‘జీవితంలోని ప్రతి దశలోనూ గైడ్ చేస్తూ నా ఎదుగుదలకు దోహదపడిన వారు ఎంతో మంది ఉన్నారు. వారందరూ నాకు గురువులే..’ అంటూ పరిచయం చేసుకున్నారు వనమల స్వప్న. హైదరాబాద్ లోని ‘నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్’ లో అసోసియేట్ ఫ్యాకల్టీగా ఉన్న వనమల స్వప్నకు ఇటీవల నేషనల్ ఎంట్రప్రెన్యూర్ అవార్డు వచ్చింది. గురువారం రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకున్న సందర్భంగా సాక్షి ‘ఫ్యామిలీ’తో తన విజయానందాన్ని పంచుకున్నారు.
‘‘సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల కోసం శిక్షణా తరగతులను నిర్వహించడంలో 18 ఏళ్ల అనుభవం ఉంది. 12 ఏళ్లుగా మేనేజ్‌మెంట్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఎమ్‌ఎస్‌ఎమ్‌ఇ’లో వర్క్ చేస్తున్నాను. స్పెషలైజేషన్ ఇంక్చువ ప్రాపర్టీ రైట్స్ ఇన్‌ఛార్జిగానూ వర్క్ చేస్తున్నాను.
వారధిగా.. సాయం
బిజినెస్ చేయాలని, రాణించాలనే ఆలోచన చాలా మందిలో ఉంటుంది. కానీ, సరైన నైపుణ్యాలు ఉండవు. అలాగే, ప్రభుత్వం నుంచి వచ్చే స్కీమ్స్ గురించి కూడా తెలియవు. స్కిల్స్‌తో పాటు వ్యాపార అవకాశాలు, లోన్లు, ప్రభుత్వ పథకాలను ఎలా ఉపయోగించుకోవాలి, మార్కెటింగ్ ఎలా చేయాలి.. అనే విషయాల్లో సాయం చేస్తాం. మా అకాడమీ నుంచి వివిధ రకాల స్కీమ్స్ ఉన్నాయి. వాటిలో ఇప్పుడు నాలుగు స్కీమ్స్‌తో నిరుద్యోగ యువత, మహిళలకు ఎంట్రప్రెన్యూర్‌షిప్ స్కిల్స్ డెవలప్‌మెంట్‌ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. నాలుగేళ్ల నుంచి మల్టీమీడియా, ఫ్యాషన్, బ్యూటీ.. వంటి రంగాలలో దాదాపు 4000 మంది యువతకు శిక్షణ ఇచ్చాం. స్టేట్, సెంట్రల్ గవర్నమెంట్, ప్రైవేట్, పబ్లిక్ సెక్టార్స్‌లోని వాళ్లకూ స్కిల్ ట్రెయినింగ్స్ ఇస్తున్నాం.
మంచి రేటింగ్
త్రీ స్టార్స్ రేటింగ్ రావడంతో ఎమ్‌ఎస్‌ఎన్‌మి ఇన్నోవేటివ్ స్కీమ్ కింద సివిల్ సర్వెంట్స్‌కు శిక్షణ ఇవ్వడానికి మా ఇన్‌స్టిట్యూట్‌కు అప్రూవల్ వచ్చింది. వివిధ రంగాలలో నిపుణులైన వారు కూడా శిక్షణ తరగతులకు హాజరవుతుంటారు. తాము సృష్టించిన ఉత్పత్తులను ప్రదర్శించడానికి వేదికలను కూడా ఏర్పాటు చేస్తుంటాం. ఇటీవల శిక్షణ తీసుకుంటున్న వారిలో మహిళల శాతం ఎక్కువగా ఉంటోంది. దీంతో 55 స్కిల్‌ప్రోగ్రామ్స్ మహిళలకే పరిచయం చేస్తున్నాం. జిల్లా, గ్రామీణ స్థాయి మహిళలకు కూడా 60 స్కిల్స్‌ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశాం.
ప్రతి రోజూ సవాళ్లే
దేశవ్యాప్తంగాప్రోగ్రామ్స్, శిక్షణ తరగతులను ఏర్పాటు చేయడానికి ఆయా ్రపాంతాలకు వెళ్లినప్పుడు కాలేజీలు, యూనివర్శిటీల సాయం తీసుకుంటాం. అక్కడ చాలా వరకు శిక్షణకు కావల్సిన సరంజామా ఉండదు. దీంతో ప్రతీదీ సవాల్‌గానే ఉంటుంది. ముఖ్యంగా టెక్నాలజీకి సంబంధించిన శిక్షణ ఇచ్చేటప్పుడు సమస్యలు ఎదురవుతుంటాయి. దీంతో ఏ లోపం లేకుండా ముందస్తుగానే ΄్లాన్ చేసుకుంటాం. ఇటీవల సైబర్‌సెక్యూరిటీకి సంబంధించి కాకినాడ ప్రభుత్వ కాలేజీలో, డిజిటల్ మార్కెట్‌కు సంబంధించి తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం వారితో కలిసి వర్క్ చేశాం. ఫ్యాషన్ రంగానికి సంబంధించి ఇండోర్ ఫ్యాషన్ ఇన్సిట్యూట్‌తో కలిసి వర్క్ చేశాం. 2023–24 సంవత్సరానికి గాను 200కు పైగా ప్రోగ్రామ్స్ చేశాం. ట్రైనింగ్ క్లాసులకు ప్రిపేర్ అవడం,ప్రోగ్రామ్స్‌ని నిర్వహించడం, జనాల్లోకి రీచ్ అయ్యేలా చేయడం ఓ పెద్ద ప్రణాళిక.
కుటుంబ మద్దతు
నేను పుట్టింది తెలంగాణలోని సిద్దిపేట. మా నాన్నగారి ఉద్యోగరీత్యా రామగుండంలో చదువుకున్నాను. ఉస్మానియా యూనివర్శిటీలో ఇంజనీరింగ్ చేశాను. మా వారు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, మాకు ఇద్దరు పిల్లలు. మహిళగా నా వర్క్‌లో రాణించాలంటే కుటుంబం స΄ోర్ట్ ఉండాలి. మా పేరెంట్స్ ఉన్న అపార్ట్‌మెంట్‌లోనే నేనూ ఇల్లు తీసుకోవడంతో పిల్లలకు సంబంధించి ఒత్తిడి తక్కువగా ఉంటుంది. హైదరాబాద్‌లోని అడిక్‌మెట్ నుంచి రోజూ నా ప్రయాణం ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కో దశలో నన్ను గైడ్ చేయడానికి వచ్చారు. వారంతా నాకు గురువులే’ అంటూ తెలిపారు స్వప్న.
– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
Comments
Please login to add a commentAdd a comment