విలేజ్‌  అండ్‌  వింటేజ్‌ స్టైల్‌!

Village And Vintage Style Is Now Being Followed By The Youth - Sakshi

విలేజ్‌ అండ్‌ వింటేజ్‌ స్టైల్‌ని ఇప్పుడు యూత్‌ ఫాలో అవుతోంది. ఫోక్‌ సాంగ్స్‌ని ఆనందించినట్టే ఫోక్‌ డ్రెస్సింగ్‌తో ఆకట్టుకోవాలనుకుంటున్నారు. ట్రెండ్‌ను ఫాలో అవ్వద్దు, ట్రెండ్‌సెట్టర్‌గా ఉండాలి అనే ట్యాగ్‌తో కొంత వెస్ట్రన్‌ టచ్‌ని జత చేసి మరీ మెరిసిపోతున్నారు.  ఈ గణపతి నవరాత్రులకు మనదైన కళతో వెలిగి పోవాలనుకునేవారికి ఈ స్టైల్‌ సరైన ఎంపిక అవుతుంది. ధోతీ ప్యాంట్స్‌లో ఎన్నో మోడల్స్‌ వచ్చాయి.

ఇవి అబ్బాయిల కోసమే అనేది పాత మాట.  ప్రాచీన జానపద మూలాంశాలతో మనదైన సంప్రదాయ కళతో రూపొందింది ఈ స్టైల్‌.  టులిప్‌ ప్యాంట్‌గా టర్న్‌ అయిన ఈ స్టైల్‌ ఈ నవరాత్రి వేడుకలలో హైలైట్‌ కానుంది. హెవీ ఎంబ్రాయిడరీ, పొట్లీ, షెల్‌ లేస్‌ ఉన్న ఫ్లెయిరీ కేడియా టాప్‌ నవరాత్రి ఉత్సవంలో రాక్‌ అండ్‌ రోల్‌ చేయడానికి పర్ఫెక్ట్‌ అవుట్‌ఫిట్‌. ఇవి విదేశాలలోనూ చాలా ప్రాచుర్యం పొందాయి. చందేరీ, మధుబని, బ్లాక్‌ ప్రింట్‌లతో కలిపి ఈ ప్రత్యేకమైన దుస్తులను సిద్ధం చేస్తున్నారు డిజైనర్లు.  

షర్ట్‌ అండ్‌ స్కర్ట్‌
ప్రింటెడ్‌ స్కర్ట్‌ లేదా పలాజో స్కర్ట్, కాలర్‌ నెక్‌ షర్ట్‌ సౌకర్యంగానూ ఉంటుంది. విలేజ్‌ స్టైల్‌కి వెస్ట్రన్‌ టచ్‌ ఇచ్చినా సంప్రదాయ లుక్‌తో ఆకట్టుకుంటుంది. ట్రైబల్‌ జ్యువెలరీ ధరిస్తే చాలు న్యూ లుక్‌తో మెరిసిపోతారు.

చెక్స్‌ శారీస్‌.. 
సాంకేతికంగా ఎంత అభివృద్ధి చెందినా మనదైన సంస్కృతిని ప్రతిబింబించేది చీరకట్టు. మామూలు రోజుల్లో ఎలా ఉన్నా, పండగలు, ప్రత్యేక రోజుల్లో మాత్రం చీర ధరించడం ఇప్పటికీ చూస్తుంటాం. అయితే.. వింటేజ్, విలేజ్‌తో పాటు ఫోక్‌ స్టైల్‌ కూడా కట్టులో తీసుకురావాలంటే మాత్రం చెక్స్‌ కాటన్‌ శారీ, సిల్వర్‌ జ్యువెలరీ మంచి ఎంపిక అవుతుంది.

మనవైన హ్యాండ్లూమ్స్‌
ఇక్కత్, బ్లాక్‌ ప్రింట్‌ అనార్కలీ, అంగరఖా, లాంగ్‌ గౌన్లు విలేజ్‌ స్టైల్‌లో ఆకట్టుకుంటాయి. ఘాగ్రా లేదా ఏదైనా పట్టు లెహంగా వంటివి ధరించినప్పుడు పటోలా దుపట్టాలు వేసుకుంటే విలేజ్‌ స్టైల్‌కి దగ్గరగా ఉన్నట్టే కాదు ప్రత్యేకంగానూ కనిపిస్తారు.  

(చదవండి: ఏకే ఫ్లవర్‌ కాదు  ఫైర్‌ బోల్ట్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top