అందానికి ఏఐ మాయాజాలం.. పోర్టబుల్‌ స్కిన్‌ కేర్‌ డివైస్‌! | Portable Skincare Device Created By The Prominent Beauty Technology Company Inuume | Sakshi
Sakshi News home page

అందానికి ఏఐ మాయాజాలం.. పోర్టబుల్‌ స్కిన్‌ కేర్‌ డివైస్‌!

Jun 14 2026 9:03 AM | Updated on Jun 14 2026 9:03 AM

Portable Skincare Device Created By The Prominent Beauty Technology Company Inuume

నానో హైడ్రా ప్రో

ప్రముఖ బ్యూటీ టెక్నాలజీ సంస్థ ‘ఇన్యూమీ’ సౌందర్య ప్రేమికుల కోసం ఒక సరికొత్త, వినూత్నమైన పోర్టబుల్‌ స్కిన్‌ కేర్‌ డివైస్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. ‘నానో హైడ్రా ప్రో’ పేరుతో రూపొందించిన ఈ హైటెక్‌ గాడ్జెట్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీల కలయికతో పనిచేస్తుంది.

ఈ ఆధునిక నానో హైడ్రా ప్రో డివైజ్‌లో ఆటోమేటెడ్‌ డ్యుయల్‌–పంప్‌ మెకానిజంతో పాటు ఏఐ సాంకేతికతను ఉపయోగించారు. ఇది చర్మ సంరక్షణకు అవసరమైన లిక్విడ్‌లను అత్యంత సూక్ష్మమైన స్ప్రే రూపంలోకి మారుస్తుంది. దీనివల్ల స్కిన్‌ కేర్‌ లిక్విడ్స్‌ చర్మం లోపలి పొరల వరకు సులభంగా చేరుకుని, చర్మాన్ని ఎక్కువ సమయం పాటు హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది.

ప్రయాణాల్లో సైతం ఎంతో సులభంగా తీసుకెళ్లేలా డిజైన్‌ చేసిన ఈ స్మార్ట్‌ డివైస్‌లో ఎన్నో ఆకర్షణీయమైన ఫీచర్లు ఉన్నాయి. డివైజ్‌ను ఎలా ఉపయోగించాలో గైడ్‌ చేయడానికి ప్రత్యేక డిస్‌ప్లే, సెన్సర్లు ఇందులో ఉంటాయి. దీనిని ఫోన్‌ యాప్‌తో అనుసంధానం చేసుకోవచ్చు. తద్వారా వాతావరణ పరిస్థితులను బట్టి చర్మాన్ని ఎలా రక్షించుకోవాలో ఎప్పటికప్పుడు రిమైండర్లను పంపుతూ ఒక పర్సనల్‌ స్కిన్‌ కేర్‌ కన్సల్టెంట్‌లా ఈ డివైజ్‌ సహాయపడుతుంది. ఇందులో స్కిన్‌ కేర్‌ లిక్విడ్స్‌ నింపుకోవడానికి వీలుగా సులభంగా మార్చుకోగలిగే మ్యాగ్నెటిక్‌ క్యాప్సూల్స్‌ ఉండటం విశేషం.

పురాతన ఈజిప్షియన్, భారతీయ, గ్రీకు, రోమన్‌ ప్రజలు కుంకుమపువ్వును సౌందర్య సాధనంగా కూడా ఉపయోగించేవారు. ఈజిప్టు రాణి క్లియోపాత్రా స్నానం చేయడానికి కుంకుమపువ్వు కలిపిన నీరు/పాలు ఉపయోగించేదట! తేనెతో పులియబెట్టిన గుర్రం పాలతో నిండిన టబ్‌లో స్నానం చేయడం, ఆమె ఆచరించిన సౌందర్య మార్గాలలో ఒకటి. ఆధునిక కాలంలో కూడా అనేక లగ్జరీ స్కిన్‌ కేర్‌ బ్రాండ్స్‌ క్లియోపాత్రా వాడిన పాలు, తేనె, కుంకుమపువ్వు ఫార్ములాను ఆధారంగా తమ ఉత్పత్తులను తయారు చేస్తున్నాయి.

ఎండల్లోనూ మెరిసేలా!
ఉక్కపోత, వేడి వల్ల వేసవిలో చర్మ సమస్యలు వేధిస్తుంటాయి. కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఈ ఇబ్బందులకు దూరంగా ఉండవచ్చు. వేసవిలో సన్‌ స్క్రీన్‌ని ఎల్లప్పుడూ వెంట ఉంచుకోవాలి. ఒకవేళ తీవ్రమైన సన్‌ బర్న్‌ బారిన పడితే కలబంద గుజ్జు, జింక్‌ ఉన్న క్రీములు, ఐస్‌ ప్యాక్స్‌తో చర్మాన్ని చల్లబరచుకోవాలి. చర్మంపై పేరుకుపోయిన మృతకణాలను తొలగించడం ద్వారా చర్మాన్ని మళ్లీ తాజాగా మార్చవచ్చు. అందువల్ల ఎక్స్‌ఫోలియేషన్‌పై దృష్టిపెట్టాలి.

మచ్చలు, మొటిమలు ఏ కాలంలోనైనా రావచ్చు. కానీ వేసవిలో ఇవి మరింత ఎక్కువవుతాయి. మొటిమలు వేధిస్తున్నప్పుడు గ్లైకోలిక్‌ యాసిడ్‌ లేదా శాలిసిలిక్‌ యాసిడ్‌ ఉన్న క్లెన్సర్‌ను ఉపయోగిస్తే ఫలితం ఉంటుంది. రోజుకు కనీసం ఎనిమిది గ్లాసుల నీరు తాగాలి. శరీరంలో తగినంత నీరు ఉన్నట్లయితే డీహైడ్రేషన్‌ బారిన పడకుండా ఉండవచ్చు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement