పెళ్లెప్పుడంటే...? | South Indian female actor Sai Pallavi comments on marriage | Sakshi
Sakshi News home page

పెళ్లెప్పుడంటే...?

Feb 23 2025 12:30 AM | Updated on Feb 23 2025 12:30 AM

South Indian female actor Sai Pallavi comments on marriage

సాయిపల్లవి తన వ్యక్తిగత విషయాలను మీడియాతో చాలా అరుదుగా మాత్రమే పంచుకుంటుంది. పెళ్లెప్పుడని ఆమెను అడిగితే, కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పింది. ఈ నేపథ్యంలోనే సాయిపల్లవి ఇష్టాయిష్టాలు, ఆమె జీవితం గురించి కొన్ని ఆసక్తికర విషయాలు మీకోసం..

⇒ తల్లిదండ్రులను, పుట్టిన ఊరిని విడిచి పెట్టడం సాయిపల్లవికి ఇష్టం లేదు. పెళ్లి తర్వాత తనని అన్నీ విడిచి రమ్మని చెప్పే వారిని అసలు పెళ్లే చేసుకోనని ‘అస్ట్రో ఉలగం’ అనే తమిళ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది.

⇒ సాయిపల్లవిది బడగ గిరిజన కుటుంబం. ఆమె తల్లి రాధామణి సాయిబాబా భక్తురాలు. అందుకే, ఆమె పేరులో ‘సాయి’ అని చేర్చారు.

⇒ డ్యాన్స్‌ అంటే పిచ్చి, కేవలం టీవీలో మాధురీ దీక్షిత్, ఐశ్వర్యా రాయ్‌ డ్యాన్స్‌ వీడియోలను చూస్తూ డ్యాన్స్‌ నేర్చుకుంది. మెడిసిన్‌ చదువులో చేరడానికి ముందు ‘ధామ్‌ ధూమ్‌’, ‘కస్తూరిమాన్‌’ అనే తమిళ సినిమాల్లో నటించింది.

⇒ మొదటిసారి టీ రుచి చూసింది ‘ప్రేమమ్‌’ సినిమా షూటింగ్‌ సెట్‌లోనే.. అప్పటి వరకు ఆమెకు టీ, కాఫీ అలవాటే లేదు. హీరోయిన్‌గా అదే ఆమె మొదటి సినిమా.

⇒ భాష ఏదైనా తన వ్యక్తిత్వానికి దగ్గరగా ఉండే పాత్రలనే ఎంపిక చేసుకుంటారట సాయిపల్లవి.

⇒ అసలైన అందం మనిషి మనసులో ఉంటుందని, రూ. 2 కోట్ల విలువైన బ్యూటీ ప్రోడక్ట్‌ యాడ్‌ను తిరస్కరించింది.

⇒ బన్‌తో తయారుచేసే ఆహారం, కొబ్బరి నీళ్లు ఇష్టం. వంట వండటం, తోటపని, తేనెటీగల పెంపకం ఆమెకు ఇష్టమైన పనులు.

⇒ దైవ భక్తి ఎక్కువ. తన తాతయ్య ఇచ్చిన రుద్రాక్ష మాలను ఎప్పుడూ చేతికి ధరిస్తుంది.

⇒ సినిమాల్లోకి రాకముందు సాయిపల్లవి చేసిన ఓ డ్యాన్స్ వీడియో వైరల్‌గా మారింది. అప్పుడే  ఇకపై శరీరం ఎక్కువగా కనిపించేలా దుస్తులు వేసుకోకూడదని నిర్ణయించుకుంది. అందుకే, ఎక్కువ సంప్రదాయ దుస్తుల్లోనే కనిపిస్తుంది.

⇒ ప్రస్తుతం బుజ్జితల్లిగా ‘తండేల్‌’ చిత్రంతో ప్రేక్షకులను అలరిస్తోంది. బాలీవుడ్‌లో ‘రామాయణ’ అనే పాన్‌ ఇండియా సినిమాలోనూ నటిస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement