Sticky Coconut Rice Balls With Jaggery - Know How To Make This Recipe - Sakshi
Sakshi News home page

Coconut Rice Balls: పసందైన స్నాక్స్‌.. కమ్మని కోకోనట్‌ రైస్‌ బాల్స్‌ 

Jul 11 2023 5:03 PM | Updated on Jul 14 2023 3:19 PM

Sticky Coconut Rice Balls With Jaggery - Sakshi

కోకోనట్‌ రైస్‌ బాల్స్‌ కావల్సినవి: 
కొబ్బరి పాలు – ముప్పావు కప్పు
బియ్యప్పిండి – అర కప్పు
జొన్న పిండి – 2 టేబుల్‌ స్పూన్స్‌
ఉప్పు – తగినంత
కొబ్బరి కోరు, కాచిన పాలు – కొద్దికొద్దిగా (గార్నిష్‌కి అభిరుచిని బట్టి)

తయారీ విధానమిలా..
ముందుగా కొబ్బరి పాలలో కొద్దిగా ఉప్పు వేసుకుని.. చిన్న మంట మీద మరిగించాలి. అనంతరం బియ్యప్పిండి వేసి గరిటెతో తిప్పుతూ ఉండాలి. దగ్గర పడే సమయంలో మళ్లీ జొన్న పిండి వేసి తిప్పుతూ ఉండాలి. బాగా దగ్గర పడిన తర్వాత చల్లార్చి.. చేతులకు నూనె రాసుకుని.. చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి.

వాటిని ఆవిరిపై బాగా ఉడికించుకుని.. వేడివేడిగా ఉన్నప్పుడు గరిటె సాయంతో ఒక్కో బాల్‌ని పాలలో ముంచి.. కొబ్బరి కోరు పట్టించి సర్వ్‌ చేసుకోవచ్చు. అభిరుచిని బట్టి ఆవిరిలోంచి తియ్యగానే.. తాలింపు వేసుకోవచ్చు. లేదా బెల్లం పాకంలో వేసుకుని, నానిన తర్వాత సర్వ్‌ చేసుకోవచ్చు.

Advertisement
 
Advertisement
Advertisement