
కర్ణాటకలోని మల్నాడ్ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు జోగ్ జలపాతం అద్భుత దృశ్యంతో అలరారుతోంది. భారీ వర్షాల తర్వాత జోగ్ జలపాతం అద్భుతంగా పర్యాటకులను ఆకర్షిస్తోంది. కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలోని సాగర్ తాలూకాలోని షరావతి నదిపై నిర్మించిన లింగనమక్కి ఆనకట్ట గేట్లను ఆగస్టు 19న తెరిచారు. కర్ణాటక పశ్చిమ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాల తర్వాత అదనపు నీటిని విడుదల చేశారు.ఈ ఉత్కంఠభరితమైన దృశ్యాలను చూడటానికి చుట్టు పక్కల గ్రామాలనుంచి ప్రజలు క్యూ కట్టారు. సోషల్ మీడియాలో జోగ్ అందాల వీడియోలు తెగ సందడి చేస్తున్నాయి.
JOG Falls, India's 2nd highest , 830 ft Mega water fall, is at its peak now.
Near Shivamogga, #Karnataka.pic.twitter.com/sMd2mBT8nq— Mahesh.BR (@Maheshbr4U) August 20, 2025

కర్ణాటకలోని జోగ్ జలపాతాన్ని పర్యాటకులు తరలివస్తున్నారు. పొగమంచులా కనిపిస్తున్న జలదృశ్యాన్ని చూసి ఉప్పొంగిపోతున్నారు. రిజర్వాయర్,ఆనకట్టను నిర్వహించే కర్ణాటక పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (కెపిసిఎల్) అధికారులు ఉదయం 10 గంటల ప్రాంతంలో గేట్లను తెరవడం ప్రారంభించారు.
Time to visit #JogFalls !
As linganamakki dam is filled & all crest gates are opened on Aug-19th
VC: Madhu gowda pic.twitter.com/espIGjmQqY— Karnataka Development Index (@IndexKarnataka) August 20, 2025
మొత్తం 11 గేట్లను తెరిచారు. ఆనకట్టలో నీటి మట్టం ఇన్‌ఫ్లో పెరగడంతో పాటు 15,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఆగస్టు 19 ఉదయం నాటికి, జలాశయం పూర్తి స్థాయి 1,819 అడుగుల నీటి మట్టం ఉండగా, నీటి మట్టం 1,816.2 అడుగులుగా ఉంది.