మిల్లెట్‌ ఉద్యమి భారత్‌ .. | Millet Stakeholder Summit 2025 Starts At T Hub Hyderabad, More Details Inside | Sakshi
Sakshi News home page

మిల్లెట్‌ ఉద్యమి భారత్‌ ..

Jun 22 2025 2:07 PM | Updated on Jun 22 2025 3:24 PM

Millet Stakeholder Summit 2025 Starts At T Hub Hyderabad

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌ నగరంలోని మినర్వా హాల్స్‌లో ‘మిల్లెట్‌ ఉద్యమి భారత్‌–2025’ పేరుతో ఐదు రోజుల పాటు నిర్వహించే జాతీయ స్థాయి కార్యక్రమం శనివారం ప్రారంభమైంది.  www. millets. news మిల్లెట్స్‌ నేషనల్‌ మీడియా పోర్టల్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దీనికి దేశం నలుమూలల నుంచి 25 రాష్ట్రాలకు చెందిన 140 మంది హాజరౌతున్నారు. 

దీని ద్వారా మిల్లెట్‌ వ్యవసాయం నేర్చుకునే రైతులు, ఉత్పత్తులు తయారు చేయాలనుకునే వ్యాపారులు, ఆరోగ్యానికి మిల్లెట్లు ఎలా సహాయపడతాయి అనే అంశాలపై ఆరోగ్య ప్రేమికులందరికీ శిక్షణ ఇవ్వనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇందులో భాగంగా ఒడిశా వ్యవసాయశాఖ అధికారి తపస్‌ చంద్ర రాయ్‌ రైతులకు మిల్లెట్‌ సాగుపై శాస్త్రీయ శిక్షణ ఇస్తున్నారు. 

జైపూర్‌కు చెందిన జగన్నాథ్‌ చిన్నారి మిల్లెట్‌ ప్రాసెసింగ్, ఉత్పత్తుల తయారీలో నైపుణ్యాలపై అవగాహన కలి్పస్తున్నారు. వెయ్యికిపైగా ఆరోగ్య సంబంధిత ప్రశ్నలు–సమాధానాలు ఈ పోర్టల్‌లో అందుబాటులో ఉన్నాయని సంస్థకు చెందిన పోర్టల్‌ ఛైర్మన్‌ ప్రసన్న శ్రీనివాస్‌ శరకడం తెలిపారు. 

మిల్లెట్స్‌లో నిపుణులుగా మారాలనుకునే ఎవరైనా తమను సంప్రదించవచ్చన్నారు. ఇండియన్‌ ఇన్‌స్టిటూŠయ్‌ట్‌ ఆఫ్‌ మిల్లెట్స్‌ రీసెర్చ్‌ (ఐఐఎంఆర్‌) నుంచి న్యూట్రీహబ్‌ సీఈఓ డా.స్టాన్లీ, మిల్లెట్‌ ఇన్నోవేషన్‌ నిపుణురాలు అఖితా ఉపాధ్యాయ్‌ రెండు రోజులపాటు శిక్షణ ఇస్తారని వివరించారు. హెచ్‌ఎన్‌ఏ కౌన్సిల్‌ సభ్యులు డా.మోనికా శ్రావంతి ఆరోగ్య శిక్షణనిస్తారు. దేశంలోని ప్రతి రాష్ట్రం నుంచి ఎంపిక చేసిన నలుగురు ఈ శిక్షణలో పాల్గొంటున్నారు. రైతులు, తయారీదారులు, డైటీషియన్‌లు, ఆరోగ్య కార్యకర్తలు దీనిలో భాగస్వామ్యం కానున్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement