breaking news
breaks silence
-
నెలకు రూ.2.5 లక్షలా! మౌనం వీడిన సెలబ్రిటీ నానీ
ఇదిగో పులి అంటే.. అదిగో తోక అంటారు. ఇదీ ప్రస్తుతకాలంలో సోషల్ మీడియా మహిమ. బాలీవుడ్ స్టార్‌కపుల్ సైఫ్ అలీ ఖాన్-కరీనాకపూర్ల ముద్దుల తనయుడు తైమూర్ అలీ ఖాన్ ఆయా జీతం నెలకు రూ. 2.5 లక్షలు అంటూ ఆ మధ్య ఒక వార్త తెగ వైరల్ అయింది. అయితే తాజాగా ఈ వార్తలపై తైమూర్ నానీ, లలితా డిసిల్వా, తొలి సారి స్పందించారు.కరీనా కపూర్ పెద్ద కొడుకు తైమూర్ నానీగా లలితా డిసిల్వా ఇంటర్నెట్లో బాగా ప్రాచుర్యం పొందారు. టాప్ సీఈఓల కంటే లలిత ఎక్కువ సంపాదిస్తున్నారని పలు నివేదికలు తెలిపాయి. ఈ రూమర్స్‌పై ఎట్టకేలకు ఆమె మౌనం వీడారు. హిందీ రష్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, నెలవారీ జీతం రూ. 2.5 లక్షలు ఉందా అని అడిగినప్పుడు, లలిత ‘రూమర్స్’కి నవ్వుతూ, ‘‘ మీ నోట్లో చక్కెర పొయ్య! నిజంగా నేను రూ. 2.5 లక్షలు కోరుకుంటున్నాను.’’ అంటూ సమాధానమిచ్చారు. తద్వారా అవన్నీ పుకార్లే అని తేల్చారు. అంతేకాదు కరీనా , ఆమె కుటుంబ సభ్యులు ‘సింపుల్ పీపుల్’ అని కూడా ప్రశంసించారు. సిబ్బందితో ప్రేమగా ఉంటారు. అందరమూ ఒకటే ఆహారం తింటాం. చాలా సార్లు అందరం కలిసి భోజనం చేస్తాం అని కూడా ఆమె తెలిపారు.లలితా డిసిల్వా లలితా డిసిల్వా ముంబైలో ఉన్న ప్రముఖ పీడియాట్రిక్ నర్సు, ఆమె సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ల ఇద్దరు కుమారులను పుట్టినప్పటి నుంచి దగ్గరుండి చూసుకుంది. అంతకుముందు డిసిల్వా ఆసియా అత్యంత ధనవంతుడు ముఖేష్ అంబానీ ఇంట్లో పనిచేశారు. యువ అనంత్ అంబానీని చూసుకున్నారు. ఇటీవల అనంత్అంబానీ, రాధిక మర్చంట్ వివాహానికి లలితను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. -
నేను నెపోలియన్‌ను కాదు
న్యూఢిల్లీ: పార్టీలో నెలకొన్న సంక్షోభంపై ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎట్టకేలకు మౌనం వీడారు. ప్రత్యేక చికిత్స కోసం బెంగళూరు వెళ్లిన ఆయన తొలిసారిగా పార్టీకి సందేశాన్ని పంపారు. డిల్లీ లో మంచి ప్రభుత్వాన్నందించడం ద్వారా వ్యవస్థ మార్పు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. తాను నెపోలియన్ కాదని, రాజకీయ వ్యవస్థను మార్చడమే పార్టీ లక్ష్యమని పేర్కొన్నారు. అయితే గతవారంరోజులుగా పార్టీపైనా, ఆయన పైనా వచ్చిన ఆరోపణలపై ఎలాంటి కమెంట్ చేయలేదు. ఢిల్లీని ఒక నమూనా నగరాన్ని గా చూపించాం. ప్రపంచంలోనూ, దేశంలోనూ ఒక కొత్త తరహా ప్రభుత్వానికి నాంది పలికాం. దీన్న మిగిలిన ప్రాంతాలకు కూడావిస్తరించాలనుకుంటున్నామని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. కాయకల్ప చికిత్సకోసం ముఖ్యమంత్రి కేజ్రీవాల్ బెంగళూరుకు వెళ్లిన తరువాత పార్టీలో వివిధ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ఆప్ మాజీ ఎమ్మెల్యే విడుదలచేసిన ఆడియో టేపుల సంచలనం, మహారాష్ట్ర నేత అంజలీ దమానియా రాజీనామా తెలిసిందే.