గర్ల్‌ ఫ్రెండ్‌ కోసం, సాహసం: అతగాడి కష్టం తెలిస్తే ఔరా అనాల్సిందే! | Sakshi
Sakshi News home page

గర్ల్‌ ఫ్రెండ్‌ కోసం, సాహసం: అతగాడి కష్టం తెలిస్తే ఔరా అనాల్సిందే!

Published Thu, Mar 28 2024 1:36 PM

Man spent almost four years growing hair wig for her girlfriend - Sakshi

ప్రియురాలి  కోసం గొప్ప సాహసం చేశాడో  ప్రియుడు. ఇందుకోసంగా దాదాపు నాలుగేళ్లపాటు కష్టపడి మరీ జాగ్రత్తగా ఆమెకు విగ్‌ను గిఫ్ట్‌గా ఇచ్చాడు. విగ్‌ను గిఫ్ట్‌గా ఇవ్వడానికి అంత కష్టం ఎందుకు అనుకుంటున్నారా? రండి.. ఈ స్టోరీని చూద్దాం.

మెయిల్‌ ఆన్‌లైన్‌ కథనం ప్రకారం మిచిగాన్‌లోని వాటర్‌ఫోర్డ్‌కు చెందిన కోడి ఎన్నిస్, హన్నా హోస్కింగ్‌ ఇద్దరూ  ప్రేమికులు. ఆరునెలల డేటింగ్‌ తరువాత తనకోసం 30 అంగుళాల జట్టు కావాలని అడిగింది సరదాగా.  అంతేకాదు దీనికి మూడు నాలుగేళ్లుపడుతుందని కూడా  జోక్‌ చేసింది. అయితే దీన్ని సీరియస్‌గా తీసుకున్నాడు ఎన్నిస్‌.

2020, మే నుంచి జుట్టు పెంచడాన్ని ప్రారంభించాడు. దీనికోసం వేలాది ఆన్‌లైన్‌ క్లాసులు, ఆన్‌లైన్ ట్యుటోరియల్స్‌ చూశాడు. దీన్ని ఒక  యజ్ఞంలాగా  చేపట్టాడు. క్రమం తప్పకుండా జుట్టును వాష్‌ చేసుకోవడం, కండీషనింగ్‌ లాంటి ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాడు. కాస్మోటాలజిస్ట్ సలహా మేరకు ఖరీదైన షాంపూలు, కండిషనర్లు వాడాడు. జుట్టు ఏ మాత్రం తెగకుండా సిల్క్‌ బోనెట్‌ వాడుతూ జాగ్రత్తపడ్డాడు. చివరికి గత అక్టోబరులో, తన జుట్టును 29-అంగుళాలకు పెంచాడు. దీన్ని కట్‌ చేసి అంతే జాగ్రత్తగా అందమైన విగ్‌ను ఆమెకు ప్రెజెంట్‌ చేశాడు. అచ్చం ఆమె పాత జుట్టులా ఉండేలా శ్రద్ధ తీసుకోవడం మరీ విశేషం. 

అసలు విషయం ఏమిటంటే..
హన్నా హోస్కింగ్‌ ఒక కంటెంట్‌క్రియేటర్‌. ఆమెకు ఏడేళ్లున్నపుడే అలోపేసియా (హెయిర్ ఫోలికల్ మూలాలను నాశనం చేసే ఆటో-ఇమ్యూన్) అనే వ్యాధి సోకింది.  దీంతో క్రమంగా దాదాపు ఐదేళ్ల క్రితంఆమె శరీరం మీద ఉన్న ఒక్కో వెంట్రుక(కనుబొమ్మలతో) సహా రాలిపోవడం మొదలైంది.దీంతో జుట్టుంతా షేవ్ చేసుకుంది. ఈ క్రమంలో 2019లో కోవిడ్ లాక్‌డౌన్ సమయంలో నవంబరులో హన్నా ఎన్నిస్‌ తొలిసారి కలుసుకున్నారు. వీరి పరిచయం ప్రేమంగా మారింది.

‘ఇది తన జీవితంలో  మర్చిపోలేని అనుభూతి అని, సినిమాలా అనిప్తిస్తోంది అని హన్నా భావోద్వేగానికి లోనైంది హనా. ‘‘ఇది మామూలు విగ్‌ కాదు. సాధ్యమైనంత ఎక్కువ కాలం పాటు నాతో ఉండాలని కోరుకుంటున్నాను. తన జీవింతలో ఇంత ఇష్టపడే వ్యక్తి ఉన్నాడని తెలియడం,చాలా ఓదార్పుగా, భద్రంగా అనిపిస్తోంది’’ అంటూ  కంటతడి పెట్టుకుంది.  తన బాయ్‌ఫ్రెండ్స్ జుట్టుతో తయారు చేసిన విగ్‌ పెట్టుకుని ఫోటోలకు ఫోజులిచ్చింది హన్నా.

నా విగ్గు తనకి చక్కగా అమరిపోయింది అంటే..ఇక నాతో తను విడిపోలేదు అని చెప్పాడు ప్రేమతో

Advertisement
 
Advertisement