ఆహారంతోనే ఆరోగ్యం సంరక్షించబడుతుంది | Health Is Preserved Through Food, Laxman Arogyagramam Marks First Anniversary, Promotes Healthy Eating And Wellness | Sakshi
Sakshi News home page

ఆహారంతోనే ఆరోగ్యం సంరక్షించబడుతుంది

Oct 27 2026 10:09 AM | Updated on Oct 27 2026 10:59 AM

Health is preserved through food

లక్ష్మణ్ ఆరోగ్యగ్రామం ప్రథమ వార్షికోత్సవ వేడుకలు 
సంపూర్ణ ఆరోగ్యం, సహజ జీవన విధానం
ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన కల్పించడమే లక్ష్యం

హైదరాబాద్ : సంపూర్ణ ఆరోగ్యం, ఆరోగ్యకరమైన జీవనశైలి, పోషకాహారం మరియు శారీరక, మానసిక శ్రేయస్సుపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్న లక్ష్మణ్ ఆరోగ్యగ్రామం తన ప్రథమ వార్షికోత్సవ వేడుకలను నేడు నిర్వహించింది. ఈ కార్యక్రమానికి చేవెళ్ల ఎమ్మెల్యే శ్రీ కాలే యాదయ్య గారు, మాజీ సీబీఐ జాయింట్ డైరెక్టర్, హైడ్రా కమిషనర్ శ్రీ ఏ.వి. రంగనాథ్ గారు, అరుణోదయ విమలక్క, సుమన్ టీవీ వ్యవస్థాపకులు శ్రీ సుమన్ దూది గారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. 

అలాగే సినీ, వినోద రంగానికి చెందిన ప్రముఖులు నటుడు సప్తగిరి, కిరాక్ ఆర్‌పీ, ఫైట్ మాస్టర్స్ రామ్–లక్ష్మణ్, వందేమాతరం శ్రీనివాస్ గారు తదితరులు ఈ వేడుకల్లో పాల్గొని అభినందనలు తెలిపారు. లక్ష్మణ్ పూడి స్థాపించిన లక్ష్మణ్ ఆరోగ్యగ్రామం, ఆరోగ్యదాయకమైన జీవన విధానాన్ని ప్రజలకు చేరువ చేయడం, ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడం, ప్రతిరోజూ ఆరోగ్యకరమైన అలవాట్లను పాటించేలా ప్రజలను ప్రోత్సహించడం వంటి లక్ష్యాలతో ముందుకు సాగుతోంది అని లక్షణ్ తెలిపారు. 

హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు మాట్లాడుతూ నేటితరం ఆహారం అంతా కల్తీ అయిపోయింది అని చాలా హోటల్స్ రెస్టారెంట్స్ ఫుడ్ సేఫ్టీని పాటించకుండా గవర్నమెంట్ ఆదేశాలను దిక్కరిస్తూ ఆహారం సరఫరా చేస్తున్నాయని ఇవి ప్రజలకు హానికరం ఇలాంటివన్నీ మారాలి తర్వాతి తరం వారికి మనం ఇచ్చే సంపద కంటే నీరు ఆహారం వంటివే ప్రముఖము, ఇలాంటి ఆరోగ్య కేంద్రాలు పోషక ఆహారాలు, ప్రకృతి సేద్యం, ద్వారా ఆహారాన్ని అందించడం చాలా మంచిది, నేటితరం జెన్ జి కచ్చితంగా తినే ఆహారం, పొల్యూషన్ కంట్రోల్, మంచినీరు వినియోగం వంటివి కచ్చితంగా నేర్చుకోవాలి, పాటించాలి అని తెలిపారు. 

ఈ సంస్థ ద్వారా సమతుల్య ఆహారం, పోషకాహారం, ఆరోగ్య సంరక్షణ, వ్యాధుల నివారణకు సంబంధించిన అవగాహనతో పాటు సంపూర్ణ ఆరోగ్యానికి అవసరమైన జీవనశైలి మార్పుల ప్రాధాన్యతను ప్రజలకు తెలియజేయాలని నిర్వాహకులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఒక సంవత్సరం విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న ఈ వేడుకలు, భవిష్యత్తులో మరిన్ని ఆరోగ్య అవగాహన కార్యక్రమాలను చేపట్టేందుకు స్ఫూర్తినిస్తాయని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 

లక్ష్మణ్ ఆరోగ్యగ్రామం గురించి లక్ష్మణ్ పూడి స్థాపించిన లక్ష్మణ్ ఆరోగ్యగ్రామం, ఆరోగ్యకరమైన జీవన విధానం, పోషకాహారం, సంపూర్ణ ఆరోగ్యం మరియు శ్రేయస్సుపై అవగాహన కల్పించడమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తోంది. ఆరోగ్యమే మహాభాగ్యం అనే భావనతో ప్రజలు తమ దైనందిన జీవితంలో ఆరోగ్యకరమైన అలవాట్లను భాగం చేసుకోవాలని ఈ సంస్థ ప్రోత్సహిస్తోంది.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement