నేను నెపోలియన్ను కాదు | Arvind Kejriwal breaks his silence, says he aims to reform the political system | Sakshi
Sakshi News home page

నేను నెపోలియన్ను కాదు

Mar 14 2015 11:42 AM | Updated on Sep 2 2017 10:51 PM

పార్టీలో నెలకొన్న సంక్షోభంపై ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎట్టకేలకు మౌనం వీడారు.

న్యూఢిల్లీ:   పార్టీలో నెలకొన్న సంక్షోభంపై ఆప్  అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్  ఎట్టకేలకు మౌనం   వీడారు. ప్రత్యేక చికిత్స కోసం బెంగళూరు వెళ్లిన ఆయన తొలిసారిగా పార్టీకి   సందేశాన్ని పంపారు. డిల్లీ లో  మంచి ప్రభుత్వాన్నందించడం ద్వారా వ్యవస్థ మార్పు  కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. తాను  నెపోలియన్ కాదని,  రాజకీయ వ్యవస్థను మార్చడమే పార్టీ లక్ష్యమని పేర్కొన్నారు.   అయితే గతవారంరోజులుగా పార్టీపైనా, ఆయన పైనా వచ్చిన ఆరోపణలపై  ఎలాంటి కమెంట్ చేయలేదు.  ఢిల్లీని ఒక  నమూనా నగరాన్ని గా చూపించాం.  ప్రపంచంలోనూ, దేశంలోనూ ఒక కొత్త తరహా ప్రభుత్వానికి  నాంది పలికాం.   దీన్న మిగిలిన ప్రాంతాలకు కూడావిస్తరించాలనుకుంటున్నామని  ఆయన ఒక  ప్రకటనలో తెలిపారు.

కాయకల్ప చికిత్సకోసం ముఖ్యమంత్రి కేజ్రీవాల్ బెంగళూరుకు వెళ్లిన తరువాత పార్టీలో  వివిధ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ఆప్ మాజీ ఎమ్మెల్యే విడుదలచేసిన ఆడియో టేపుల సంచలనం, మహారాష్ట్ర నేత అంజలీ  దమానియా  రాజీనామా తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement