వానలో ‘బ్యాగ'ంటుంది! | rain bag | Sakshi
Sakshi News home page

వానలో ‘బ్యాగ'ంటుంది!

Jul 11 2014 12:54 AM | Updated on Sep 2 2017 10:06 AM

వానలో ‘బ్యాగ'ంటుంది!

వానలో ‘బ్యాగ'ంటుంది!

వర్షాకాలం వచ్చింది.. ఆఫీసుకు వెళుతున్నప్పుడో, తిరిగి ఇంటికి వస్తున్నప్పుడో వాన పడొచ్చు. అందువల్ల ఎప్పుడు బయటకు వెళ్లినా రెయిన్ కోట్ తప్పనిసరిగా తీసుకెళ్లాల్సిందే.

వర్షాకాలం వచ్చింది.. ఆఫీసుకు వెళుతున్నప్పుడో, తిరిగి ఇంటికి వస్తున్నప్పుడో వాన పడొచ్చు. అందువల్ల ఎప్పుడు బయటకు వెళ్లినా రెయిన్ కోట్ తప్పనిసరిగా తీసుకెళ్లాల్సిందే. మన బ్యాక్‌ప్యాక్‌లో దాన్ని పెట్టుకోవడానికి తగినంత స్థలం లేకపోతే.. వాన పడుతున్నా, పడకున్నా ఆ కోట్‌ను వేసుకుని తిరగాల్సిందే. ఇదో పెద్ద సమస్య.

ఇలాంటి ఇబ్బందులకు చెక్ పెట్టే ఉద్దేశంతో ఫన్నెల్ ఎజెక్ట్‌వేర్ అనే సంస్థ వినూత్నమైన బ్యాక్‌ప్యాక్‌ను తయారుచేసింది. ఆ బ్యాగ్‌లోనే రెయిన్ కోట్ ఇమిడిపోయి ఉంటుంది. మనం బండిపై వెళుతున్నప్పుడు అకస్మాత్తుగా వర్షం పడితే.. బ్యాగ్ తీయకుండానే ఆ కోట్ వేసుకోవచ్చు. బ్యాక్‌ప్యాక్ పై భాగంలో ఉండే రెండు స్ట్రాప్స్‌ను పైకి లాగితే అందులోనుంచి రెయిన్ కోట్ బయటకు వస్తుంది. దాన్ని చొక్కా వేసుకున్నట్టుగా ఇలా వేసుకుంటే చాలు.. బావుంది కదూ ?
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement