వంటల ఘుమఘుమలతో కూడా కాలుష్యానికి ముప్పేనట | Sakshi
Sakshi News home page

వంటల ఘుమఘుమలతో కూడా కాలుష్యానికి ముప్పేనట

Published Thu, May 9 2024 3:42 PM

Smell Of Cooking Food Is Possibly Polluting The Air You Breathe, Finds Study

వంట చేయడం వల్ల వచ్చే పొగ నుంచి గాలి  కాలుష్యమవుతుంది. ఇటీవల కార్లలో వాసన చూస్తే కేన్సర్‌ వస్తుందని పలు నివేదికలు హల్‌ చల్‌  చేశాయి. తాజాగా మరో అధ్యయనం దిగ్భ్రాంతి రేపుతోంది. అదేంటో తెలియాలంటే  మీరీ కథనం చదవాల్సిందే!

పప్పు పోపు, పులిహోర తాలింపు, చికెన​్‌, మటన్‌ మసాలా ఘుమ ఘుమలు లాంటివి రాగానే గాలి ఒకసారి అలా గట్టిగాపైకి ఎగ పీల్చి.. భలే వాసన అంటాం కదా. కానీ ఇలా వంట చేసేటపుడు వచ్చే వాసన గాలిని కలుషితం చేస్తుందని అధ్యయనం కనుగొంది. అమెరికాలో అత్యధిక సంఖ్యలో తినుబండారాలను కలిగి ఉన్న లాస్ వెగాస్‌లో గాలి నాణ్యత సమస్య ఎక్కువగా ఉందని  పరిశోధకులు  గుర్తించారు.

నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ (NOAA) చేసిన ఈ  పరిశోధనలో రెస్టారెంట్లు, ఫుడ్ ట్రక్కులు , వీధి వ్యాపారుల వద్ద వంట చేసే రుచికరమైన వాసన గాలి నాణ్యతను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందని కనుగొంది.  పట్టణ వాయు కాలుష్యం ప్రభావంపై  కెమికల్ సైన్సెస్ లాబొరేటరీ (CSL) పరిశోధకులు ఆశ్చర్యకరమైన ఫలితాలను విడుదల చేశారు. అమెరికాలోని  లాస్ ఏంజిల్స్, లాస్ వేగాస్ ,కొలరాడోలోని బౌల్డర్ మూడు నగరాలపై దృష్టి సారించారు. ఈ నగరాల్లో  వంటకు సంబంధించిన మానవ-కారణమైన అస్థిర కర్బన సమ్మేళనాలను (VOCలు) కొలుస్తారు. మీకు వాసన వచ్చిందంటే, అది గాలి నాణ్యతను ప్రభావితం చేసే మంచి అవకాశం ఉందంటున్నారు పరిశోధకులు.

వెగాస్  బహిరంగ గాలిలో ఉన్న మొత్తం  కర్బన సమ్మేళనాల్లో 21 శాతం వంటలనుంచి వచ్చినవేనని అధ్యయన రచయిత మాట్ కాగన్ చెప్పారు. వాహనాలు, అడవి మంటల పొగ, వ్యవసాయం, వినియోగదారు ఉత్పత్తులు వంటి విభిన్న వనరుల ఉద్గారాలను పరిశోధకులు అంచనా వేశారు. పట్టణాల్లో వీటిని  లాంగ్-చైన్ ఆల్డిహైడ్‌లు అని పిలుస్తామని వెల్లడించారు.  అయితే వంట చేయడం వల్ల వచ్చే వాయు కాలుష్యం చాలా తక్కవే అని తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో దాదాపు నాలుగింట ఒక వంతు ఉద్గారాలకు వంట వాసన కారణమవుతుందని పరిశోధకులు నిర్ధారించారు. అంతేకాదు ఇంటి లోపల ,ఇళ్ల లోపల సమస్య మరింత తీవ్రంగా ఉందని నిపుణులు హెచ్చరించారు.

 

Advertisement
 
Advertisement
 
Advertisement