breaking news
jog
-
జోరు జోరుగా జోగ్.. క్యూ కడుతున్న టూరిస్టులు
కర్ణాటకలోని మల్నాడ్ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు జోగ్ జలపాతం అద్భుత దృశ్యంతో అలరారుతోంది. భారీ వర్షాల తర్వాత జోగ్ జలపాతం అద్భుతంగా పర్యాటకులను ఆకర్షిస్తోంది. కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలోని సాగర్ తాలూకాలోని షరావతి నదిపై నిర్మించిన లింగనమక్కి ఆనకట్ట గేట్లను ఆగస్టు 19న తెరిచారు. కర్ణాటక పశ్చిమ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాల తర్వాత అదనపు నీటిని విడుదల చేశారు.ఈ ఉత్కంఠభరితమైన దృశ్యాలను చూడటానికి చుట్టు పక్కల గ్రామాలనుంచి ప్రజలు క్యూ కట్టారు. సోషల్ మీడియాలో జోగ్ అందాల వీడియోలు తెగ సందడి చేస్తున్నాయి.JOG Falls, India's 2nd highest , 830 ft Mega water fall, is at its peak now.Near Shivamogga, #Karnataka.pic.twitter.com/sMd2mBT8nq— Mahesh.BR (@Maheshbr4U) August 20, 2025 కర్ణాటకలోని జోగ్ జలపాతాన్ని పర్యాటకులు తరలివస్తున్నారు. పొగమంచులా కనిపిస్తున్న జలదృశ్యాన్ని చూసి ఉప్పొంగిపోతున్నారు. రిజర్వాయర్,ఆనకట్టను నిర్వహించే కర్ణాటక పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (కెపిసిఎల్) అధికారులు ఉదయం 10 గంటల ప్రాంతంలో గేట్లను తెరవడం ప్రారంభించారు. Time to visit #JogFalls !As linganamakki dam is filled & all crest gates are opened on Aug-19thVC: Madhu gowda pic.twitter.com/espIGjmQqY— Karnataka Development Index (@IndexKarnataka) August 20, 2025 మొత్తం 11 గేట్లను తెరిచారు. ఆనకట్టలో నీటి మట్టం ఇన్‌ఫ్లో పెరగడంతో పాటు 15,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఆగస్టు 19 ఉదయం నాటికి, జలాశయం పూర్తి స్థాయి 1,819 అడుగుల నీటి మట్టం ఉండగా, నీటి మట్టం 1,816.2 అడుగులుగా ఉంది. -
జలజల జోగ్ పాతం..చూసేందుకు పర్యాటకులు క్యూ (ఫొటోలు)
-
జోగ్ జలపాతం ఉరకలు : రెండు కళ్లూ చాలవు! వైరల్ వీడియో
భారతదేశంలోని కర్ణాటక రాష్ట్రంలోని షిమోగ జిల్లాలోని సాగర తాలూకాలో ఉన్న జోగ్ జలపాతం నిండు కుండలా కళకళలాడుతోంది. దేశంలోని ఎత్తైన జలపాతాలలో ఒకటి జోగ్. సహజ సౌందర్యంతో, నీటి ప్రవాహం హోరు, పాల నురుగు లాంటి లయలతో అద్భుతమైన దృశ్యాన్ని చూసేందుకు పర్యాటకులు క్యూ కడతారు. తాజా వర్షాలతో పూర్తి జలకళను సంతరించుకుని నయాగరాను మించిన సోయగాలతో ఆకట్టుకుంటోంది. Jogfalls as seen today in its full glory!#jogfalls #2024 #karnataka #KarnatakaRains pic.twitter.com/NhAWrScft4— Raj Mohan (@rajography47) August 3, 2024జోగ్ జలపాతం విశేషాలు జోగ్ జలపాతం 253 మీటర్ల (829 అడుగులు) ఎత్తు. ఇది భారతదేశంలోని ఎత్తైన జలపాతాలలో ఒకటి. జోగ్ జలపాతం ఒక ట్రెయల్లో పడుతుంది. అందుకే ఇది “ట్రెయిల్ జలపాతం” గా పాపులర్ అయింది.The mighty Jog 😍 Raja, Rani, Roarer and Rocket all came together!!#jogfalls #karnataka #IncredibleIndia #KarnatakaRains pic.twitter.com/tXlGffcWKy— Raj Mohan (@rajography47) August 3, 2024 -
ఏడాది క్రితం పెళ్లి.. జోగ్ ఫాల్స్ చూడాలని వెళ్లి..
శివమొగ్గ: జోగ్ జలపాతాన్ని చూడాలని వచ్చిన దంపతులకు తీవ్ర విషాదం ఎదురైంది. భార్య నీటి కాలువలో పడి మృతి చెందింది. మృతురాలు బెంగళూరు నగరానికి చెందిన నిశా (24). ఆమెకు ఏడాది క్రితం నాగేష్ అనే వ్యక్తితో పెళ్లయింది. ఇద్దరూ కలిసి జోగ్ జలపాతం చూడాలని వచ్చారు. మంగళవారం జలపాతం వెనుకాల ఉన్న జంగిల్ రిసార్టు కాలువలో ఆమె జారి పడింది. వెంటనే అక్కడ ఉన్న వారు బయటకు తీసి ఆస్పత్రికి తరలించినా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కార్గల్ పోలీసులు కేసు నమోదు చేశారు. చదవండి: (సరళ వాస్తు గురూజీ దారుణ హత్య.. కాళ్లు మొక్కుతున్నట్లు నటించి) -
కనువిందు చేస్తున్న జోగ్ జలకళ
గత కొద్దిరోజులుగా దేశవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. అనేక జలపాతాలు జలకళను సంతరించుకున్నాయి. ముఖ్యంగా దేశంలోనే అత్యంత ఎత్తైన జలపాతంగా పేరొందిన జోగ్ మరింత ఎగిసిపడుతూ దృశ్యమానంగా కనువిందు చేస్తోంది. కర్ణాటకలోని ఎగువ ప్రాంతాల్లోని వర్షపు నీరు కిందకి ప్రవహించడంతో జోగ్ జలపాతానికి వరద పోటెత్తింది. కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలో జోగ్ జలపాతం పర్యాటకులను కనువిందు చేస్తోంది. శరావతి నది ఉప్పొంగి ప్రవహించడంతో దేశంలోనే అతిపెద్ద జలపాతం జోగ్ నుంచి నీళ్లు కిందకు దుముకుతుంటే ఆ ప్రాంతంమంతా ఆహ్లాదకరంగా మారింది. లింగనమక్కి డ్యాం నుంచి నీటిని విడుదల చేయడంతో సముద్రమట్టానికి 250 మీటర్ల (830 అడుగుల) ఎత్తులో ఉన్న ఈ అద్భుతదృశ్యాన్ని చూసేందుకు పర్యాటకులు భారీగా వస్తున్నారు. ఈ రిజర్వాయర్ నుంచి నాలుగు సంవత్సరాల తర్వాత, పెద్ద మొత్తంలో నీటిని విడుదల చేయడం ఇదే మొదటిసారట. కాగా దేశవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు పలు రాష్ట్రాల ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ముఖ్యంగా వరద బీభత్సానికి విలవిల్లాడుతున్న కేరళలో ఇంకా విపత్కర పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే 42మంది మృత్యువాత పడ్డారు. పెద్దఎత్తున సహాయ, రక్షకసేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ముళ్ల పెరియార్ డ్యామ్‌లో నీటిస్థాయి ప్రమాద స్థాయికి చేరుకోవడంతో పలు జిల్లాల్లో తాజాగా రెడ్ అలర్ట్ జారీ చేశారు. -
కనువిందు చేస్తున్న జోగ్ జలకళ
-
ఫేస్ మాస్క్ లేకుండా చైనాలో జుకర్‌బర్గ్
బీజింగ్: ప్రపంచ దేశాల్లో రోజుకో మైలు చొప్పున పరుగెత్తడం వ్యక్తిగత లక్ష్యంగా పెట్టుకున్న ఫేస్బుక్ సీఈవో జుకర్‌బర్గ్ చైనాలోని తియానన్మెన్ స్క్వేర్ను సందర్శించడం, అక్కడ తాను పరుగెత్తుతున్న దృశ్యాన్ని అక్కడి నుంచే పోస్ట్ చేయడం సోషల్ మీడియాలో వివాదాస్పదమైంది. ఫేస్‌బుక్‌ను నిషేధించిన దేశంలో దాని అధిపతి పర్యటించడమా? అని కొంతమంది విమర్శలు చేయగా, 26 ఏళ్ల క్రితం వేలాది మంది విద్యార్థులను ట్యాంకులతో తొక్కించిన తియానన్మెన్ స్క్వేర్ను సందర్శించడం ఏమిటని మరి కొంతమంది విమర్శలు సంధించారు. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన చైనా ప్రజలను కస్టమర్లను చేసుకోవడం కోసం జుకర్‌బర్గ్ చైనా ప్రభుత్వం గడ్డికరుస్తున్నారని ఇంకొంతమంది కామెంట్ చేశారు. ప్రపంచ కాలుష్య నగరాల్లో నెంబర్ వన్‌గా నిలిచినా బీజింగ్‌లో ముఖానికి మాస్క్ కూడా లేకుండా తిరుగుతున్నావా? అంటూ కొందరు సరదాగా కామెంట్ చేశారు. ‘ఒకప్పుడు అందరూ వదిలేసిన నగరంలో నేడు నేను పరుగెత్తాను. ఇది నా వందో మైలు కావడం కూడా విశేషమే. నా వెంట ఇక్కడ, ప్రపంచంలో నాతో కలసి పరుగెత్తిన వారికి ధన్యవాదాలు. తియానన్మెన్ స్క్వేర్‌లో పరుగెత్తడం ద్వారా నా చైనా పర్యటన ప్రారంభమైంది’ అంటూ జుకర్‌బర్గ్ శుక్రవారం నాడు ఫేస్బుక్లో తన ఫొటోతోపాటు కామెంట్ పోస్ట్ చేశారు. తన పోస్ట్ పై వచ్చిన కామెంట్లలో కొన్నింటికి మాత్రమే జుకర్‌బర్గ్ సమాధానం ఇచ్చారు. ముఖ్యంగా విమర్శలను పట్టించుకోలేదు. ఓ కమ్యూనిస్టు దేశంతో ఐడెంటిఫై అవుతావా అంటు కూడా విమర్శలు వచ్చాయి. జుకర్‌బర్గ్ చైనాను సందర్శించడం ఇదే మొదటిసారి కాదు. ఈ సారి పర్యటనపై మాత్రం ఎక్కువ విమర్శలు వచ్చాయి. ఆయన గతేడాది సియాటిల్‌లో చైనా అధ్యక్షుడు గ్సీ జింగ్‌పింగ్‌ను కూడా కలుసుకున్నారు. చైనాలో ఫేస్‌బుక్‌ను నిషేధించినప్పటికీ అక్కడి కస్టమర్లను ఆకర్శించడం జుకర్‌బర్గ్ లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకోసం ఆయన గతేడాది ఆండ్రాయిడ్ యాప్‌లో మార్పులు కూడా తీసుకొచ్చారు.