హీరో కోసం వెతుకుతున్న మహేష్‌! | Who Is Going To Be The Hero of Mahesh Babu Web Series Charlie | Sakshi
Sakshi News home page

Feb 3 2019 12:46 PM | Updated on Feb 3 2019 12:46 PM

Who Is Going To Be The Hero of Mahesh Babu Web Series Charlie - Sakshi

టాలీవుడ్ సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు జియోతో కలిసి ఓ వెబ్‌ సిరీస్‌ను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. హుస్సేన్‌ షా కిరణ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ వెబ్‌ సిరీస్‌కు ‘చార్లీ’ అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ ప్రాజెక్ట్‌కు లీడ్‌ యాక్టర్స్‌ను ఫిక్స్‌ చేసే పనిలో ఉన్నాడు సూపర్‌ స్టార్. డిటెక్టివ్ తరహా కథతో రూపొందుతున్న ఈ వెబ్‌ సిరీస్‌లో హీరో పాత్ర బాండ్‌ తరహాలో అలరించనుంది.

అందుకే ఈ క్యారెక్టర్‌ తన ఫ్యామిలీకి చెందిన హీరోతోనే చేయించే ఆలోచనలో ఉన్నాడట మహేష్‌. ఇప్పటికే మహేష్ అన్న, ఒకప్పటి హీరో రమేష్‌ బాబు కుమారుడు హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. అదే సమయంలో మహేష్ బావ, గల్లా జయదేవ్‌ కుమారుడు కూడా సిల్వర్‌ స్క్రీన్‌ ఎంట్రీకి సిద్ధమవుతున్నాడు. వీరిద్దరిలో ఒకరు చార్లీలో టైటిల్‌లో రోల్‌లో కనిపించే అవకాశం ఉందన్న టాక్‌ వినిపిస్తోంది. మరి మహేష్ ఎవరిని ఫైనల్‌ చేస్తాడో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement