ఈ ఫ్యాబ్రిక్స్‌ చాలా ప్రశాంతం బాస్‌! | Home Decor Is Beyond Looks, How Fabric Textures Influence Comfort, Mood And Mental Well-Being | Sakshi
Sakshi News home page

ఈ ఫ్యాబ్రిక్స్‌ చాలా ప్రశాంతం బాస్‌!

Jul 4 2026 9:13 AM | Updated on Jul 4 2026 10:07 AM

New Fabric Design Styles In Home Decor

ఇంటి అలంకరణ అంటే రంగులు మార్చడం, ఖరీదైన వస్తువులను అమర్చడమే అనుకుంటుంటారు చాలా మంది. కానీ ఇలా అనుకుంటే మీరు పొరపాటు పడ్డట్లేనని చెబుతున్నారు ఇంటీరియర్‌ రంగానికి చెందిన నిపుణులు. మనం నివసించే స్థలం కేవలం అందంగా కనిపించడమే కాదు.. మన మనస్సుకు ప్రశాంతతను, సేదతీరే సౌకర్యాన్ని అందించాలని చెబుతున్నారు. ఇంట్లో వాడే వివిధ రకాల దుస్తులు, వాటి టెక్స్చర్‌ సైతం మన దైనందిన జీవితాన్ని, మానసిక శ్రేయస్సును ప్రభావితం చేస్తాయంటున్నారు. అందుకోసం కొన్ని సలహాలు సూచిస్తున్నారు.

ఫ్యాబ్రిక్‌ టెక్స్చర్‌ అనేది కేవలం కంటికి కనిపించే ఒక డిజైన్‌ మాత్రమే కాదు, అది మన మానసిక భావాలతో ముడిపడి ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. మెత్తటి వెల్వెట్‌ కుర్చీలో కూర్చున్నప్పుడు కలిగే హాయి, అలాగే కిటికీల మందపాటి తెరలను తాకినప్పుడు కలిగే అనుభూతి మన మనస్సుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. బాహ్య పరిసరాల స్పర్శ వల్ల మెదడులో సానుకూల భావాలు రేకెత్తుతాయని నిపుణులు వివరిస్తున్నారు. కొన్ని రకాల మెత్తని బట్టలు మనకు రక్షణను, భద్రతా భావాన్ని ఇస్తే.. మరికొన్ని దృఢమైన మెటీరియల్స్‌ మనస్సుకు స్థిరత్వాన్ని ఇస్తాయి.

వెల్వెట్, ఫాక్స్‌ ఫర్‌: ఇవి గదికి విలాసవంతమైన లుక్‌ను ఇవ్వడమే కాకుండా, శీతాకాలంలో వెచ్చదనాన్ని, హాయిని అందిస్తాయి. వీటిని బెడ్‌ హెడ్‌బోర్డులు, యాక్సెంట్‌ కుర్చీలు, కుషన్ల కోసం ఎక్కువగా వాడుతుంటారు. లినెన్, కాటన్, ఉన్ని: ఇవి గదిలో ఎల్లప్పుడూ తాజాదనాన్ని నింపుతాయి. మానసిక ప్రశాంతతకు, ప్రశాంతమైన నిద్రకు ఇవి ఎంతో తోడ్పడుతాయి. ముఖ్యంగా బెడ్‌ షీట్లు, కర్టెన్లు, రోమన్‌ బ్లైండ్స్‌కు ఇవి అనువైనవి.

లెదర్, జ్యూట్, హెవీ వీవ్స్‌: జ్యూట్, లెదర్‌ వంటి మెటీరియల్స్‌ ఇంట్లో ఒక క్రమబద్ధతను, పటిష్టతను ప్రతిబింబిస్తాయి. ఇవి స్థిరత్వానికి చిహ్నంగా నిలుస్తాయి. వీటిని తివాచీలు, ఫ్లోర్‌ కుషన్లలో ఎక్కువగా ఉపయోగిస్తారు.

ఫెల్ట్, క్విల్టెడ్, వెయిటెడ్‌ ఫ్యాబ్రిక్స్‌: ఇవి ఇంటి లోపలి ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించడానికి, బయటి శబ్దాలు లోపలికి రాకుండా అడ్డుకోవడానికి ఉపయోగపడతాయి. ఆఫీస్‌ వర్క్‌ స్పేస్‌ లేదా ప్రశాంతతను కోరుకునే ప్రత్యేక గదులకు ఇవి ఉత్తమమైనవి. కాబట్టి, కేవలం ఫ్యాషన్‌ కోసం కాకుండా.. మన మానసిక ఉల్లాసానికి, ఆరోగ్యానికి మేలు చేసే టెక్స్‌టైల్స్‌ను ఎంచుకోవాలి. అపుడు ఇంట్లోనే సరికొత్త రీఛార్జింగ్‌ అనుభూతిని పొందవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement