
ఈ వానాకాలంలో గత కొన్నాళ్లుగా... ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. ఈ వానాకాలపు సీజన్‌లోఎంత వర్షం పడిందో తెలిపే సెంటీమీటర్లూ... అలాగే జ్వరం తీవ్రత తెలిపే థర్మామీటర్ల రీడింగులూ పోటాపోటీగా పెరుగుతూపోతుంటాయి. ఎందుకంటే... వర్షం రాబోయే పంట సీజన్‌కు మంచి పంటలనే కాదు వర్తమానంలో జ్వరాలు, ఇన్ఫెక్షన్ల తంటాలనూ ప్రామిస్ చేస్తుంది. అందుకే ఓ పక్క మోద ప్రమోదాలతోపాటు మరో పక్క ఖేద ప్రమాదాలను తెచ్చిపెట్టే రెయినీ సీజన్ పెచ్చరిల్లజేసే వానల వ్యాధుల గురించి తెలుసుకుందాం. వర్షపు వ్యాధుల ముప్పులనుంచి కాపాడుకోవడమెలాగో అవగాహన పెంచుకుందాం...
వానల్లో హాయిగా పకోడీలు తింటూ, కిటికీలోంచి చినుకులను చూసే అదృష్టం కొద్దిమందికే ఉంటుంది. చాలామంది రెయిన్‌కోట్ తొడుక్కునో లేదా గొడుగు పట్టుకునో... అవేవీ లేనివాళ్లు తడుస్తూనైనా వర్షాల్లో తమ పనులకూ / ఆఫీసులకూ వెళ్లి తీరాల్సిందే.
ఈ నేపథ్యంలో తడవడంతో వచ్చే అనారోగ్యాలతో పాటు... ఈ సీజన్‌లోనే పెరిగే వ్యాధుల గురించి తెలుసుకుని జాగ్రత్త పడాల్సిన అవసరముంది. చిన్నారులు తమ ఆటలో భాగంగా వానలో తడిసేందుకు ఆసక్తి చూపుతారు. అలా వాళ్లు జలుబూ, జ్వరాలు తెచ్చిపెట్టుకుంటారు. ఇక వృద్ధులకు ఈ సీజన్ ఓ ప్రమాదకారిలా అనేక ముప్పులు తెచ్చిపెడుతుంది. వాన వ్యాధుల గురించి అవగాహన పెంచుకోవడంతో వాటిని చాలావరకు నివారించుకోవచ్చు. అదెలాగో చూద్దాం.
వర్షాలు అనేక రకాలుగా అనారోగ్య సమస్యలను తెచ్చిపెడతాయి. మొదటిది నేరుగా తడవడం వల్ల వచ్చే జలుబూ, జ్వరాలు ఒక తరహావి. ఇక ఈ సీజన్‌లో నీటిగుంటల్లో చేరే నీరు కారణంగా దోమల ప్రత్యుత్పత్తి (బ్రీడింగ్)తో వాటి సంఖ్య విపరీతంగా పెరగడం, దాంతో అవి వ్యాప్తి చేసే వ్యాధులు మరో తరహావి అయితే... ఇదే సీజన్‌లో ముసురుకునే ఈగలు వ్యాప్తి చేసే జబ్బులూ... వెరసి ఇవన్నీ అనేక అనారోగ్య సమస్యలకు కారణమవుతాయి. ఇక ఇంకో తరహా ముప్పు ఏమిటంటే... వాన నీరు భూమి ఉపరితలాన్ని తడిపేయడంతో ఎలకలు తమ బొరియల్లోంచి పైకి వచ్చి, ఇళ్లలోని కిచెన్ ఫ్లాట్‌ఫారమ్ మీద ఉన్న ఆహారాలను కలుషితం చేయడంతో వచ్చే లెప్టోస్పైరోసిస్ లాంటి జ్వరాలను తెచ్చిపెట్టడం మరో ముప్పు. వృద్ధుల్లాంటి వారు బురదలో కాలుజారి ఎముకలకు ప్రమాదాలు తెచ్చిపెట్టుకోవడం వంటి ట్రామా కేసులకూ ఈ సీజన్ కారణమవుతుంటుంది. ఇలా ఒక్కో తరహా ముప్పుల తీరుతెన్నులను పరిశీలిద్దాం...
నీరు కలుషితం కావడం కారణంగా...
వర్షాల సీజన్‌లో నీరు కలుషితం కావడం (వాటర్ కంటామినేషన్) వల్ల టైఫాయిడ్, కలరా, షిజెల్లోసిస్, ఈ–కొలై వంటి వ్యాధులు ఎక్కువగా కనిపిస్తుంటాయి. అలా నీరు కలుషితం కావడం వల్ల కనిపించే ప్రధాన వ్యాధులు...
టైఫాయిడ్ : సాల్మొనెల్లా టైఫీ అనే బ్యాక్టీరియా వల్ల ఈ వ్యాధి వస్తుంది. జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. బ్లడ్ కల్చర్, స్టూల్ కల్చర్, వైడాల్ టెస్ట్ వంటి పరీక్షలతో ఈ వ్యాధిని నిర్ధారణ చేయవచ్చు. సకాలంలో వైద్య చికిత్స అందించడం వల్ల దీనికి చికిత్స చేయవచ్చు. అయితే సరైన చికిత్స తీసుకోకపోతే ఈ సమస్య వల్ల పేగుల్లో పుండ్లు పడటం, సెప్టిసీమియా (ఒంటిలోని రక్తానికి ఇన్ఫెక్షన్ రావడం) వంటి కాంప్లికేషన్లకు దారితీయవచ్చు. తగిన మందులతోనూ, సెప్టిసీమియాలో ప్రత్యేకంగా చేయాల్సిన చికిత్సలతోనూ వైద్యులు ఈ సమస్యకు చికిత్స అందిస్తారు.
కలరా : విబ్రియో కలరా అనే బ్యాక్టీరియా వల్ల ఈ వ్యాధి వస్తుంది. తీవ్రమైన నీళ్ల విరేచనాలు, వాంతులు వల్ల డీహైడ్రేషన్ వస్తుంది. దాంతో బీపీ పడి΄ోవడం జరుగుతుంది. బియ్యం కడిగిన నీళ్లలా విరేచనం కావడం ఈ వ్యాధి ముఖ్య లక్షణం. అందుకే ప్రత్యేకంగా ఈ లక్షణాన్ని ‘రైస్ వాటర్ స్టూల్స్’ అని కూడా చెబుతారు.
ఈ వ్యాధికి సకాలంలో వైద్యం అందకపోతే మూత్రపిండాలు పాడైపోవడం వంటి దుష్పరిణామాలు చోటు చేసుకుని, ఒక్కోసారి ఆ పరిస్థితి ప్రాణాంతకంగా కూడా మారే అవకాశముంటుంది. స్టూల్ కల్చర్, డార్క్ ఫీల్డ్ మైక్రోస్కోపీ వంటి పరీక్షలతో ఈ రోగనిర్ధారణ చేస్తారు. కొన్ని రకాల యాంటీబయాటిక్స్‌తో వైద్యులు దీన్ని అదుపు చేస్తారు.
షిజెల్లోసిస్ : జ్వరం, రక్త విరేచనాలు, వాంతులు, కడుపునొప్పి మొదలైనవి ఈ వ్యాధి తాలూకు లక్షణాలు. షిజెల్లోసిస్‌లో పేగులో ఇన్ఫెక్షన్‌తో వచ్చే ‘టాక్సిక్ మెగా కోలన్’ అనే కాంప్లికేషన్‌తోపాటు... రక్తంలో యూరియా మోతాదులు ఉండాల్సిన దానికంటే చాలా ఎక్కువగా పెరిగిపోవడవం; రక్తం కలుషితమయ్యే ‘కీటోలైటిక్ యురేమియా’ వంటి దుష్ప్రభావాలూ కనిపించవచ్చు. ఇలా జరిగినప్పుడు ఆ పరిస్థితి ప్రాణాంతకం అయ్యేందుకు అవకాశం ఉంది.
ఈ-కొలై : నీళ్ల విరేచనాల ఎక్కువగా అయ్యే ఈ కండిషన్‌కు ‘ఈ–కొలై’ అనే బ్యాక్టీరియా కారణం. ఇది పేగులతో పాటు కిడ్నీలు, ఊపిరితిత్తులు, మెదడు, చర్మం లాంటి భాగాల్లోనూ ఇన్ఫెక్షన్ కలిగించవచ్చు. రక్తం, మూత్రం కల్చర్ పరీక్షల ద్వారా ఈ వ్యాధి నిర్ధారణ చేయవచ్చు.
దోమలతో వ్యాప్తిచెందే వ్యాధులు...
డెంగీ : వానాకాలంలో మునపటి కంటే ఎక్కువగా వ్యాప్తి చెందే ఈ వ్యాధికి ఏడిస్ ఈజిప్టై అనే రకం దోమలు కారణమవుతాయి. జ్వరం, తీవ్రమైన తలనొప్పితోపాటు ఎముకలు విరిచేసినంత తీవ్రమైన నొప్పి రావడంతో దీన్ని ‘బ్రేక్ బోన్ ఫీవర్’ అని కూడా అంటారు. వ్యాధి ముదిరినప్పుడు అంతర్గత అవయావాల్లో రక్తస్రావం కూడా జరగవచ్చు. మామూలుగా వచ్చే డెంగీ వ్యాధిని ‘క్లాసికల్ డెంగీ’ అంటారు. అయితే తీవ్రమైన అంతర్గత రక్తస్రావం వల్ల వచ్చే పరిస్థితిని ‘డెంగీ హేమరేజిక్ ఫీవర్’ అంటారు. ఒక్కోసారి రోగి తీవ్రమైన షాక్‌కు గురికావచ్చు. ఈ తరహా డెంగీని దీన్ని ‘డెంగీ షాక్ సిండ్రోమ్’ అంటారు. దోమలు వ్యాప్తి చేసినప్పటికీ డెంగీ వైరస్‌తో వచ్చే వ్యాధి ఇది.
దీనికి ప్రత్యేకంగా చికిత్స ఉండదు. కనిపించే లక్షణాలను బట్టి చికిత్స అందించే సింప్టమేటిక్ ట్రీట్‌మెంట్‌తో దీనికి చికిత్స చేస్తారు. డెంగీకి వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నప్పటికీ... ఒకసారి డెంగీ బారిన పడ్డవారు మరోసారి దీని బారిన పడితే పరిస్థితి చాలా తీవ్రంగానూ, విషమంగానూ ఉంటుంది కాబట్టి ఒకసారి డెంగీ బారిన పడ్డవారికి వ్యాక్సిన్ ఇస్తుంటారు.
చికన్ గున్యా : ఇది కూడా ఎడిస్ ఈజిపై్ట అనే దోమ వల్లనే వ్యాప్తి చెందుతుంది. దోమల వల్ల వ్యాప్తి చెందే ఒక రకం వైరస్ కారణంగా ఇది వస్తుంది. ఏడిస్ ఈజిపై్ట దోమ సాధారణంగా పగటి వేళ ఎక్కువగా కనిపిస్తుంటుంది. జ్వరంతో పాటు విపరీతమైన తలనొప్పి, తీవ్రస్థాయిలో కీళ్లనొప్పులు వస్తాయి. ఈ కీళ్లనొప్పులు భరించలేనంతగా ఉంటాయి. ఇది కూడా వైరల్ జ్వరం కావడంతో లక్షణాలను బట్టి ఇచ్చే సింప్టమేటిక్ ట్రీట్‌మెంట్ అందిస్తారు.
మలేరియా : ఇది కొన్ని ప్రాంతాల్లో చాలా ఎక్కువగా ఉండే తీవ్రమైన జ్వరం. అనాఫిలస్ అనే రకం దోమ కారణంగా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. ఇది రాత్రివేళల్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది. దోమలో వృద్ధి చెందే ప్లాస్మోడియమ్ అనే ప్రోటోజోవా రకానికి చెందిన ఏకకణ సూక్షజీవి వల్ల మలేరియా జ్వరాలు వస్తాయి. ఇందులో ప్రధానంగా నాలుగు రకాలు ఉంటాయి.
ఇందులో రకాన్ని బట్టి జ్వరాలు నిర్దిష్టంగా కొంత కొంత వ్యవధిలో మాటిమాటికీ వస్తుంటాయి. ఈ వ్యాధిలో ఒక రకం (స్పీషీస్) వల్ల సెరిబ్రల్ మలేరియా వస్తుంది. దీని వల్ల ఒక్కోసారి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది (అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్–ఏఆర్‌డీఎస్), స్పృహ తప్పిపడిపోవడం, అపస్మారక స్థితిలోకి వెళ్లడం, మూత్రపిండాలు విఫలం కావడం (రీనల్ ఫెయిల్యూర్) వంటివి జరగవచ్చు.
ఈగలతో వచ్చే వ్యాధులు...
వానల సీజన్ మొదలవ్వగానే ఈగలు ఎక్కువ సంఖ్యలో కనిపిస్తుంటాయి. ఈగలతో దాదాపు వంద రకాల వ్యాధులు వస్తుంటాయి. ఇవి పరిశుభ్రత లేని చోట్ల ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇవి కొన్ని మైళ్ల దూరాలూ వెళ్లగలవు. సాధారణంగా పగటివేళ ఎక్కువగా కనిపిస్తుంటాయి. రాత్రివేళ విశ్రాంతి తీసుకుంటుంటాయి.
ఈగల లార్వాలతో వృద్ధి చెందే వ్యాధులను ‘మైయాసిస్’ అంటారు. ఈగల కారణంగా వ్యాప్తి చెందే వ్యాధులు సాధారణంగా ఒంటిపై ఉండే గాయాలు, పుండ్ల ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంటాయి. ఈగ లార్వాలు కొన్ని కంటిలోకి కూడా ప్రవేశించి, రెటీనాకు సైతం హాని చేయవచ్చు.
ఇవీ ఈగలతో వ్యాప్తి చెందే వ్యాధుల్లో కొన్ని...
నీళ్ల విరేచనాలకు కారణం అయ్యే ఎంటమీబా హిస్టలిటికా, జియార్డియా లాంబ్లియా వంటి ్ర΄ోటోజోవన్ పరాన్న జీవులనూ, ఆస్కారిస్ లుంబ్రికాయిడ్స్, ఎంటరోబియస్ వర్మికులారిస్ వంటి నులిపురుగులనూ, ΄ోలియో, వైరల్ హెపటైటిస్ (హెపటైటిస్ ఏ అండ్ ఈ) వంటి వైరస్‌లనూ ఈగలు వ్యాప్తి చేస్తాయి. ఈ కింద పేర్కొన్నవి ఈగలు వ్యాప్తి చేసే ముఖ్యమైన వ్యాధుల్లో కొన్ని మాత్రమే.
అమీబియాసిస్ : ఇవి ప్రొటోజోవాకు చెందిన సూక్ష్మక్రిములు. వీటి వల్ల ఆహారం కలుషితమైనప్పుడు తీవ్రమైన కడుపునొప్పి, మలంలో రక్తం పడటం, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయి. మలపరీక్ష, ఎలైసా వంటి వైద్యపరీక్షలతో ఈ వ్యాధిని సులభంగా గుర్తించవచ్చు. అమీబియాసిస్ వల్ల జీర్ణ వ్యవస్థలోని పేగులతో పాటు కాలేయం, ఊపిరితిత్తులు, మెదడు వంటి కీలకమైన అవయవాలు దెబ్బతినవచ్చు. ముఖ్యంగా కాలేయంలో చీముగడ్డలు (లివర్ యాబ్సెస్) కనిపించే అవకాశాలు ఉన్నాయి. కాలేయంలోని ఈ చీముగడ్డలను అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్ష ద్వారా తేలిగ్గా గుర్తించవచ్చు.
జియార్డియాసిస్ : ఈ వ్యాధి జియార్డియా లాంబ్లియా అనే ప్రోటోజోవా రకానికి చెందిన సూక్ష్మక్రిముల వల్ల వస్తుంది. ఈ స్మూక్షక్రిములు చిన్నపేగుల్లో నివాసం ఏర్పరచుకొని ఈ వ్యాధిని కలగజేస్తాయి. ఈ వ్యాధి సోకినవారిలో వికారం, వాంతులు, కడుపునొప్పి, కడుపు ఉబ్బరం వంటి లక్షణాలు ఉంటాయి.
ఈ సూక్ష్మజీవులు రక్తంలోకి విస్తరించినప్పుడు ఒంటిపై దురద రావడం, అలా దురద వచ్చిన ప్రాంతమంతా నల్లబారడం వంటి చర్మసంబంధమైన లక్షణాలూ కనిపిస్తాయి. తిన్న ఆహారం ఒంటికి పట్టక΄ోవడం (మాల్ అబ్‌జార్ప్‌షన్) కూడా ఈ వ్యాధి వచ్చిన వారిలో కనిపిస్తుంటుంది. అమిబియాసిస్‌తో పాటు జియార్డియాసిస్ వంటి అనారోగ్యాలు కనిపించినప్పుడు గట్ ఎన్విరాన్‌మెంట్‌ను నార్మల్‌గా ఉంచుతూ హానికరమైన సూక్ష్మజీవులను బయటికి పంపే కొన్ని రకాల ΄పౌడర్లు, మెడిసిన్స్‌తోపాటు అవసరమైతే యాంటీబయాటిక్స్ వాడాల్సి ఉంటుంది.
ఎలుకల వల్ల...
వర్షాలకు బొరియల్లో ఉండే ఎలుకలు బయట నుంచి ఇళ్లలోకి వస్తాయి. ఎలుకల్లో పెరిగే లె΄్టోస్పైరోసిస్ అనే బ్యాక్టీరియా కారణంగా లె΄్టో స్పైరోసిస్ అనే వ్యాధి వస్తుంది. ఎలుకల వల్ల ఆహారం కలుషితమైపోవడంతో లెప్టోస్పైరోసిస్ జ్వరాలు వస్తాయి. ఈ సీజన్‌లో ఎలుకలు ఎక్కువగా ఉండే బురద నీళ్లలో ఎక్కువగా తిరిగే వారికీ ఈ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువ.
జ్వరం, తీవ్రమైన తలనొప్పి, కొన్నిసార్లు వాంతులు కావడం వంటి లక్షణాలు ఈ వ్యాధిలో ప్రధానంగా కనిపిస్తాయి. కొన్నిసార్లు కడుపునొప్పి, కళ్లు ఎర్రబారడం, కళ్లు పచ్చగా మారడమూ జరుగుతుంది. కొన్ని రకాల యాంటీబయాటిక్స్‌తో డాక్టర్లు లె΄్టోస్పైరోసిస్‌కు చికిత్స అందిస్తారు.
వర్షాకాలం వ్యాధుల నివారణ ఇలా...
ఈ సీజన్‌లోని దాదాపు అన్ని వ్యాధులకు కారణం కలుషితమైన నీరే. కాబట్టి నీటిని కాచి చల్లార్చాక వడపోసి తాగడం అన్నిటికంటే ప్రధానం.
కుండల్లో ఎక్కువ రోజులు నిల్వ ఉన్న నీరు తాగవద్దు.
వాటర్‌ను డిస్ ఇన్ఫెక్ట్ చేయడానికి క్లోరిన్ బిళ్ల వేసి క్లోరినేషన్ ద్వారా శుభ్రం చేసిన నీరు తాగడం వుంచిది.
ఈ సీజన్‌లో బయటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండటమే మంచిది.
తాజాగా వండుకున్న తర్వాత వేడిగా ఉండగానే తినేయాలి. ఈ సీజన్‌లో చల్లారిన ఆహారాన్ని వూటి వూటికీ వేడి చేసి తినడం అంత మంచిది కాదు.
మాంసాహారం కంటే శాకాహారానికి ప్రాధాన్యం ఇవ్వాలి. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందేమిటంటే... ఈ వ్యాధులు మాంసాహారం కారణంగా వ్యాప్తిచెందవు. కాకపోతే శాకాహారంతో పోలిస్తే మాంసాహారం ప్రాసెస్ చేసే క్రమంలో ఈగలు బాగా ముసరడానికి అవకాశం ఎక్కువ. సరిగ్గా ప్రాసెస్ చేయడం, పూర్తిగా ఉడికించడం వంటి జాగ్రత్తలు పాటిస్తే ఈ ముప్పును తప్పించుకోవచ్చు.
ఈ సీజన్‌లో పరిసరాల పరిశుభ్రత తప్పక పాటించాలి. నీళ్లు నిల్వ ఉండటానికి అవకాశం ఇచ్చే, పాత టైర్లు, ఖాళీ కొబ్బరి చిప్పల వంటివి దోవుల పెరుగుదలకు కారణమవుతాయి. నీటి చేరడానికి అవకాశమిచ్చే చిన్న చిన్న నీటి గుంటలు, పైన పెచ్చులు ఊడిపోయిన సన్‌షేడ్‌కు పైన ఉండే ప్రదేశాల్లో దోమలు గుడ్లు పెట్టి తమ సంతతిని అభివృద్ధి (బ్రీడింగ్) చేస్తాయి. కాబట్టి మీ ఇళ్లలో, ఇంటి పరిసర్రప్రాంతాల్లో దోమలను వృద్ధి చేసే పరిస్థితులన్నింటినీ నివారించాలి. రాత్రిళ్లు పడుకునే సమయంలో మంచం చుట్టూ దోమ తెరలు వాడటం వల్ల దోమల కారణంగా వ్యాప్తి చెందే అనేక వ్యాధులు నివారితమవుతాయి.
ఈ సీజన్‌లో దోవులతో వచ్చే వ్యాధుల నుంచి కాపాడుకోడానికి శరీరవుంతా కప్పే దుస్తులు వేసుకోవాలి.
ఇంటి కిటికీలకు మెష్‌లు ఉపయోగించడం మేలు. కిటికీలకు మెష్‌లు ఉపయోగించడం కాస్త శ్రమతోనూ, ఖర్చుతోనూ కూడిన వ్యవహారమే అయినప్పటికీ ఇప్పుడు కిటికీలకు అంటించడానికి రెడీగా ఉండే మెల్‌క్రో వంటి ΄్లాస్టిక్ మెష్‌లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. వీటివల్ల దోమలతో వచ్చే అనేక వ్యాధులు నివారితమవుతాయి.
వేప ఆకులతో పొగవేయడం, మస్కిటో రిపల్లెంట్ ఉపయోగించడం వల్ల దోమలు దూరమవుతాయి. అయితే కొంతమందికి పొగ, మస్కిటో రిపల్లెంట్స్‌లోని ఘాటైన వాసనల వల్ల అలర్జీ ఉంటుంది. కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా ఇలాంటి అలర్జీలు ఉంటే పొగవేసే ఇలాంటి చిట్కాల పట్ల జాగ్రత్తగా ఉండాలి.
ఇంట్లో చెత్త వేసుకునే కుండీలను ఎప్పటికప్పుడు దూరంగా ఉన్న కుండీలలో వేస్తుండాలి. వీధిలో ఉండే కుండీలను పారిశుద్ధ్య సిబ్బంది క్రమంతప్పకుండా శుభ్రం చేసేలా జాగ్రత్తలు తీసుకోవాలి. త్వరగా కుళ్లేందుకు అవకాశం ఉన్న పదార్థాలను వెంటవెంటనే శుభ్రం చేసుకుంటూ ఉండాలి.
వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. వుల, వుూత్ర విసర్జనకు వుుందు, తర్వాత చేతులు శుభ్రంగా సబ్బుతో లేదా బూడిదతో కడుక్కోవాలి.
కొందరు నేల మీది మట్టితో పాత్రలు శుభ్రం చేస్తారు. అలా ఎప్పుడూ చేయవద్దు. పాత్రలు శుభ్రం చేసే సవుయంలో సబ్బు లేదా బూడిద వూత్రమే వాడాలి.
వానలో అతిగా తడిసిన సందర్భాల్లో అప్పటికే ఏవైనా ఇన్ఫెక్షన్లతో బాధపడే వారిలో నిమోనియా వంటి సెకండరీ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి వారు సాధ్యమైనంత వరకు తల తడవకుండా జాగ్రత్త వహించాలి.
చివరగా... ఈ సీజన్‌లో చేతులను ఎప్పటికప్పుడు శుభ్రంగా కడుక్కుంటూ ఉండాలి. ఇలా చేతులు ఎక్కువగా కడుక్కోవడం వల్ల చాలా రకాల జబ్బులను... మరీ ముఖ్యంగా వర్షాల సీజన్‌లో వచ్చే అనేక వ్యాధులను సమర్థంగా నివారించవచ్చు.
డాక్టర్ నవీన్ కుమార్ సీనియర్ ఫిజీషియన్
(చదవండి: World Hepatitis Day: ఐబ్రోస్ థ్రెడింగ్‌తో ఇంత ప్రమాదమా..! ఏకంగా కాలేయంపై..)