టిక్‌ టాక్‌ బామ్మ.. వయసు 78.. ఫాలోవర్లు 23 వేలు | Vijayalakshmi trending dance in Instagram | Sakshi
Sakshi News home page

టిక్‌ టాక్‌ బామ్మ.. వయసు 78.. ఫాలోవర్లు 23 వేలు

Sep 22 2024 7:14 AM | Updated on Sep 22 2024 7:14 AM

Vijayalakshmi trending dance in Instagram

ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోస్‌ ట్రెండింగ్‌ డ్యాన్స్‌ ఇరగదీస్తున్న విజయలక్ష్మి బంజారాహిల్స్‌: ఆమె భామ కాదు.. బామ్మ.. స్టేజీ ఎక్కి డ్యాన్స్‌ మొదలెట్టిందంటే చాలు.. కుర్రకారు ఈలలు, గోలలు.. ఆమె డ్యాన్స్‌ చూస్తే పెద్దవాళ్లు ఐనా సరే ముక్కున వేలు వేసుకోవాల్సిందే.. ఆమె వేసే స్టెప్పులకు కురీ్చల్లో నుంచి అమాంతం లేసి చప్పట్లు చరవాల్సిందే.. ఇంతకూ ఆ బామ్మ వయసు ఎంతో తెలుసా..! సరిగ్గా 78 ఏళ్లు.. ఆమెకు ఇన్‌స్టాలో దాదాపు 23 వేల మంది ఫాలోవర్లు ఉన్నారంటే ఆమె క్రేజ్‌ అర్థం చేసుకోవచ్చు. టిక్‌ టాక్‌ భామ్మగా పిలుచుకునే ఆమె పేరు విజయలక్ష్మి.  

పదేళ్ల పాటు హోంగార్డుగా..  
బాలానగర్‌కు చెందిన విజయలక్ష్మి పదేళ్లపాటు హోంగార్డుగా పనిచేసింది. బాలనగర్, కూకట్‌పల్లి, చందానగర్, జీడిమెట్ల, రామచంద్రాపురం పోలీస్‌ స్టేషన్ల పరిధిలో పనిచేసి ఉద్యోగ విరమణ చేసింది. మనువడు ఫోన్‌ చూసే క్రమంలో ఆమె టిక్‌ టాక్‌లో తనకు ఒక ఖాతాను ఏర్పాటు చేసుకుంది. డ్యాన్స్‌ చేయడం, నటులను అనుకరించడం, డైలాగ్‌లకు అనుగుణంగా నటించడం ప్రారంభించింది. ఇంకేముంది ఆమెను ఫాలో చేసే వారి సంఖ్య 12 లక్షలకు చేరింది. దీంతో టిక్‌ టాక్‌ బామ్మగా ఆమెకు ఎక్కడలేని గుర్తింపు వచి్చంది. అదే సమయంలో టిక్‌టాక్‌ నిషేధించడంతో టికి అనే మరో యాప్‌లోకి వెళ్లింది. అందులోనూ దాదాపు 2.5 లక్షల మంది ఫాలోవర్లు వచ్చి చేరారు. అది కూడా బ్యాన్‌ కావడంతో బామ్మ తాజాగా ఇన్‌స్టా వైపు మళ్లింది.

యూత్‌ ఫిదా.. 
తన ఇద్దరు కుమారులకు దూరమై ఒంటరిగా ఉన్న విజయలక్ష్మి అక్కడక్కడ నృత్య కార్యక్రమాలకు హాజరయ్యేది. ఈ క్రమంలోనే సినీనటి కరాటే కళ్యాణితో పరిచయం ఏర్పడి నాలుగేళ్లుగా ఆమెతోనే ఉంటోంది. బామ్మ నృత్యాలకు నెటిజన్లు అంతా ఫిదా అవుతున్నారు. ఇన్‌స్టాలో ఇప్పటికే దాదాపు 3300 డ్యాన్స్‌ వీడియోలను పోస్టు చేసింది. ఇటీవల ఆమె వినాయకుడి మండపం వద్ద వేసిన డ్యాన్స్‌ వీడియోలు ప్రస్తుతం వైరల్‌ అయ్యాయి. క్లాస్‌ అయినా, మాస్‌ అయినా పాట ఏది వచి్చనా ఆమె స్టెప్పులను ఎవరూ ఆపలేరు. యువతతో కలిసి డ్యాన్స్‌ చేయడానికి బామ్మనే పోటీపడుతుంది. ఈ వయసులోనూ ఎలాంటి ఇబ్బందీ లేకుండా డ్యాన్స్‌ చేసే 
ఆ బామ్మ ప్రతిరోజు యోగ చేస్తుంది. మితమైన, పోషకాహారం తీసుకుంటానని, అదే తన ఆరోగ్య రహస్యమని చెబుతోంది.

సినిమాల్లోకి..  
ప్రస్తుతం బామ్మ సినిమాల వైపు అడుగులు వేసింది. విడుదలకు సిద్ధమైన ‘ఉప్పు కప్పురంబు’ చిత్రంలో ఆమె బామ్మ పాత్రలో నటించింది. ఇదే కాకుండా కొన్ని ఛానెళ్లలో బామ్మ మాట పేరుతో సుభాషిౠతాలు, విలువలు, మానవ సంబంధాల గురించి వివరిస్తుంది. ఈ బామ్మకు సినీ పరిశ్రమలోనూ పలువురు ఇన్‌స్టా అభిమానులు ఉన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement