breaking news
Rain Coat
-
ముందే పలకరించిన వానలు : రెయిన్కోట్లకు, గొడుగులకు భలే బేరం!
దాదర్: వర్షాకాలం సమీపించడంతో గొడుగులు, రెయిన్ కోట్లు, ప్లాస్టిక్ క్యాప్‌లు తదితర సామగ్రి విక్రయించే హోల్‌సేల్ మార్కెట్లన్నీ కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి. ముంబైలో గత పక్షం రోజుల నుంచి వాతావరణంలో అనేక మార్పులు చేసుకుంటున్నాయి. ఒకపక్క వర్షం మరోపక్క ఎండలు కాస్తున్నాయి. దీంతో జనాలు ఇంటి నుంచి బయటపడే సమయంలో గొడుగు తీసుకెళ్లాలా? వద్దా? అంటూ సందిగ్ధంలో పడిపోయారు. ఈ సారి వర్షాలు కొంత తొందరగా కురుస్తాయని ఇదివరకే శాంతాకృజ్, కొలాబా వాతావరణ శాఖలు హెచ్చరించాయి. అనుకున్నట్లు ఈ సారి వర్షాలు గత పక్షం రోజుల నుంచి కురుస్తున్నాయి. ఏటా వర్షాకాలం జూన్ ఏడో తేదీ నుంచి ప్రారంభమవుతుంది. కానీ ఈ సారి వర్షాలు దాదాపు పక్షం రోజుల ముందు నుంచే కురుస్తున్నాయి. దీంతో అనేక మంది ముందస్తు ఏర్పాట్లు చేసుకోలేకపోయారు. దీంతో కొత్త గొడుగులు, రెయిన్ కోట్లు కొనుగోలు చేయడానికి మార్కెట్లకు పరుగులు తీస్తున్నారు. ఫలితంగా మార్కెట్లన్నీ కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి. రంగురంగుల గొడుగులు.. డిజైన్లతో కూడిన రెయిన్ కోటుముంబైలో దాదర్, క్రాఫర్డ్ మార్కెట్, చెంబూర్ తదితర ప్రాంతాల్లో వర్షాకాల సామగ్రి విక్రయించే హోల్‌సేల్ మార్కెట్లున్నాయి. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సారి కోనుగోలుదార్లను ఆకర్షించే రంగురంగుల గొడుగులు, వివిధ డిజైన్లతో కూడిన రెయిన్ కోట్లు మార్కెట్లోకి వచ్చాయి. ముఖ్యంగా పిల్లలను ఆకట్టుకునే వివిధ రంగులు, డోరెమాన్, ఛోటా బీం, మోటూ–పాత్‌లు, స్పైడర్ మెన్, బార్బీ డాల్, సిండ్రోలా తదితర కార్టూన్ బొమ్మలతో కూడిన రెయిన్ కోట్లు, గొడుగులు వచ్చాయి. ఇవి పిల్లలను ఎంతో ఆకట్టుకుంటున్నాయి. అదేవిధంగా పెద్దలు వినియోగించే ప్లాస్టిక్ జాకెట్లు, ప్యాంట్లు, క్యాప్‌లు, ఫోన్లు వర్షానికి తడవకుండా భద్రపర్చుకునే మొబైల్ కవర్లు, బైక్‌లు, కార్లపై కప్పడానికి వినియోగించే ప్లాస్టిక్ కవర్లు కూడా మార్కెట్లో అందుబాటులో ఉంచారు. అయితే ఈ సారి ధరలు 10–20 శాతం మేర పెరిగినట్లు హోల్‌సేల్ వ్యాపారులు చెబుతున్నారు. ఈ సామగ్రిని రిటైల్ వ్యాపారులు క్వాలిటీని బట్టి 20–30 శాతం ధరలు పెంచి విక్రయిస్తున్నారు. దీంతో ఈ సారి కోనుగోలుదార్ల జేబులకు చిల్లులు పడడం ఖాయమని తెలుస్తోంది. చదవండి: Chitrakoot Facts: చరిత్ర చెక్కిన రామాయణం చిత్రకూటం.. ఎన్ని విశేషాలో!రెయిన్ కోట్ రూ.30 నుంచి రూ.150 లోపే.. ఇదిలా ఉండగా వర్షాకాలంలో వ్యాపారులు, ఉద్యోగులతో పాటు వివిధ పనుల నిమిత్తం ఇంటి నుంచి బయటపడే సామాన్యులు ఇదివరకు వాడిన లేజర్ బూట్లు, సాధారణ పాదరక్షలు పక్కన పెట్టేశారు. వర్షంలో వినియోగించే ప్లాస్టిక్ చెప్పులు, బూట్లు, స్లీపర్లు కొనుగోలు చేయడానికి ఎగబడుతున్నారు. సందెట్లో సడేమియా అన్నట్లుగా గత సంవత్సరం అమ్మగా మిగిలిపోయిన సామగ్రిని బయటకు తీసి ఎక్కువ ధరకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ సారి అకాల వర్షాలు పక్షం రోజుల ముందే కురవడంతో అనేక మంది వ్యాపారులు వర్షాకాల సామగ్రి ముందుగానే నిల్వచేసుకుని సిద్ధంగా ఉంచుకున్నారు. సాధారణ గొడుగులతోపాటు డబుల్, ట్రిపుల్ ఫోల్డింగ్ గొడుగులు, ట్రాన్స్పరెంట్ రెయిన్ కోట్లు, క్యాప్‌లు, కప్పుకునేందుకు ప్లాస్టిక్ పేపర్లు ఇలా అనేక రకాల వర్షాకాల సామగ్రి మార్కెట్లోకి వచ్చాయి. రూ.100–500 వరకు ధర పలికే హైక్లాస్ ప్లాస్టిక్ బూట్లు, రబ్బర్ చెప్పులు మార్కెట్లో ఉంచారు. వీటిని అధికంగా ఉద్యోగులు, కాలేజీ విద్యార్థులు కొనుగోలు చేస్తున్నారు. చాలామందికి వెంట రెయిన్ కోట్లు, గొడుగులు ఉంచుకోవడం ఇష్టముండదు. దీంతో ఇలాంటి వారికోసం యూజ్ అండ్ త్రో రెయిన్ కోట్లు మార్కెట్లోకి వచ్చాయి. ఒక్కో రెయిన్ కోట్ ధర కేవలం రూ.30–150 వరకు పలుకుతున్నాయి. బరువు కూడా చాలా తక్కువ ఉండడంతో హ్యాండ్ బ్యాగులో సులభంగా ఇమిడిపోతుంది. దీంతో వీటిని కొనుగోలు చేయడానికి ఉద్యోగులు, వ్యాపారులతో పాటు సాధారణ జనాలు కూడా ఆసక్తి కనబరుస్తున్నారు. ఇదీ చదవండి: కొడుకు మృతిపై తల్లడిల్లిన తల్లి : కన్నీటి పర్యంతమైన డిప్యూటీ సీఎం -
ష్యాషన్ సెన్స్ ఉట్టిపడేలా..వర్షాకాలంలో ఎలాంటి దుస్తులు వేసుకోవాలి?
ఈ సీజన్లో బయటకు వస్తే ఎప్పుడు చినుకు పడుతుందో తెలియదు. ఆ చినుకుల్లో ఏ డ్రెస్ ఉంటే బాగుంటుందో...ఎలా ఉండాలో తెలియక ఇబ్బందులు అందుకే ఈ సీజన్లో మీ వార్డ్రోబ్, బ్యూటీ రొటీన్లలో కూడా మార్పులు చేసుకోక తప్పదు. డల్‌గా ఉండే వానాకాలం వాతావరణాన్ని బ్రైట్‌గా మార్చే ట్రెండ్స్ గురించి తెలుసుకుని ఆచరణలో పెడితే ఈ సీజన్‌ని కూడా చక్కగా ఎంజాయ్ చేయచ్చు. ఎండకాలం మాదిరిగా ఇప్పుడు డ్రెస్సింగ్ కుదరదు. అలాగని, వెచ్చగా ఉంచే దుస్తులు కూడా. ఎందుకంటే, వాతావరణంలో మార్పుల వల్ల వేడి– తేమ అధికమై చెమటకు దారి తీయవచ్చు. డల్‌గా ఉండే వాతావరణాన్ని బ్రైట్‌గా మార్చేయడంలోనే కాదు, వానల్లో తడవకుండానూ స్టైలిష్ లుక్‌తో ఆకట్టుకునేలా దుస్తుల ఎంపికలో ప్రత్యేక శ్రద్ధ అవసరం అవుతుంది. వాటర్ ప్రూఫ్ షూస్ వర్షపు రోజులలో బురద గుంటలు సాధారణం. రోడ్లపై పారే నీటి నుంచి, వర్షపు ధారల నుంచి దాలను కాపాడుకోవాలంటే వాతావరణానికి అనువైనవి ఉండాలి. అందుకు వాటర్ ప్రూఫ్ బూట్లను ఎంచుకోవాలి. బ్లాక్ బూట్లు అయితే ఏ డ్రెస్సులకైనా బాగా నప్పుతాయి. రెయినీ హ్యాట్ వర్షపు రోజుల్లో టోపీ ని ధరించడం ద్వారా మీ స్టైల్‌ని అప్‌గ్రేడ్ చేయవచ్చు. కోటుకు హుడీ లేకపోతే ఒక ట్రెండీ హ్యాట్‌ను వాడచ్చు. అయితే, టోపీ ఉన్నప్పటికీ వెంట గొడుగు మాత్రం వాడాల్సిందే. రెయిన్ పోంచో ఇవి సాధారణంగా మొత్తం ఒంటిని కప్పేసే విధంగా ఉంటాయి అని అనుకుంటారు కానీ, ఇప్పుడు మార్కెట్లో విభిన్న మోడల్స్‌లో రెయిన్ పోంచోస్ వచ్చాయి. ఇవి చాలా సౌకర్యవంతంగా, స్టైలిష్‌గా ఉంటాయి. అలాగే వేసుకున్న దుస్తులను వానకు తడవకుండా కాపాడుకోవచ్చు. గొడుగు కూడా వాడలేనంత వర్షం కురుస్తున్నప్పుడు ఇవి చాలా బాగా పనిచేస్తాయి. అంతేకాదు, వర్షాకాలానికి తల తడిస్తే, జుట్టు చిట్లిపోతుంది. జుట్టుకు రక్షణగా కూడా రెయిన్ పోంచో హుడ్ ను కప్పుకోవచ్చు. స్టైలిష్‌గానూ కనిపిస్తారు. మీ రెయిన్ పోంచో వాటర్‌ప్రూఫ్ ఫాబ్రిక్ కింద పొడిగా ఉండగలుగుతారు. ట్రెంచ్ కోట్ వర్షం రోజుల్లో డ్రెస్సింగ్ గురించి ఆలోచించినప్పుడు ఖాకీ రంగు డబుల్ బ్రెస్ట్ ట్రెంచ్ కోట్ గుర్తుకు వస్తుంది. అయితే, వీటిలో ఇప్పుడు విభిన్నరకాల కలర్స్... ఫ్యాబ్రిక్‌లో మార్పులు చేసినవి మార్కెట్లోకి వచ్చాయి. నేటి కాలానికి తగినట్టుగా ఆకట్టుకుంటున్నాయి. గొడుగు ఎంపిక వర్షంలో గొడుగు తప్పని అవసరం. అయితే, అది ఎప్పుడూ బ్లాక్ కలర్లో రొటీన్‌గా ఉంటే బోర్‌గా అనిపిస్తుంది. మంచి బ్రైట్ కలర్స్ ఉన్నవి, స్టైలిష్‌గా ఉన్న గొడుగులను ఎంచుకుంటే బాగుంటుంది. ముఖ్యంగా మిగతా అన్నింటికన్నా పోల్కా డాట్స్, లైన్స్ ఎప్పుడూ స్పెషల్ లుక్‌తో ఆకట్టుకుంటాయి. మిలిటరీ స్టైల్ కోట్లు జీన్స్, టీ షర్ట్ పైకి ఓ మిలిటరీ స్టైల్ కోటు ధరిస్తే చాలు మీ రూపం మరింత ఆధునికంగా మారిపోతుంది. మగవారికి అనువుగా రూపొందిన ఈ డ్రెస్ మగువలకు మరింత ప్రత్యేకమైన డ్రెస్సింగ్‌గా ఈ సీజన్ మార్చేసింది. -
Samuthirakani: దర్శకుడి కార్యాలయంలో అపరిచితురాలు
చెన్నై: మదురవాయిల్‌లో ప్రముఖ నటుడు, దర్శకుడు సముద్రఖని కార్యాలయంలోకి ఒక అపరిచితురాలు చొరబడి కారుపై ఆరేసిన రెయిన్కోట్లను దొంగలించింది. ఈ మేరకు కార్యాలయ మేనేజర్ కార్తీక్ శుక్రవారం సాయంత్రం స్థానిక మదురవాయిల్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీ కెమెరాలను పరిశీలించారు. అందులో ఒక మహిళ కార్యాలయంలోకి చొరబడి అక్కడ కారుపై ఆరబెట్టిన రెయిన్కోట్లను తీసుకుని వాటిని ధరించి కారుపై కొంచెం సేపు పడుకుని వెళ్లిపోయిన దృశ్యాలు నమోదయ్యాయి. పోలీసులు విచారణ జరుపుతున్నారు. చదవండి: (Simbu-Sudha Kongara: కేజీఎఫ్ చిత్ర బ్యానర్లో శింబు) -
వానలో ‘బ్యాగ'ంటుంది!
వర్షాకాలం వచ్చింది.. ఆఫీసుకు వెళుతున్నప్పుడో, తిరిగి ఇంటికి వస్తున్నప్పుడో వాన పడొచ్చు. అందువల్ల ఎప్పుడు బయటకు వెళ్లినా రెయిన్ కోట్ తప్పనిసరిగా తీసుకెళ్లాల్సిందే. మన బ్యాక్‌ప్యాక్‌లో దాన్ని పెట్టుకోవడానికి తగినంత స్థలం లేకపోతే.. వాన పడుతున్నా, పడకున్నా ఆ కోట్‌ను వేసుకుని తిరగాల్సిందే. ఇదో పెద్ద సమస్య. ఇలాంటి ఇబ్బందులకు చెక్ పెట్టే ఉద్దేశంతో ఫన్నెల్ ఎజెక్ట్వేర్ అనే సంస్థ వినూత్నమైన బ్యాక్‌ప్యాక్‌ను తయారుచేసింది. ఆ బ్యాగ్‌లోనే రెయిన్ కోట్ ఇమిడిపోయి ఉంటుంది. మనం బండిపై వెళుతున్నప్పుడు అకస్మాత్తుగా వర్షం పడితే.. బ్యాగ్ తీయకుండానే ఆ కోట్ వేసుకోవచ్చు. బ్యాక్‌ప్యాక్ పై భాగంలో ఉండే రెండు స్ట్రాప్స్‌ను పైకి లాగితే అందులోనుంచి రెయిన్ కోట్ బయటకు వస్తుంది. దాన్ని చొక్కా వేసుకున్నట్టుగా ఇలా వేసుకుంటే చాలు.. బావుంది కదూ ?