
వయసులో అతను వృద్ధుడే కానీ బాడీ పరంగా ఉక్కులాంటి దేహం. యువ బాడీబిల్డర్‌లకు ఏ మాత్రం తీసిపోని దేహదారుఢ్యం అతని సొంతం. తొమ్మిది పదుల వయసులో ఓ వీల్‌చైర్‌కే పరిమితమై.. మనుషులను గుర్తుపట్టలేని స్థితిలో ఉంటారు. అతను మాత్రం చాలా యాక్టివిగ్ అచ్చం యువకుడిలో ఉండే నూతనోత్సహాం అతనిలో ఉంది. ఇంతకీ అతను ఎవరూ? ఆ వయసులో కూడా అంత చురుగ్గా ఎలా ఉన్నాడంటే..
జిమ్ అరింగ్టన్ అనే వ్యక్తి ఓ బాడీ బిల్డర్. అతను వయసులో ఉన్నపుడే ఎలాంటి బాడీని మెయింటేన్ చేశాడో అలానే వృద్ధాప్యంలో కూడా మెయింటేన్ చేసి అబ్బురపర్చాడు. 90ల వయసులో కూడా బాడీ బిల్డర్ మాదిరి తన కండలు, బాడీ తీరు మారకపోవడవం విశేషం. క్రమం తప్పకుండా చేసే జిమ్, తీసుకునే ఫుడ్ డైట్ కారణంగా అతను అలా బాడీని కంటిన్యూ చేయగలిగాడు. దీంతో అతను అత్యంత వృద్ధ బాడీ బిల్డర్‌గా రికార్డు నెలకొల్పోడు.
తనకు చిన్నప్పటి నుంచి బాడీ బిల్డింగ్ మీద మక్కువ ఉండేదని, ఇదే తన ఆరోగ్యాన్ని మంచిగా కాపాడుకునేలా చేసిందని ఆనందంగా చెబుతున్నడు అరింగ్టన్. ఈ మేరకు గిన్నిస్ వరల్డ్ రికార్డు అతని హెల్త్ సీక్రెట్‌కి సంబంధించిన వీడియోని నెట్టింట పోస్ట్ చేసింది. అందులో తన ఆరోగ్య రహస్యం, బాడీని అలా మెయింటైన్ చేయాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు చిట్కాలను పంచుకున్నాడు అరింగ్‌టన్. దీంతో ఈ వీడియోని చూసిన నెటిజన్లు ఈ వయసులో కూడా బాడీని ఫిట్‌గా ఉంచి అందరికి స్ఫూర్తిగా నిలిచారంటూ అరింగ్టన్‌పై ప్రశంసల జల్లు కురిపించారు.
(చదవండి: వ్యాధుల నిర్థారణ వైఫల్యతతో..ఏటా 8 లక్షల ప్రాణాలు బలి)