కార్తిక మాసంలో దీపం వెలిగిస్తే ఇంతటి పుణ్యమా? | Devotional Story On Kartika Deepam Spiritual Significance | Sakshi
Sakshi News home page

కార్తిక మాసంలో దీపం వెలిగిస్తే ఇంతటి పుణ్యమా?

Nov 10 2026 7:50 AM | Updated on Nov 10 2026 7:50 AM

Devotional Story On Kartika Deepam Spiritual Significance

దేహం ప్రమిద – అహమే వత్తి

కార్తిక మాసంలో దీపారాధనకు పరమోత్కృష్టమైన స్థానం ఉంది. కార్తిక దీపం కేవలం చీకటిని పోగొట్టే కాంతి పుంజం మాత్రమే కాదు; అది మానవ జీవన వికాసానికీ, ముక్తి మార్గానికీ దివ్యసంకేతం.

పద్మ పురాణంలోని ఒక కథ ప్రకారం... ఒక సాధారణ ఎలుక, కార్తిక మాసంలో శివాలయంలో కొండెక్కుతున్న (ఆరిపోతున్న) దీపపు వత్తిని అనుకోకుండా తన నోటితో సరిచేసి, కాంతిని పునరుద్ధరించింది. ఆ చిన్న పుణ్యకార్యం వల్లే ఆ జీవి మరుసటి జన్మలో మహా పరాక్రమవంతుడైన ‘బలి చక్రవర్తి’గా జన్మించి, అంతిమంగా ఉత్తమ గతిని పొందింది.

కేవలం ఒక అల్పజీవి అజ్ఞానంతో చేసిన దీపసేవకే అంతటి సద్గతి లభిస్తే, ఇక సద్భావంతో వెలిగించే దీపం మానవాళిని ఏ స్థాయికి తీసుకెళ్తుందో ఊహించవచ్చు.

ఈ బాహ్య దీపారాధన వెనుక ఒక గూఢమైన అంతఃసత్యం దాగి ఉంది. అదే ‘ఆత్మ దీపం’. మన స్థూల శరీరమే ఒక ‘మృణ్మయ ప్రమిద’. అందులో నిండివున్న ‘నేను, నాది’ అనే భ్రమలే (అహంకారం) మనం సమర్పించవలసిన ‘వత్తి’. ప్రాపంచిక వాసనలనే ‘నెయ్యి’ని పోసి, సద్గురువు అందించే జ్ఞానమనే ‘అగ్ని’తో ఆ అహాన్ని దహించినప్పుడే అంతరంగంలో జ్ఞానదీపం ప్రజ్వరిల్లుతుంది.

అహంకారం అనే వత్తి పూర్తిగా కరిగిపోయినప్పుడు, జీవుడు పరమాత్మ కాంతిలో లీనమవుతాడు. ఈ కార్తిక మాసంలో దేహమనే ప్రమిదలో అహాన్ని వత్తిగా మార్చి వెలిగించి, పరమాత్మ అనుగ్రహంతో సద్గతిని పొందుదాం.
– తూలుగు రమణారావు

ఇదీ చదవండి: కార్తీక మాసంలో ఈ వ్రతం ఆచరిస్తే ఇంతటి ఫలితమా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement