టిపు టిపు బర్సా పానీ వానై కురిసింది మనీ | Sakshi
Sakshi News home page

టిపు టిపు బర్సా పానీ వానై కురిసింది మనీ

Published Sun, Jan 7 2024 6:00 AM

Pakistani man twist to Tip Tip Barsa Paani in old viral - Sakshi

దేశాలకు సరిహద్దులు ఉండవచ్చుగానీ పాటలకు ఉండవు. ఒక పాట సూపర్‌ డూపర్‌ హిట్‌ అయితే అది ఏ దేశం పాట అయినా ‘ఇది మన పాటే’ అన్నట్లుగా జనాలు ఇష్టపడతారు. దీనికి తాజా ఉదాహరణ ఈ వీడియో.

అప్పుడెప్పుడో వచ్చిన అక్షయ్‌ కుమార్, రవీనా టాండన్‌ సినిమా ‘మోహ్రా’లోని ‘టిపు టిపు బర్సా పానీ’ పాట ఎంత హిట్టో తెలిసిందే. ఇప్పటికీ ఫంక్షన్‌లలో, పెళ్లి ఊరేగింపులలో ఈ పాట వినిపిస్తూనే ఉంటుంది. ఈ సూపర్‌ హిట్‌ సాంగ్‌ను పాకిస్థాన్‌లోని ఒక బృందం డోలక్‌ వాయిస్తూ పాడుతున్న వీడియో వైరల్‌ అయింది. పాట పాడుతున్నంతసేపు కాసుల వర్షం కురుస్తూనే ఉంది!
 

Advertisement
 
Advertisement