నెలకు రూ.2.5 లక్షలా! మౌనం వీడిన సెలబ్రిటీ నానీ | Taimur ali khan nanny Lalita Dsilva breaks silence on her pay | Sakshi
Sakshi News home page

నెలకు రూ.2.5 లక్షలా! మౌనం వీడిన సెలబ్రిటీ నానీ

Jul 28 2024 2:18 PM | Updated on Jul 28 2024 2:23 PM

Taimur ali khan nanny Lalita Dsilva breaks silence on her pay

‘మీ నోట్లో చక్కెర పొయ్య! నిజంగా   రూ. 2.5 లక్షలు కోరుకుంటున్నా-లలితా డిసిల్వా 

ఇదిగో పులి అంటే.. అదిగో తోక అంటారు. ఇదీ ప్రస్తుతకాలంలో సోషల్‌ మీడియా మహిమ. బాలీవుడ్‌ స్టార్‌కపుల్‌ సైఫ్‌ అలీ ఖాన్‌-కరీనాకపూర్‌ల ముద్దుల తనయుడు తైమూర్‌ అలీ ఖాన్‌ ఆయా జీతం నెలకు రూ. 2.5 లక్షలు అంటూ  ఆ మధ్య ఒక వార్త  తెగ వైరల్‌ అయింది. అయితే తాజాగా ఈ వార్తలపై తైమూర్‌  నానీ, లలితా డిసిల్వా,  తొలి సారి స్పందించారు.

కరీనా కపూర్‌ పెద్ద కొడుకు తైమూర్‌  నానీగా లలితా డిసిల్వా ఇంటర్నెట్‌లో బాగా ప్రాచుర్యం పొందారు.  టాప్‌ సీఈఓల కంటే లలిత ఎక్కువ సంపాదిస్తున్నారని పలు నివేదికలు తెలిపాయి. ఈ రూమర్స్‌పై ఎట్టకేలకు ఆమె మౌనం వీడారు.  హిందీ రష్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, నెలవారీ జీతం రూ. 2.5 లక్షలు ఉందా అని అడిగినప్పుడు, లలిత ‘రూమర్స్‌’కి నవ్వుతూ, ‘‘ మీ నోట్లో చక్కెర పొయ్య! నిజంగా నేను రూ. 2.5 లక్షలు కోరుకుంటున్నాను.’’ అంటూ  సమాధానమిచ్చారు.  తద్వారా అవన్నీ పుకార్లే అని తేల్చారు. అంతేకాదు  కరీనా , ఆమె కుటుంబ సభ్యులు ‘సింపుల్‌ పీపుల్‌’ అని కూడా ప్రశంసించారు.  సిబ్బందితో ప్రేమగా ఉంటారు. అందరమూ ఒకటే ఆహారం తింటాం. చాలా సార్లు అందరం కలిసి భోజనం చేస్తాం అని కూడా ఆమె  తెలిపారు.

లలితా డిసిల్వా 
లలితా డిసిల్వా ముంబైలో ఉన్న  ప్రముఖ పీడియాట్రిక్‌ నర్సు, ఆమె సైఫ్‌ అలీ ఖాన్‌, కరీనా కపూర్‌ల ఇద్దరు కుమారులను పుట్టినప్పటి నుంచి దగ్గరుండి చూసుకుంది. అంతకుముందు డిసిల్వా ఆసియా అత్యంత ధనవంతుడు ముఖేష్‌ అంబానీ ఇంట్లో పనిచేశారు. యువ అనంత్‌ అంబానీని చూసుకున్నారు. ఇటీవల అనంత్‌అంబానీ, రాధిక మర్చంట్‌ వివాహానికి లలితను ఆహ్వానించిన సంగతి తెలిసిందే.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement