
కంఠహారం, చెవి జూకాలు, ఉంగరాలు.. ఇలా ఆభరణాలను ఒక సెట్‌గా తీసుకోవడం మనకు తెలిసిందే! ఇప్పుడు డిన్నర్ సెట్ ఆభరణాల అలంకరణ కొత్త ట్రెండ్‌గా మారింది. డిన్నర్‌సెట్ ఆభరణాలు ఇంటికి మరింత కళను తీసుకువస్తున్నాయి. పింగాణీ కప్పులు, ప్లేట్ల మీద ఇంపైన ఆభరణాల డిజైన్లు భలే మెరుస్తున్నాయి. డిజైన్‌ను బట్టి, వాటికి వాడిన రంగుల నాణ్యతను బట్టి వీటి ధరలు ఉంటున్నాయి. వీటిలో పూసలు, ముత్యాలు, స్టోన్స్, ఎనామిల్ పెయింట్స్‌ను కూడా వాడుతున్నారు.
ఈ డిజైన్లలో బంగారు పూత, నిజమైన రత్నాలు వాడినవీ ఉంటున్నాయి. ప్లెయిన్‌గా ఉండే పింగాణీ కప్పుల మీద అందమైన ఆభరణాల డిజైన్లను తీర్చిదిద్దేతే అవి కొత్త అందాన్ని సంతరించుకుంటాయి. ప్లెయిన్ పింగాణీ వస్తువులను కొనుక్కుని, వాటిపై స్వయంగా రంగులు వేసుకోవచ్చు. ఆభరణాల డిజైన్‌నూ దిద్దుకోవచ్చు. అతిథులను ఆకట్టుకునేలా వీటిని వేడుకలలో ఉపయోగిం చవచ్చు.