చిన్న చిన్న ఫ్యాషన్‌ ట్రిక్స్‌తో.. రెయిన్‌ డ్రాప్స్‌కి చెక్‌! | Precautions And Tips To Keep Clothes From Getting Wet In The Rain | Sakshi
Sakshi News home page

ట్రెండీమెన్‌.. మాన్‌సూన్‌ మాస్టర్స్‌!

Jun 28 2026 9:09 AM | Updated on Jun 28 2026 9:12 AM

Precautions And Tips To Keep Clothes From Getting Wet In The Rain

ట్రెండీమెన్‌

వర్షాకాలం వచ్చిందంటే చాలు రోడ్లు స్విమ్మింగ్‌పూల్స్‌లా మారిపోతాయి, బట్టలు ఆరడం ఓ డ్రీమ్‌లా అనిపిస్తుంది, షూస్‌ అండ్‌ ఫ్యాషన్‌ పరిస్థితి అయితే చెప్పాల్సిన అవసరం లేదు... అయినా కూడా గొడుగుతో పాటు మీ స్టయిల్‌ను కూడా బ్యాగ్‌లో పెట్టేసుకునేంత ఈజీ చేయొచ్చు. కేవలం కొన్ని చిన్న చిన్న ఫ్యాషన్‌  ట్రిక్స్‌ ఫాలో అయితే మీ స్టయిల్‌కు రెయిన్‌ డ్రాప్సే క్లాప్స్‌ కొడతాయి.

కాటన్‌ ఫ్రెండ్స్‌!
వర్షంలో ఒకసారి తడిసిన బట్టలు ‘మళ్లీ ఎండలో కలుద్దాం!’ అన్నట్టుగా ఉంటాయి. అందుకే కాటన్‌ , లినెన్‌  లాంటి లైట్‌ ఫ్యాబ్రిక్స్‌ సమ్మర్‌లోనే కాదు మాన్‌సూన్‌లోనూ కంఫర్ట్‌గా ఉంటాయి. ఇవి త్వరగా ఆరిపోతాయి, చెమటను తగ్గిస్తాయి. కాస్త వేడి వేడి ఇస్త్రీ చేస్తే చాలు ఇంకాస్త త్వరగా బయటకు వెళ్లడానికి రెడీ అయిపోతాయి. వానలో తడవకుండా ఉండాలంటే రెయిన్‌ కోట్‌ తప్పనిసరి.

లైట్‌ కలర్స్‌తో ఫ్రెష్‌ వైబ్‌
మాన్సూన్‌ లో ఆకాశమే డార్క్‌గా ఉంటుంది. అందుకే, కనీసం మనం అయినా ఫ్రెష్‌గా కనిపిద్దాం కదా! లైట్‌ బ్లూ, వైట్, బీజ్, మింట్‌ కలర్స్‌ వేసుకుంటే చాలు, వర్షంలో కూడా ‘స్లో మోషన్‌ ’ లుక్‌ గ్యారెంటీ. వీటిని డార్క్‌ ప్యాంట్‌తో జత చేస్తే ఇంకాస్త క్లాస్‌!

డార్క్‌ ట్రౌజర్స్‌ – బురదకు బాస్‌!
వర్షంలో బయటికి వెళ్లి తెల్ల ప్యాంట్‌ వేసుకుంటే, ఇంటికొచ్చేసరికి అది రోడ్‌ మ్యాప్‌లా కనిపించే చాన్స్‌ ఉంది! అందుకే నేవీ, బ్లాక్, ఆలివ్‌ లాంటి డార్క్‌ ట్రౌజర్స్‌ బెస్ట్‌. బురద చిందులు పడినా ‘ఏం కాలేదన్నట్టు’ కవర్‌ చేస్తాయి.

షార్ట్స్‌ – ఫ్రీడమ్‌ మోడ్‌ ఆన్‌ !
వర్షంలో జీన్స్‌ తడిస్తే కాళ్లకు సిమెంట్‌ కట్టేసుకున్నట్టే ఉంటుంది. అందుకే క్యాజువల్‌ ఔటింగ్స్‌కి షార్ట్స్‌ ట్రై చేయండి. త్వరగా ఆరిపోయే మెటీరియల్‌లో ఉంటే ఇంకా బెటర్‌. వీటిని టీషర్ట్‌తో జత చేస్తే ‘రెయిన్‌  వెకేషన్‌  వైబ్‌’ రెడీ!

‘చప్‌ చప్‌’ సౌండ్‌కు గుడ్‌బై!
వర్షంలో తడిసిన షూస్‌తో నడిస్తే ప్రతి అడుగూ ఓ బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌లా ఉంటుంది. అందుకే వాటర్‌ రెసిస్టెంట్‌ సాండల్స్, ఫ్లిప్‌ఫ్లాప్స్‌ లేదా వాటర్‌ప్రూఫ్‌ స్నీకర్స్‌ తొడుక్కుంటే కంఫర్ట్‌తో పాటు స్టయిల్‌ కూడా మిస్‌ కాదు.

వాచ్‌ కూడా రెయిన్‌  రెడీ కావాలి!
మాన్‌సూన్‌ లో మొబైల్‌ తర్వాత ఎక్కువ టెన్షన్‌ ఇచ్చేది వాచ్‌! అందుకే వాటర్‌ రెసిస్టెంట్‌ వాచ్‌ పెట్టుకుంటే మంచిది. రబ్బర్‌ స్ట్రాప్‌ వాచ్‌లు అయితే ఫుల్‌ మాన్‌సూన్‌ వైబ్‌ ఇస్తాయి. - కొండ దీపిక

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement