పెంపుడు కుక్కతో టూర్లు చుట్టొచ్చాడు. అలా ఎంత దూరం వెళ్లాడో తెలిస్తే విస్తుపోతారు. బిహార్‌కి చెందిన సోను అనే వ్యక్తి, తాను కాపాడిన చార్లీ అనే కుక్కతో భారతదేశం అంతటా సుమారు 12,000 కి.మీ.ల దూరం పైనే పర్యటించాడు. ఒక ప్రమాదంలో గాయపడిన ఆ కుక్కతో అనుకోకుండా అటాచ్మెంట్ పెరిగిపోయింద ఇద్దరికి. అది అతడు ఎక్కడికి వెళ్తే అక్కడకు అనుసరించడంతో ఇలా ఆ కుక్కతో కలిసి ట్రావెల్ చేసినట్లుగా తెలిపాడు. అంతేగాదు అతడు తన ఇంటిని వదిలి ఇప్పటికీ దాదాపు 11 నెలలు పైనే అయ్యిందట. ఇప్పటి వరకు ఇద్దరూ కలిసి రామేశ్వరం, కేదార్నాథ్, బద్రీనాథ్ వంటి పుణ్యక్షేత్రాలను సందర్శించారు. ప్రస్తుతం ప్రయాగ్‌రాజ్ మార్గంలో ఉన్నట్లు ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేసిన వీడియోలో చెప్పుకొచ్చాడు. అందుకు సంబంధించిన వీడియోని అంతకుమునుపే పోస్ట్ చేసినప్పటికీ అందులో ఆడియో సరిగా లేకపోవడంతో మరోసారి రీపోస్ట్ చేశాడు సోను. దాంతో ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు కూడా..ఆ కుక్క నిజంగా చాలా అదృష్టవంతురాలు..ఏ కుక్కకి దక్కని అద్భుత అవకాశం లభించింది. బ్రో మీ ఇద్దరి మధ్య పెనవేసుకున్న ప్రేమకి ఫిదా అని కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Sonu and Charlie 🐶( Bihar 🚴) (@safarmeinrahi) (చదవండి: అమెరికా ఆఫీసులో భారతీయ మహిళ ఆకలి తిప్పలు..! పాపం ఆ రీజన్‌తో..) -
హీరో కోసం వెతుకుతున్న మహేష్!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు జియోతో కలిసి ఓ వెబ్ సిరీస్‌ను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ వెబ్ సిరీస్‌కు ‘చార్లీ’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ ప్రాజెక్ట్‌కు లీడ్ యాక్టర్స్‌ను ఫిక్స్ చేసే పనిలో ఉన్నాడు సూపర్ స్టార్. డిటెక్టివ్ తరహా కథతో రూపొందుతున్న ఈ వెబ్ సిరీస్‌లో హీరో పాత్ర బాండ్ తరహాలో అలరించనుంది. అందుకే ఈ క్యారెక్టర్ తన ఫ్యామిలీకి చెందిన హీరోతోనే చేయించే ఆలోచనలో ఉన్నాడట మహేష్. ఇప్పటికే మహేష్ అన్న, ఒకప్పటి హీరో రమేష్ బాబు కుమారుడు హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. అదే సమయంలో మహేష్ బావ, గల్లా జయదేవ్ కుమారుడు కూడా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీకి సిద్ధమవుతున్నాడు. వీరిద్దరిలో ఒకరు చార్లీలో టైటిల్లో రోల్లో కనిపించే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది. మరి మహేష్ ఎవరిని ఫైనల్ చేస్తాడో చూడాలి. -
సూపర్ స్టార్ వెబ్ సిరీస్‌కు టైటిల్ ఫిక్స్
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటుడిగానే కాదు బిజినెస్‌మేన్ గానూ బిజీ అవుతున్నాడు. ఇప్పటికే సినిమా నిర్మాణం ప్రారంభించిన మహేష్, తాజాగా డిజిటల్ మీడియాలోకి అడుగుపెట్టబోతున్నాడు. జియోతో కలిసి మహేష్ నిర్మిస్తున్న వెబ్ సిరీస్‌కు టైటిల్‌ను నిర్ణయించారు. హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ వెబ్ సిరీస్‌కు ‘చార్లీ’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. డిటెక్టివ్ తరహా కథతో రూపొందుతున్న ఈ వెబ్ సిరీస్‌ను మూడు సీజన్లలో 8 ఎపిసోడ్లుగా విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు యూనిట్. మహేష్ ప్రస్తుతం తన 25వ సినిమాగా తెరకెక్కుతున్న మహర్షి సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఏప్రిల్‌లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
స్టార్ కథానాయిక అవసరం లేదు
ముంబై: యశ్‌రాజ్ ఫిలిమ్స్ సంస్థ సారథ్యంలో త్వరలో రూపొందనున్న ‘ఫ్యాన్’ సినిమాలో కథానాయిక ఎవరనేది ఇంకా తెలియకపోయినప్పటికీ ఈ సినిమాకి స్టార్ కథానాయిక అవసరం లేదని నటుడు షారుఖ్‌ఖాన్ చెప్పాడు. 48 ఏళ్ల ఖాన్... ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కారణంగా క్షణం తీరిక లేకుండా గడుపుతున్నాడు. ‘బ్యాండ్ బాజా బారాత్’ దర్శకుడు మనీష్ శర ్మ తీస్తున్న ఈ సినిమాలో ఖాన్ రకరకాల అవతారాల్లో కనిపించనున్నాడు. ‘యశ్‌రాజ్ ఫిలిమ్స్ సంస, మనీష్ శర్మలంటే నాకు ఎంతో ఇష్టం. ఈ సినిమాలో ఇద్దరు యువతులు ఉం టారు. ఈ సినిమాకి స్టార్ కథానాయిక అవసరమే లేదు. ఇది అత్యంత ఆసక్తికరమైనదే కాకుండా విభిన్నమైన సినిమాకూడా. గత 20 సంవత్సరాల కాలంలో నేను నటించిన సినిమాల్లోకెల్లా ఇది అత్యంత సవాళ్లతో కూడినది. సినిమా నటుల అభిమానుల గురించి తీస్తున్న సినిమా ఇది’ అని అన్నాడు. కాగా ఖాన్.. రాహుల్ ధొలాకియా తీయనున్న ‘రయీస్’తోపాటు రోహిత్‌శెట్టి దర్శకత్వం వహించనున్న తాజా సినిమాలకు సంతకాలు చేసేశాడు. మరో సినిమాకు సంబంధించి చర్చలు కూడా జరుగుతున్నాయి. అయితే అది ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ‘రయీస్’ ఓ విభిన్నమైన సినిమా. దీని గురించి రాహుల్ ధొలాకియా నాకు పూర్తిగా వివరించాడు. నాకు ఎంతోబాగా నచ్చింది’ అని అన్నాడు. ఇదిలాఉంచితే దీపావళి పండుగకు విడుదల కానున్న ‘హ్యాపీ న్యూ ఇయర్’ సినిమాకు ఖాన్ అన్నివిధాలుగా సన్నద్ధమవుతున్నాడు. ఈ సినిమాకు ఫరాఖాన్ దర్శకత్వం వహించింది. -
ఒక రాత్రిలో జరిగే కథ
‘‘సమాజంలో మనకు ఎప్పుడో ఒకప్పుడు తారసపడే పాత్రలతో ఈ సినిమా చేశాను. ఒక రాత్రిలో జరిగే కథ ఇది’’ అని దర్శకుడు శివనాగరెడ్డి చెప్పారు. సింహా, అశోక్, కార్తిక్ ముఖ్యతారలుగా రేర్ డన్ పిక్చర్స్ పతాకంపై సతీష్‌రెడ్డి నిర్మిస్తున్న ‘చార్లి’ చిత్రం లోగోని ‘మధుర’ శ్రీధర్, ప్రచార చిత్రాలను మారుతి విడుదల చేశారు. ఈ సందర్భంగా ‘మధుర’ శ్రీధర్ మాట్లాడుతూ -‘‘టైటిల్ కొత్తగా ఉంది. ట్రైలర్లో క్యూరియాసిటీ కనిపిస్తోంది’’ అని అభినందించారు. ఈ నెల మూడో వారంలో చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు. గూగుల్ సంస్థలో ఉద్యోగం చేసే తనకు హీరోగా తొలి సినిమా అని సింహా చెప్పారు. మారుతి మాట్లాడుతూ -‘‘ఈ సినిమా అందరికీ నచ్చుతుంది. ఇది విజయవంతమై, దర్శక, నిర్మాతలకు మరో సినిమా చేసే శక్తినివ్వాలి’’ అన్నారు. ఈ కార్యక్రమంలో ఇంకా అశోక్, ఎఫ్.ఎం.బాబాయ్ తదితరులు మాట్లాడారు. ఈ చిత్రానికి సంగీతం: రాజేష్ ఎస్.ఎస్, కెమెరా: వరప్రసాద్. -
చార్లీ లోగో ఆవిష్కరణ మరియూ స్టిల్స్