బెస్ట్‌ శాండ్‌విచ్‌గా ఈ భారతీయ స్ట్రీట్‌ ఫుడ్‌కి చోటు! | Vada Pav Named Among Best Sandwiches In The World | Sakshi
Sakshi News home page

బెస్ట్‌ శాండ్‌విచ్‌గా ఈ భారతీయ స్ట్రీట్‌ ఫుడ్‌కి చోటు! ఎన్నో ర్యాంకులో నిలిచిందంటే..

Mar 11 2024 12:09 PM | Updated on Mar 11 2024 12:28 PM

Vada Pav Named Among Best Sandwiches In The World - Sakshi

ప్రపంచంలోనే అత్యుత్తమ శాండ్‌విచ్‌గా ఈ భారతీయ స్ట్రీట్‌ ఫుడ్‌కి చోటు దక్కింది. టాప్‌ 20 బెస్ట్‌ శాండ్‌విచ్‌లో ఈ భారతీయ వంటకం ఒకటిగా నిలిచింది. ప్రముఖ ఫుడ్‌ అండ్‌ ట్రావెల్ గైడ్‌ టేస్ట్‌ అట్లాస్‌ ప్రపంచంలోని అత్యుత్తమ శాండ్‌విచ్‌ల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో భారతీయ స్ట్రీట్‌ ఫుడ్‌ అయిన వడ పావ్‌క చోటు దక్కింది. ఆ జాబితాలో ఈ రెసిపీ 19వ స్థానంలో నిలవడం విశేషం.

టేస్ట్‌ అట్లాస్‌ ప్రకారం..ఈ ఐకానిక్‌ స్ట్రీట్‌ ఫుడ్‌ తయారీ ముంబైలోని ఓ వీధి వ్యాపారి నుంచి మొదలయ్యిందని పేర్కొంది. 1960-1970లలో దాదర్‌ రైలు స్టేషన్‌ సమీపంలో పనిచేసిన ఆశోక్‌ వైద్య అనే వీధి వ్యాపారీ  ఈ వంటకాన్ని తయారు చేసినట్లు వెల్లడించింది. ఆయన అక్కడ పనిచేసే కార్మికుల ఆకలి తీర్చేలా మంచి వంటకాన్ని తయరు చేయాలని, అలాగే అది సులభంగా త్వరిగతిన చేయగలిగేలా ఉండాలని అనుకున్నారట.

అప్పుడే ఈ రుచికరమైన వడాపావ్‌ని తయారు చేసినట్లు తెలిపింది. అలాఅలా  ఇది వీధి స్టాల్స్‌ నుంచి ప్రుమఖ రెస్టారెంట్ల వరకు ప్రతి చోటా తయారయ్యే మంచి రుచికరమైన చిరుతిండిగా పేరుగాంచింది. ఈ జాబితాలో థంబిక్‌ డోనర్‌, బన్హమీ, షోర్మా వంటి చిరుతిండ్లు అగ్రస్థానంలో ఉన్నాయి. అందుకు సంబంధించిన పూర్తి జాబితాను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది టేస్టీ అట్లాస్‌. అలాగే ఇటీవల టేస్టీ అట్లాస్‌ విడుదల చేసి అత్యుతమ కాఫీ జాబితాలో భారతీయ ఫిల్టర్‌ కాఫీ రెండో స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. 

(చదవండి: మన దేశంలోని టాప్‌ మహిళా చెఫ్‌లు వీరే!)

Advertisement
 
Advertisement
Advertisement