‘ఓల్డ్‌ బట్‌ గోల్డ్‌’ యూట్యూబ్‌ చానల్‌తో.. షోమ్‌ మ్యూజికల్‌ జర్నీ.. | Shahana Shome Musical Journey | Sakshi
Sakshi News home page

‘ఓల్డ్‌ బట్‌ గోల్డ్‌’ యూట్యూబ్‌ చానల్‌తో.. షోమ్‌ మ్యూజికల్‌ జర్నీ..

Jan 5 2024 1:41 PM | Updated on Jan 5 2024 4:40 PM

Shahana Shome Musical Journey - Sakshi

'షహన షోమ్‌' మ్యూజికల్‌ జర్నీ తన అధికార యూట్యూబ్‌ చానల్‌ ‘వోల్డ్‌ బట్‌ గోల్డ్‌’తో మొదలైంది. దీని ద్వారా బాలీవుడ్‌ టైమ్‌లెస్‌ మెలోడిస్‌ను వినిపించి ఆబాలగోపాలాన్ని అలరిస్తోంది. ‘మొహబ్బత్‌ కర్నే వాలే’ లాంటి క్లాసిక్‌తో పాటు ‘సేవ్‌ ది గర్ల్‌చైల్డ్‌’ ‘ఎడ్యుకేషన్‌ ఫర్‌ ది అండర్‌ప్రివిలేజ్‌డ్‌’ లాంటి సామాజిక స్పృహతో కూడిన ఇతివృత్తాలతో పాటలు పాడుతుంది. చిన్నప్పుడు సినిమా పాటలే కాదు క్లాసిక్‌ గజల్స్, కీర్తనలు పాడేది.

ప్రముఖ సంగీతకారుల వర్థంతిని దృష్టిలో పెట్టుకొని వారికి నివాళిగా యూట్యూబ్‌లో చేసే పాటల కార్యక్రమాలు సూపర్‌హిట్‌ అయ్యాయి.పాత పాటలు పాడుతుంటే కాలమే తెలియదు. 'టైమ్‌మెషిన్‌లో గతంలోకి  వెళ్లినట్లుగా అనిపిస్తుంది’ అంటున్న షహనకు దేశవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులు ఉన్నారు. తన పాటల ద్వారా వివిధ సామాజిక సేవాకార్యక్రమాలకు నిధులను సేకరించడంలో కూడా ముందు ఉంటుంది. 'పాటల ద్వారా సామాజిక సందేశాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడం నా లక్ష్యాలలో ఒకటి’ అని చెబుతుంది షహన.

ఇవి చదవండి: ముగ్గురు మిత్రుల ముచ్చటైన విజయం

Advertisement
 
Advertisement
Advertisement