Jewellery designing
-
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
ఒక సినిమా నిర్మాణంలో మామూలుగా అయితే కొన్ని నగలు తెప్పిస్తారు. కాని ‘హీరామండీ’ వెబ్ సిరీస్ కోసం 300 కిలోల నగలు అవసరమయ్యాయి. అవి కూడా బ్రిటిష్ కాలం నాటివి. మొగల్ సంస్కృతీ వారసత్వానివి. ఢిల్లీలో శ్రీ పరమణి జువెలర్స్‌కు చెందిన అన్షు గుప్తా భర్త వినయ్‌తో కలిసి మూడేళ్ల పాటు శ్రమించి ఈ నగలు తయారు చేశారు. నత్, ఝూమర్, హాత్ ఫూల్, పస్సా, టీకా... ఎన్నో నగలు. అన్షు గుప్తా పరిచయం.స్త్రీలు, అలంకరణ అవిభాజ్యం. స్త్రీలు, ఆభరణం కూడా అవిభాజ్యమే. ఆభరణంతో నిండిన అలంకరణ భారతీయ స్త్రీలలో వేల సంవత్సరాలుగా ఉంది. బంగారం, వెండి, వజ్రాలు, రత్నాలు, కెంపులు, మరకతాలు, ముత్యాలు... వీటితో తయారైన ఆభరణాలు రాచరిక స్త్రీలకు ప్రీతికరమైనవి. ఐశ్వర్యవంతులకు స్థాయిని కలిగించేవి. అయితే వీరే కాకుండా కళకారులకు కూడా ఆభరణాలు కీలకమైనవి. మొగలుల కాలంలో విరాజిల్లిన తవాయిఫ్‌లు (రాజనర్తకీమణులు) తమ ప్రదర్శనల్లో ఆకర్షణ కోసం భారీ ఆభరణాలను ఉపయోగించేవారు. మరి వారి గురించిన గాథను తెరకెక్కించేటప్పుడు ఆ ఆభరణాలు ఎక్కడి నుంచి వస్తాయి? వాటిని అందించడానికి ముందుకు వచ్చిన జువెలర్స్ అన్షు గుప్తా, ఆమె భర్త వినయ్ గుప్తా.హీరా మండి..మొగలుల కాలంలో లాహోర్‌లోని ఒక ఏరియా పేరే హీరా మండి. దాని అంతకు ముందు పేరు షాహీ మొహల్లా. అంటే రాచవాడ. పక్కనే ఉన్న కోట నుంచి నవాబులు నడిచి వచ్చేంత దూరంలో ఉండే కొన్ని భవంతుల సముదాయమే షాహీ మొహల్లా. ఇక్కడ తవాయిఫ్‌లు ఉండేవారు. వీరు ఆట, పాటల్లో నిష్ణాతులు. సాయంత్రమైతే వీరి భవంతుల్లో ప్రదర్శనలు జరిగేవి. నవాబులు, శ్రీమంతులు, రసికులు వీటికి హాజరయ్యి తిలకించేవారు. ఈ తవాయిఫ్‌లకు విశేష పలుకుబడి ఉండేది. వీరి దగ్గర ఐశ్వర్యం ఉండేది. రాచరిక రహస్యాలు మొదట వీరికే తెలిసేవి. వీరు మంత్రాంగం నడిపేవారు. 1857 సైనిక తిరుగుబాటులో కూడా వీరు పాల్గొన్నారు. కాని బ్రిటిష్ కాలం వచ్చేసరికి ఇదంతా గతించిపోయింది. షాహీ మొహల్లా కాస్తా సరుకులు అమ్మే మండీగా హీరా మండీగా మారింది. ఆనాడు వెలిగిన వారంతా అంతరించిపోయారు. వేశ్యలుగా మారారు. వారి గాథనే దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ‘హీరామండీ’ పేరుతో భారీ వెబ్‌సిరీస్‌గా తీశాడు. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతోంది.భారీ నగలుపర్‌ఫెక్షనిస్ట్ అయిన దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ ‘హీరామండీ’లో తవాయిఫ్‌ల కోసం నాటి మొగల్ తరహా నగలు కావాలని భావించాడు. గతంలో తన ‘బాజీరావు మస్తానీ’ కోసం పని చేసిన ఆభరణాల శిల్పులైన అన్షు గుప్తా, ఆమె భర్త వినయ్ గుప్తాలను సంప్రదించాడు. వీరు ఢిల్లీవాసులు. వీరికి శ్రీ పరమణి జువెలర్స్ అనే నగల కార్ఖానా, షోరూమ్ ఉన్నాయి. 200 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ కార్ఖానాలో ఖరీదైన ఆభరణాలు దొరుకుతాయి. ‘కథ విన్న వెంటనే టైటిల్ దగ్గరి నుంచి ప్రతి పాత్రా ఆభరణాలతో ముడిపడి ఉన్నందుకు ఉత్సాహం వచ్చింది. చరిత్రలోకి వెళ్లి పరిశోధించి నాటి ఆభరణాలు తయారు చేయాలి. మొగలులు కళాప్రియులు. వారి కాలంలో ఆభరణాలలో కెంపులు. ముత్యాలు, వజ్రాలు విరివిగా వాడేవారు. ఆపాదమస్తకం అలంకరించుకోవడానికి వందల రకాల ఆభరణాలు ఉండేవి. అవన్నీ మేము తయారు చేయడానికి ముందుకు వచ్చాం. నేను, నా భర్త వినయ్ మూడేళ్లు కష్టపడి ఈ నగలు తయారు చేయించాం’ అని తెలిపింది అన్షు గుప్తా.అసలు సిసలు బంగారంతో‘‘హీరామండీ కోసం కొన్ని ముఖ్యమైన నగలు అసలు బంగారంతోనూ, మిగిలినవి బంగారు పూత కలిగిన వెండితోనూ తయారు చేయించాలని నిర్ణయించాం. వజ్రాలు, ముత్యాలు అన్నీ ఒరిజినల్‌వే వాడాం. మా కార్మికులు మూడేళ్ల పాటు శ్రమపడి మూడు గదుల్లో పది వేల చిన్న, పెద్ద ఆభరణాలు తయారు చేశారు. వీటిని తూస్తే 300 కిలోలు ఉంటాయి. నథ్ (ముక్కు పుడక) దగ్గరి నుంచి నెమలి నెక్లెస్ వరకూ వీటిలో ఉన్నాయి. షూటింగ్లో ప్రత్యేక గార్డులు వీటికి కాపలా ఉన్నారు. ‘మేం చేసిన ఆభరణాలు పాత్ర కోసం ధరించి వీటితో పారిపోతే ఒక సినిమా తీసేన్ని డబ్బులొస్తాయి’ అనేది నటి రిచా చద్దా సరదాగా. హీరామండీని చూస్తే ఒక పాత్ర ధరించిన పాపిడి బిళ్లతో మరో పాత్ర ధరించిన పాపిటబిళ్లకు పోలిక ఉండదు. గాజులు, ఉంగారాలు, చెవి కమ్మలు... తెర మీద అద్భుతంగా ఆవిష్కృతమైన తీరుతో మా కష్టం వృథా పోలేదనిపించింది’’ అని సంతోషాన్ని వ్యక్తం చేసింది అన్షు గుప్తా. -
ఆభరణాల డిన్నర్ సెట్
కంఠహారం, చెవి జూకాలు, ఉంగరాలు.. ఇలా ఆభరణాలను ఒక సెట్‌గా తీసుకోవడం మనకు తెలిసిందే! ఇప్పుడు డిన్నర్ సెట్ ఆభరణాల అలంకరణ కొత్త ట్రెండ్‌గా మారింది. డిన్నర్‌సెట్ ఆభరణాలు ఇంటికి మరింత కళను తీసుకువస్తున్నాయి. పింగాణీ కప్పులు, ప్లేట్ల మీద ఇంపైన ఆభరణాల డిజైన్లు భలే మెరుస్తున్నాయి. డిజైన్‌ను బట్టి, వాటికి వాడిన రంగుల నాణ్యతను బట్టి వీటి ధరలు ఉంటున్నాయి. వీటిలో పూసలు, ముత్యాలు, స్టోన్స్, ఎనామిల్ పెయింట్స్‌ను కూడా వాడుతున్నారు. ఈ డిజైన్లలో బంగారు పూత, నిజమైన రత్నాలు వాడినవీ ఉంటున్నాయి. ప్లెయిన్‌గా ఉండే పింగాణీ కప్పుల మీద అందమైన ఆభరణాల డిజైన్లను తీర్చిదిద్దేతే అవి కొత్త అందాన్ని సంతరించుకుంటాయి. ప్లెయిన్ పింగాణీ వస్తువులను కొనుక్కుని, వాటిపై స్వయంగా రంగులు వేసుకోవచ్చు. ఆభరణాల డిజైన్‌నూ దిద్దుకోవచ్చు. అతిథులను ఆకట్టుకునేలా వీటిని వేడుకలలో ఉపయోగిం చవచ్చు. -
పట్టుదారంతో జీవితాన్ని అల్లుకుంది
నేనేంటి? నాకంటూ చెప్పుకోవడానికి ఏమీ లేదా? ఈ ప్రశ్నలు పావనిని వెంటాడాయి... వేధించాయి. చదువుంది... పెద్ద ఉద్యోగం చేయాలనే ఆకాంక్ష ఉంది. అబ్దుల్ కలామ్ చెప్పినట్లు పెద్ద కలలు కన్నదామె. ఆ కలలను నిజం చేసుకోవడానికి తగినట్లు శ్రమించింది కూడా. జీవితం మాత్రం... ఆమె చదవని సిలబస్‌తో పరీక్ష పెట్టింది. ఆ పరీక్షను సహనంతో ఎదుర్కొన్నది... ఉత్తీర్ణత సాధించింది. ఇక... తనను తాను నిరూపించుకోవాలనుంది. క్రియేటివిటీ ఆమెకు తోడుగా వచ్చి వెంట నిలిచింది. ఆమె ఇప్పుడు పట్టుదారంతో చక్కటి ఆభరణాలల్లుతోంది. పావని కోరెం... వరంగల్ జిల్లా, హన్మకొండలో పుట్టింది. బయో టెక్నాలజీలో గ్రాడ్యుయేషన్ చేసింది. ఇంకా చదవాలని, మంచి ఉద్యోగం తెచ్చుకోవాలని అనుకుంది. ఆమె ఆలోచనలకు భర్త అండగా నిలిచారు. పెళ్లి తర్వాత హైదరాబాద్‌లో కాపురం, ఉస్మానియాలో పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో చేరింది. బయో ఇన్ఫర్మాటిక్స్లో పీజీ పూర్తయింది. పోటీ పరీక్షల కోసం భార్యాభర్తలిద్దరూ కలిసి కోచింగ్కెళ్లారు. పరీక్షలకు సిద్ధమయ్యేలోపు జీవితం మరో పరీక్ష పెట్టింది. కడుపులో పెరుగుతున్న బిడ్డ గురించి చిన్న సందేహం. ఆ సందేహాన్ని నిజం చేయడానికా అన్నట్టు పుట్టగానే బిడ్డ ఏడవలేదు. నెలరోజులు హాస్పిటల్లోనే ఉంచి చికిత్స చేయించుకుని ఇంటికి వచ్చారు. స్పెషల్ కిడ్ కావచ్చనే మరో సందేహం. క్షణక్షణం బిడ్డ సంరక్షణలోనే గడిచిపోయింది. అనుక్షణం బిడ్డ ఎదుగుదల కోసం శ్రమించింది. తల్లిగా కఠోరయజ్ఞమే చేసింది. ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీలతో బాబుని మెయిన్‌స్ట్రీమ్‌లోకి తీసుకు రాగలిగింది. ఈ ఒత్తిడి నుంచి బయటపడడానికి తాను ఆశ్రయించిన ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ నుంచి తనను తాను తీర్చిదిద్దుకుంది. తనను తాను నిరూపించుకోవాలనే తపనతో పని చేసింది. ఇప్పుడామె తన సృజనాత్మకతతో గుర్తింపు పొందుతోంది. తన జీవితంలో దశాబ్దంపా టు సాగిన కీలక పరిణామాలను ఆమె సాక్షితో పంచుకున్నారు. ఊహించని శరాఘాతం! ‘‘మా పెళ్లి 2009లో జరిగింది. బాబు ఏడీహెచ్‌డీ (అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్) సమస్య ఉందని తెలిసింది. బోర్లా పడడం, పా కడం, కూర్చోవడం, నడవడం వంటివన్నీ కొంత ఆలస్యంగా చేశాడు. నార్మల్ కిడ్ చేయాల్సిన సమయానికంటే ఎంత ఆలస్యమవుతోందా అని క్యాలెండర్ చెక్ చేసుకుంటూ... కంటికి రెప్పలా కాపా డుకుంటూ వచ్చాను. ఇప్పుడు దాదాపుగా నార్మల్ కిడ్ అయ్యాడు. కానీ చిన్నప్పుడు రోజూ ఆందోళనే. బరువు తక్కువగా పుట్టడంతో ఇమ్యూనిటీ తక్కువగా ఉండేది. తరచూ జలుబు, జ్వరం వస్తుండేవి. అప్పట్లో మా వారికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూరులో ఉద్యోగం. కర్నాటకలో ఓ చిన్న గ్రామంలో పోస్టింగ్. అక్కడ వైద్య సదుపా యాలు తక్కువ. ప్రతినిత్యం భయంభయంగా గడిచేది. రెండున్నరేళ్లకే బాబుకి హెర్నియా ఆపరేషన్ చేయించాల్సి వచ్చింది. స్టేట్ బ్యాంకుకు అనేక అనుబంధ బ్యాంకుల్ని అనుసంధానం చేయడం కూడా అప్పుడే జరిగింది. ఎస్బీఐకి మారి హైదరాబాద్‌కి వచ్చేశాం. మన ్రపా ంతానికి వచ్చిన తర్వాత నన్ను వెంటాడిన భయం వదిలిపోయింది. బాబుకి మంచి వైద్యం చేయించగలమనే ధైర్యం వచ్చింది. ట్రీట్మెంట్ థెరపీలు జరిగేకొద్దీ బాబులో మెరుగుదల స్పష్టంగా కనిపిస్తుండేది. డిప్రెషన్ నుంచి మెల్లగా బయటపడ్డాను. రోజులు ఆశాజనకంగా గడుస్తున్నప్పటికీ నాలో ఏదో వెలితి ఉండేది. సృజనతో సాంత్వన నన్ను నేను ఏదో ఒక వ్యాపకంలో నిమగ్నం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండేదాన్ని. యూ ట్యూబ్ చూసి నేర్చుకున్న పేపర్ క్విల్లింగ్ మంచి సాంత్వననిచ్చింది. బాబుకి ఫిజియోథెరపీ చేయించే ట్రైనర్ నేను క్విల్లింగ్‌లో చేసిన పూలు, బొమ్మలను చూసి, చాలా బాగున్నాయని తీసుకెళ్లారు. వాటిని ఆ రోజే వాళ్ల హాస్టల్ స్టూడెంట్స్ కొనుక్కున్నారు. అప్పుడే మా ఫ్రెండ్ పట్టు దారంతో ఆభరణాలు తయారు చేయమని చెప్పింది. అలా నా లైఫ్ కొత్త మలుపు తీసుకుంది. హాబీగా మొదలు పెట్టిన యాక్టివిటీ కాస్తా నాకు ఒక ప్రత్యేకమైన గుర్తింపునిచ్చింది. తెలిసిన వాళ్ల నుంచి నా సృజనాత్మకత ఎల్లలు దాటింది. దుబాయ్, యూఎస్, యూకే, చైనా ల నుంచి ఆర్డర్లు వస్తున్నాయి. ఫేస్బుక్ బిజినెస్ పేజ్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, జస్ట్ డయల్, మీ షోలలో నా అల్లికలు విపరీతంగా అమ్ముడవుతున్నాయి. రిటర్న్ గిఫ్ట్‌లు ఇవ్వడానికి బల్క్ ఆర్డర్లు వస్తుంటాయి. అలాంటప్పుడు రాత్రంతా పని చేస్తుంటాను. ముగ్గురు అమ్మాయిలకు ఎంప్లాయ్మెంట్ ఇచ్చాను. మేము తయారు చేసిన ఉత్పత్తులను పికప్ బాయ్స్ వచ్చి తీసుకెళ్తారు. బాబును చూసుకుంటూ నా యాక్టివిటీని కొనసాగిస్తున్నాను. మొదట్లో అయితే మెటీరియల్ కోసం వెతుక్కుంటూ బాబును బండి మీద కూర్చోబెట్టుకుని బేగం పేట నుంచి బేగం బజార్‌కు వెళ్లేదాన్ని. ఇప్పుడైనా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తే వస్తుంది. కానీ బాబుకు ఇంకా నా అవసరం ఉంది. నేను దగ్గరుండి చూసుకుంటే మెరుగ్గా ఉంటుందనే ఉద్దేశంతో ఇప్పుడిలా కొనసాగిస్తున్నాను. నాకు నిజంగా ఆశ్యర్యమే! నా లైఫ్ జర్నీలో నాకు ఆశ్చర్యం, సంతోషం కలిగించే విషయం ఏమిటంటే... నన్ను రోల్‌మోడల్‌గా చూస్తూ నా నుంచి స్ఫూర్తి ΄ పొందుతున్న వాళ్లు ఉన్నారనే విషయం. అంతా బాగున్న వాళ్లు చాలామంది ఏమీ చేయకుండా ఉంటున్నారు. ఏదైనా సమస్య రాగానే దిగాలు పడిపోయి జీవితాన్ని నాలుగ్గోడలకు పరిమితం చేసుకునే వాళ్లున్నారు. కానీ... ‘సమస్యకు పరిష్కారం వెతుక్కుని, తనకు ఒక గుర్తింపును తెచ్చుకుంది’ అని ప్రశంసిస్తున్నారు. మా వాళ్లు మాత్రం మొదట్లో ‘నీకు ఇప్పుడు ఇవన్నీ ఎందుకు, పిల్లాడిని చూసుకుంటూ ప్రశాంతంగా ఉండు. ఇన్ని ఒత్తిడులు పెట్టుకోవద్ద’ని కోప్పడ్డారు. కానీ ఈ పని నాకు ఒత్తిడిని తగ్గిస్తోందని తెలిసి మా వాళ్లు కూడా సంతోషంగా ఉన్నారు. నేను ఎంతో సంపా దిస్తున్నానని కాదు, కానీ నేను ఎటువంటి ఉనికి లేకుండా లక్షల్లో ఒకరిలా ఉండిపోకుండా, ఈ పనివల్ల వందల్లో ఒకరిగా ఓ గుర్తింపు తెచ్చుకోగలిగాను’’ అంటున్నప్పుడు పా వని కళ్లలో ఆనందం వెల్లివిరిసింది. – వాకా మంజులారెడ్డి , సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
విజయవాడలో మోడళ్ల సందడి (ఫొటోలు)
-
అద్దమే ఆభరణం: నవరాత్రుల్లో వైవిధ్యంగా వెలిగేందుకు! ధర వంద నుంచి..
Navratri Special Jewellery: దాండియా నృత్యాల్లో మెరుపులు.. దారపు పోగుల అల్లికలో రంగుల హంగులు.. గోటాపట్టీ బ్యాంగిల్స్‌లో అద్దాలు అమరికలు.. వెండితీగల జిలుగుల్లో వెన్నెల చంద్రికలు .. నవరాత్రుల్లో అలంకరణకు ప్రత్యేకంగా నిలిచే ఆభరణాల మాలికలివి.. నవరాత్రి రోజులు అమ్మవార్లకు ప్రత్యేక అలంకారాలు ఉంటాయి. అలాగే, అతివలు కూడా అంతే అందంగా తమను తాము అలంకరించుకుంటారు. ఎరుపు, పసుపు, పచ్చలతో కాంతిమంతంగా ఉండే రంగు దుస్తులను ఎంచుకుంటారు. వీటితో పాటు అందరిలో వేడకకు తగినట్టుగా ప్రత్యేకంగా కనిపించాలంటే ఎంపిక చేసుకునే ఆభరణాల్లో స్పెషాలిటీ ఉండాలి. నవరాత్రుల్లో వైవిధ్యంగా వెలిగిపోవడానికి అద్దాలతో అమర్చిన థ్రెడ్ బ్యాంగిల్స్, సిల్వర్‌తో కూర్చిన ఆఫ్ఘనీ సెట్స్, గోటాపట్టీతో చేసిన మిర్రర్ వర్క్ ఆభరణాలు సరైన ఎంపిక జాబితాలో ఉన్నాయి. వంద రూపాయల నుంచి వేల రూపాయల వరకు ఈ ఆభరణాలను అన్ని వయసుల వారూ ధరించవచ్చు. అభిరుచిని బట్టి డిజైన్స్ ఎంపిక చేసుకోవచ్చు. చదవండి: Sreeleela: శ్రీలీల ధరించిన ఈ డ్రెస్ ధర 68 వేలు! స్పెషాలిటీ ఏమిటి? Evening Sandals: ఈవెనింగ్ శాండల్స్.. నడకలో రాజసం.. పార్టీవేర్ ఫుట్‌వేర్! -
Fashion Jewellery: చెవులకు పెయింటింగ్! ధర రూ.300 నుంచి..
క్లాత్ లేదా వుడ్ పైన పెయింట్ చేసి, హుక్స్ పెట్టేసి చెవులకు హ్యాంగ్ చేస్తే ఏ ఆభరణాలూ సరిపోవు అనిపిస్తుంది. పెయింటింగ్ ఫ్రేమ్స్ గోడ మీద ఉంటాయి కానీ, చెవులకు ఎలా... అనుకుంటున్నవారికి ఇలాంటి ఇయర్ హ్యాంగింగ్స్ ఒక కొత్త వేదిక అవుతుంది. ఇయర్ రింగ్స్‌గా పెయింటింగ్ వేసి ఉన్న హ్యాంగింగ్స్ ఇప్పుడు ట్రెండ్‌లో ఉన్నాయి. ప్లెయిన్ డ్రెస్‌ను సైతం అట్రాక్టివ్‌గా మార్చేసే ఈ ఆభరణాలు క్యాజువల్‌గానూ, పార్టీవేర్‌గానూ అందంగా మెరిసిపోతున్నాయి. ఫ్యాషన్ జ్యువెలరీలో భాగంగా పెయింటింగ్ జ్యువెలరీ తన అందాన్ని చాటుతూ చూపరులను అబ్బురపరుస్తుంది. వెస్ట్రన్ లేదా మన సంప్రదాయ దుస్తులకూ చక్కగా నప్పుతుంది. సృజనకలవారు వీటిని స్వయంగా తయారుచేసుకోవచ్చు. లేదంటే ఆన్లైన్ వేదికగా రూ.300 నుంచి కొనుగోలు చేసుకోవచ్చు. ∙పల్లె పడుచుల రూపాలను, వారు చేస్తున్న పనులను కూడా పెయింటింగ్ ద్వారా చిత్రించవచ్చు. ఈ చిత్రకళారూపాలు ఏ ప్లెయిన్ డ్రెస్‌మీదకైనా ముచ్చటగొలుపుతాయి. ∙ప్రకృతి అందాలకు నెలవైన సెలయేటి గలగలలు, బీచ్‌లు, వనాలను రంగులతో తీర్చిదిద్దడానికి, వాటి అందాన్ని చూపరులు మెచ్చడానికి ఓ మంచి అవకాశంగా మారింది. ∙బుద్ధుని రూపాలతో పాటు దుర్గ, శక్తి రూపాలను ఇయర్ హ్యాంగింగ్స్‌గా చూడచ్చు. అంతేకాదు, సంస్కృత శ్లోకాలు, మంత్రాక్షరాలూ కూడా ఈ హ్యాంగింగ్స్‌లో అందంగా అమరిపోతున్నాయి. చదవండి: Shraddha Srinath: ఈ హీరోయిన్ ధరించిన డ్రెస్ ధర 32 వేలకు పైనే! స్పెషాలిటీ? Fashion: వేడుకల వేళ.. కాటన్ కళ.. జరీ అంచుతో అనువుగానూ, అందంగానూ! -
Fashion: ఈ హీరోయిన్ ధరించిన డ్రెస్ ధర తెలిస్తే షాకవ్వాల్సిందే!
ఆవకాయ బిర్యానీ గుర్తుంది కదా.. వంటకం కాదండీ.. రెస్టారెంట్ పేరు అంతకన్నా కాదు. అచ్చతెలుగు హీరోయిన్.. మదనపల్లె మగువ.. బిందు మాధవి. గ్లామర్‌తో వెండి తెర మీదే కాదు తనదైన సిగ్నేచర్ స్టయిల్‌తో ఫ్యాషన్ వరల్డ్‌లోనూ మెరిసిపోతోంది ఇలా.. నైనా జైన్ తరాల నాటి విభిన్న చేనేత కళలను ఒక్కచోట చేర్చి.. వాటికి ఆధునిక రూపమిచ్చే బ్రాండే నైనా జైన్. క్లాసిక్ లుక్స్‌నే కాదు.. ధరించడంలోని సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని డిజైన్ అవుతుంది ఈ బ్రాండ్ వేర్. పెళ్లికూతురి దుస్తులకు ప్రసిద్ధి ఈ లేబుల్. గుజరాత్‌లోని కచ్ ప్రాంతపు బందినీ వర్క్ నైనా జైన్ యూఎస్పీ. ధరలు కాస్త ఎక్కువే. ఆన్‌లైన్‌లోనూ దొరుకుతాయి. బ్రాండ్ వాల్యూ ►డ్రెస్ : రెండ్ – యెల్లో లెహెంగా ►బ్రాండ్: నైనా జైన్ ►ధర: రూ. 45,500 ఇషారా నగల డిజైన్ల పట్ల ఆసక్తి, అభిరుచి ఉన్న కొంతమంది ఉత్సాహవంతులు కలసి 2014లో ఏర్పాటు చేసిన బ్రాండే ‘ఇషారా’. తరాల నాటి సంప్రదాయక నగలు, కుందన్, టెంపుల్ జ్యూయెలరీ ఇలా ఏ వెరైటీ డిజైన్లయినా.. ఆయా వేడుకలు.. సందర్భాలకనుగుణంగా.. కొనుగోలుదారులకు నప్పే.. నచ్చే విధంగా తయారు చేసివ్వడం ఈ బ్రాండ్ ప్రత్యేకత. ధరలూ అందుబాటులోనే. నగలు ఆన్‌లైన్‌లోనూ లభ్యం. ‘నన్ను చాలామంది సిల్క్ స్మితతో పోలుస్తుంటారు. నా కళ్లు ఆమె కళ్లలాగే ఉంటాయని.. నేనూ ఆమెలాగా కళ్లతోనే హావభావాలు పలికిస్తానని మెచ్చుకుంటుంటారు. అంతకన్నా గొప్ప ప్రశంసేం ఉంటుంది! ఆవిడ వండర్ ఫుల్ ఆర్టిస్ట్.. నా అభిమాన తార!’ – బిందు మాధవి బ్రాండ్ వాల్యూ ►జ్యూయెలరీ: పోల్కీ చోకర్, చాంద్‌బాలీలు ►బ్రాండ్: ఇషారా ►ధర: రూ. 3,000 --దీపిక కొండి -
రక్త ఆభరణాలు! ఔను! మానవుని రక్తంతో చేసినవి...
బంగారం, వెండీ, ప్లాటినం వంటి వాటిని కాలదన్నే విచిత్ర ఆభరణాలు రాబోతున్నాయి. మనం ఇంతవరకు తల్లిపాలతో చేసిన ఆభరణాలు గురించి విన్నాం. తల్లిపాలతో ఆభరణాలేంటి అనికొందరూ విమర్మించిన ఇందులో ఎలాంటి తప్పులేదని తయారుచేసి చూపించింది లండన్‌కి చెందిన జంట. ఐతే ఇప్పుడూ ఒక అడుగు ముందుకేసి మానవుని రక్తంతో తయారు చేసే ఆభరణాలు రూపొందిస్తున్నారు ప్రీతీ మాగో అనే మహిళ. పైగా ఇది మన ప్రియమైన వారి జ్ఞాపకంగా మన వద్ద ఉంటుందంటున్నారు. ప్రీతీ మాగో కంటి ఆస్ప్రతిలో ఆప్టోమెట్రిస్ట్‌గా పనిచేసేవారు. ఆమె ప్రెగ్నెంట్ అవ్వడంతో ఉద్యోగాన్ని వదిలేయవలసి వచ్చింది. అదీగాక బిడ్డ సంరక్షణ నిమిత్తం ఆమె ఉద్యోగానికే వెళ్లే అవకాశం లేకుండాపోయింది. ఆర్థిక స్వాతంత్య్రం కూడా కోల్పోవడంతో ఏం చేయాలో తోచని స్థితిలో ఉన్న ఆమెకు తల్లిపాలతో జ్యూవెలరీ తయారు చేయడం గురించి సోషల్ మాధ్యమాల ద్వారా తెలుసుకుంది. దీంతో ఆమె ఆ దిశగా తన గమ్యాన్ని మార్చుకుంది. తన భర్త సాయంతో యూఎస్‌లో వివిధ జ్యూవెలరీ కోర్సులను నేర్చకుంది. తల్లిపాలతో చేసే ఆభరణాల దగ్గర నుంచి బొడ్డుతాడు, వెంట్రుకలు, దంతాలు ఉపయోగించి ఆభరణాలు తయారు చేయడంలో నైపుణ్యం సాధించారు ఆమె. ఇంతవరకు చాలామంది పలు రకాలైన ఆభరణాలను తయారు చేశారు గానీ రక్తంతో తయారు చేసే ఆభరణాలనేది అనేది అరుదైన కాన్సెప్ట్ అని, ఇంతవరుకు ఎవరూ ఇలాంటి ఆభరణాలు తయారు చేయలేదని చెబుతున్నారు ప్రీతీ. ఆమె మొదట్లో ఎన్నో వైఫల్యాలు చవిచూసిన అనంతరం 2019లో తన వ్యాపారాన్ని ప్రారంభించినట్లు ప్రీతీ తెలిపారు. మనకు ఇష్టమైన వాళ్లు మనల్ని విడిచి వెళ్లిపోయినప్పుడూ... వారి గుర్తుగా వారి శరీరం నుంచి సేకరించిన రక్తంతో అందమైన లాకెట్లుగా రూపొందిస్తారు. స్వర్గంలో ఉన్న మన ప్రియమైన ఆప్తులు గుర్తుగా ఉంటుందని చెబుతున్నారు. తాను డీఎన్ఏ కలిగిన మెటీరియల్‌ని ఉపయోగించి ఈ ఆభరణాలను రూపొందించనట్లు ప్రీతీ పేర్కొంది. (చదవండి: నడి రోడ్డు పై ల్యాండ్ అయిన విమానం: వీడియో వైరల్) -
ఆ బ్రాండ్ మీద మోజు పడ్డ హీరోయిన్, ఈ డ్రెస్ ధర లక్ష పైచిలుకే!
మాళవిక మోహనన్ చేసింది రెండు సినిమాలే.. అయినా ప్రేక్షకులకు ఆమె అంటే క్రేజ్ ఓ రేంజ్లో. ఆమెకూ ఓ క్రేజ్.. ఇదిగో ఈ ఫ్యాషన్ బ్రాండ్స్ పట్ల... కరిష్మా జూల్రీ కరిష్మా మెహ్రా.. పిట్ట కొంచెం కూత ఘనం లాంటి అమ్మాయి. ఇరవై ఏళ్ల వయసుకే సొంతంగా బంగారు ఆభరణాల దుకాణం ప్రారంభించడమే కాదు.. అనతి కాలంలోనే ఆ దుకాణాన్ని ప్రముఖ జ్యూయెలరీ బ్రాండ్‌గా తీర్చిదిద్దింది. ఆ బ్రాండ్ పేరే ‘కరిష్మా జూల్రీ’. ఇక్కడ హాల్‌మార్క్ వెండి, బంగారు ఆభరణాలు లభిస్తాయి. ఈ మధ్యనే తను డిజైన్ చేసిన ట్రావెల్, వెడ్డింగ్ కలెక్షన్స్‌కు మంచి గుర్తింపు కూడా వచ్చింది. ఇక బాలీవుడ్ సెలబ్రిటీస్ చాలామందికి ఈ జూల్రీ జ్యూయెలరీ ఒక ఫేవరెట్ బ్రాండ్. బంగారం ధర, వజ్రాల నాణ్యతతో సంబంధం ఉండదు. కేవలం డిజైన్ ఆధారంగానే ధర నిర్ణయిస్తారు. ప్రముఖ ఆన్లైన్ స్టోర్స్‌లోనూ ఈ ఆభరణాలను కొనుగోలు చేయొచ్చు. కరణ్ తోరానీ న్యూఢిల్లీకి చెందిన కరణ్ తోరానీ.. చిన్నప్పుడు వేసవి సెలవుల్లో అమ్మమ్మ దగ్గరే గడిపేవాడు. చుట్టూ చేనేత కళతో ఆ ప్రాంతం ఎప్పుడూ అందమైన వస్త్ర ప్రపంచంలా కరణ్‌కు కనిపించేది. ఆ ప్రేరణ తో బాల్యంలోనే పెద్ద ఫ్యాషన్ డిజైనర్ కావాలని కలలు కన్నాడు. ఆ లక్ష్యంతోనే న్యూఢిల్లీలో ‘తోరానీస్’ పేరుతో ఒక బొటిక్ ప్రారంభించాడు. అనతి కాలంలోనే తోరానీ డిజైన్స్ పాపులరై మంచి గుర్తింపు పొందాయి. చాలామంది సెలబ్రిటీస్ కరణ్‌తో ప్రత్యేకంగా దుస్తులు డిజైన్ చేయించుకుంటారు. ఈ దుస్తుల ధర డిజైన్‌ను బట్టే ఉంటుంది. పలు ప్రముఖ ఆన్లైన్ స్టోర్స్‌లో ఈ డిజైన్స్ లభిస్తాయి. డ్రెస్ డిజైనర్ : కరణ్ తోరానీ ధర: రూ. 1,62,000 జ్యూయెలరీ బ్రాండ్: కరిష్మా జూల్రీ ధర: ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. దుస్తులపై పెద్దగా దృష్టి పెట్టను. కానీ, అందరమ్మాయిల్లాగే నాకూ జ్యూయెలరీ అంటే ఇష్టం. ముఖ్యంగా బోల్డ్ ఇయరింగ్స్ నా ఫేవరెట్. – మాళవిక మోహనన్ -
టైమ్‌కి టైమొచ్చింది
టైమ్ ఎంతయ్యిందో తెలియడానికి చేతికి గడియారం ధరిస్తాం. బెల్ట్, బ్రేస్లెట్, బ్యాంగిల్ రకరకాల రూపాల్లో గడియారాలు ఎంపిక చేసుకుని మురిసిపోతాం. కానీ, టైమ్‌తో నిమిత్తం లేకుండా టైమ్ సింబల్ ఉన్న ఆభరణాన్ని మెడలోనూ ధరిస్తే స్టయిలిష్ లుక్‌తో ఆకట్టుకోవడం ఖాయం అంటోంది ఈ ఫ్యాషన్ జ్యువెలరీ. పెయింటింగ్ జ్యువెలరీ చూశాం. ఫ్యాబ్రిక్ జ్యువెలరీ కనుక్కున్నాం. టెర్రకోట జ్యువెలరీ కొనుక్కున్నాం. థ్రెడ్ జ్యువెలరీ రంగులను హత్తుకున్నాం. న్యూ ఇయర్లోకి అడుగుపెడుతున్న శుభవేళ యాంటిక్ లుక్‌తో ఆకట్టుకునే టైమ్ జ్యువెలరీ అతివల అలంకరణలో బ్రైట్‌గా వెలగడానికి సిద్ధమయ్యింది. ఈ ఫ్యాషన్ జ్యువెలరీలో డిజైనర్ల సృజన చూస్తుంటే ఇక ‘టైమ్‌కి టైమొచ్చింది’ అని అనకుండా ఉండలేరు. (డ్రెస్ ఏదైనా వాటి మీదకు లాంగ్ ష్రగ్ ఒకటి ధరిస్తే చాలు!) -
రూ. 900 డ్రెస్‌ను 50 రూపాయలకే కొన్నా: నిహారిక
మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఏకైక హీరోయిన్.. నిహారిక కొణిదెల. తెర పరిచయానికి ముందే ఫ్యాషన్ ఐకాన్‌గా గ్లామర్ ప్రపంచానికి ఆమె సుపరిచితం. ఆమె ఫ్యాషన్ సెన్స్‌ను ప్రతిబింబించే బ్రాండ్సే ఇవి.. కలశ ఫైన్ జ్యూయెల్స్.. కేవలం రూ. 40 పెట్టుబడితో ప్రారంభించిన వ్యాపారం ఇప్పుడు కోట్ల సామ్రాజ్యంగా మారింది. బంగారు ఆభరణాల వ్యాపారంలో వీరిది 118 సంవత్సరాల అనుభవం. 1901లో శ్రీచంద్ర అంజయ్య పరమేశ్వర్ పొట్టకూటి కోసం హైదరాబాద్ వచ్చి, నెలకు రూ. 15 జీతంతో ఓ బంగారు ఆభరణాల దుకాణంలో చేరాడు. తర్వాత నలభై రూపాయలు పోగుచేసి స్వయంగా వ్యాపారం ప్రారంభించాడు. అందమైన ఆభరణాల డిజైన్స్ అందిస్తూ వ్యాపారంలో దినదినాభివృద్ధి సాధించాడు. అప్పటి వరకు ‘చంద్ర అంజయ్య పరమేశ్వర్’ పేరుమీద ఉన్న దుకాణాన్ని ఈ మధ్యనే 2017లో ‘కలశ ఫైన్ జ్యూయెల్స్’గా మార్చారు. ఇప్పుడు ఈ వ్యాపారాన్ని వారి మూడోతరం, నాలుగోతరం వారసులు నడిపిస్తున్నారు. ధర ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. హైదరాబాద్, బెంగళూరు, విజయవాడల్లో బ్రాంచీలు ఉన్నాయి. ప్రత్యూష గరిమెళ్ల.. హైదరాబాద్‌కు చెందిన ప్రత్యూష గరిమెళ్ల.. చిన్నప్పటి నుంచి పెద్ద ఫ్యాషన్ డిజైనర్ కావాలని కలలు కన్నది. ఆ ఆసక్తితోనే ఎన్ఐఎఫ్టీలో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేసింది. అనంతరం 2013లో హైదరాబాద్‌లో తన పేరుమీదే ఓ బొటిక్ ప్రారంభించింది. అతి సూక్ష్మమైన అల్లికలతో వస్త్రాలకు అందాన్ని అద్దడమే ఆమె బ్రాండ్ వాల్యూ. జర్దోసీ, సీక్వెన్స్, గోటా పట్టి వంటి అల్లికలు ప్రత్యూష డిజైన్స్‌లో ఎక్కువగా కనిపిస్తాయి. చాలామంది సెలబ్రిటీలకు దుస్తులను డిజైన్‌ను చేసింది. ధర కూడా డిజైన్‌ను బట్టే. పలు ప్రముఖ ఆన్ లైన్ స్టోర్స్ అన్నిటిలోనూ ఈ డిజైన్స్ లభిస్తాయి. బేరం బాగా ఆడతా.. ఒకసారి టెన్త్‌క్లాస్‌లో ఢిల్లీ ట్రిప్‌కు వెళ్లినప్పుడు ఖాన్బజార్లో రూ. 900 డ్రస్‌ను రూ. 50కే కొన్నా. అది కూడా గంటసేపు బేరం ఆడి. ఇప్పుడు బేరం ఆడటం కొంచెం తగ్గించా. – నిహారిక కొణిదెల డ్రెస్ డిజైనర్: ప్రత్యూష గరిమెళ్ల ధర:రూ. 44,800 జ్యూయెలరీ కలశ ఫైన్ జ్యూయెల్స్ ధర:ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. -
వైరల్ వీడియో: చనిపోయిన వ్యక్తుల అవశేషాలతో ఆభరణాలు!
కాన్బెర్రా: ఈ చరాచరా సృష్టిలో మనిషి అత్యంత బలహీనుడు. కానీ, అతడి మేధా శక్తితో ఇతర జీవులను శాసిస్తున్నాడు. ఇక పాడైపోయిన చెప్పులనైనా ఇంట్లో ఉంచుకుంటారు. కానీ మనిషి చచ్చిన మరుక్షణమే కాటికి పంపంచే కార్యక్రమం మొదలవుతుంది. అయితే మెల్బోర్న్కి చెందిన జాక్కి విలియమ్స్(29) అనే మహిళ చనిపోయిన వ్యక్తుల అవశేషాలతో ఆభరణాలను తయారు చేస్తోంది. గ్రేవ్ మెటాలమ్ జ్యువెలరీలో చనిపోయిన వ్యక్తుల దంతాలు, వెంట్రుకలతో వారి కుటుంబాలకు ఉంగరాలు, కంఠహారాలు తయారు చేస్తోంది. దీని పై విలియమ్స్ మాట్లాడుతూ..‘‘ తనని తాను కాల్చుకుని చనిపోయిన ఓ వ్యక్తి కుటుంబ కోసం ఐయూడీని ఉపయోగించి ఓ ఆభరణాన్ని తయారు చేసి ఇచ్చాను. ఆ విధంగా ఈ వ్యాపారం మొదలైంది. ఈ ఆభరణాలను తయారు చేయడానికి ఎనిమిది వారాలు పడుతుంది. వీటి ధర 350 నుంచి 10,000 డాలర్ల వరకు ఉంటుంది. మరణం పై ఉన్న భయాలను పోగొట్టాలనే ఆశయంతో ఈ పని చేస్తున్నాను. గ్రేవ్ మెటాలమ్ అనే వెబ్సైట్లో వీటిని విక్రయానికి పెట్టాను.’’ అని జాక్కి విలియమ్స్ పేర్కొంది. -
లేటెస్ట్ కలెక్షన్; ఈవిల్ ఐ బ్రేస్లెట్
దేశాల అంతరాలు లేకుండా చెడు దృష్టి పడకుండా అడ్డుకునేందుకు మనిషి ప్రాచీన కాలం నుంచి రకరకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. వాటిలో ముఖ్యమైనది పెద్ద నీలిరంగు కనుగుడ్డు ఆకారం. ఇది మనకి హాని జరగాలని కోరుకునేవారిపై చెడు ప్రభావాన్ని చూపుతుందనే నమ్మకంతో మార్కెట్లోకి వచ్చింది. అయితే, ప్రపంచవ్యాప్తంగా మాత్రం ఇదో ఆభరణంగా అందరినీ ఆకర్షించింది. ఇప్పుడు ఈ డిజైన్స్‌కి ఏమాత్రం కొదవలేదన్నట్టుగా ‘నీలికన్ను’ దర్జా పోతోంది. ఇతర ఆభరణాలను ఒక్క చూపుతో కట్టడి చేస్తూ ట్రెండ్‌లో ముందంజలో ఉంటోంది. అదృష్టానికి చిహ్నంగా మారిపోయింది. ఆభరణాల విభాగంలో ఈవిల్ ఐ బ్రేస్లెట్, లాకెట్, ఉంగరం, చెవి పోగుల్లో ఎక్కువగా దర్శనమిస్తోంది. వీటిలో పెద్ద, చిన్న పరిమాణంలో ఉన్నవి లభిస్తున్నాయి. ఇతర దేశాల నుంచి దిగుమతి అయ్యే ఫ్యాషన్ జ్యువెలరీలోనూ ఈవిల్ ఐ తన ప్రాధాన్యతను చాటుకుంటూనే ఉంది. ‘వినియోగదారులు వీటిని వ్యక్తిగత ఆభరణంగా ఎంపిక చేసుకుంటున్నారు’ అని ఆభరణాల నిపుణులు చెబుతున్న మాట. ఈవిల్ ఐ ఆభరణాన్ని తమ ఆత్మీయులకు మంచి జరగాలని కానుకగా కూడా ఇస్తున్నారు. -
ఎక్స్పో.. నెక్ట్స్ షో..
-
మట్టే కదా అని నెట్టేయకండి.. చూస్తే ఫిదానే
భారత సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలుగా పండగలు విరాజిల్లుతున్నాయి. దూరంగా ఉన్న వారిని అక్కున చేర్చుతూ.. ఎన్నో అనురాగాలను, ఆప్యాయతలను పంచి పెడుతాయి ఈ పండగలు. అన్ని పండగల్లో దీపావళికి ఓ ప్రత్యేక స్థానం ఉంది. చిన్న పెద్ద తేడా లేకుంగా ప్రపంచంలోనే ఎక్కువమంది జరుపుకునే పండగ దీపావళి. దీపావళి పేరు వినగానే అందరికీ గుర్తోచ్చేది దీపాల కాంతుల్లో వెలిగే జిగేలులు. ఆకాశమంతా విరజిల్లే సంబరాలు.. ఇంతటి వైభవంగా జరుపుకునే ఈ పండగలో మెయిన్ అట్రాక్షన్ మహిళలు. భక్తి, శ్రద్ధలతో లక్ష్మీ దేవిని పూజించడం ఈ పండడ ప్రత్యేక. అయితే అలాంటి మగువల అందాలకు మరింత వన్నే చేకూర్చేవి వారి అలంకరణ. ఈ అలంకరణలో మందుగా గుర్తొచ్చేవి ఆభరణాలు. జ్యువెల్లరీ లో ముఖ్యంగా బంగారం, వెండి, డైమండ్,ముత్యాలు వగైరా. వీటితో పాటు ఈ మధ్య కాలంలో థ్రెడ్ బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్ వచ్చిన విషయం తెలిసిందే. కానీ ప్రస్తుతం ఇవి కూడా పాతబడిపోయాయి. ప్రతీసారి ఇవే ధరించడం మహిళలకు కాసింత రోటీన్‌గా అనిపిస్తోంది. అయితే ప్రతి పండక్కి ఒకింత కొత్తగా, మరింత నూతనంగా అలంకరించుకోవాలని ఎవరికి మాత్రం ఉండదు. అందుకే ఈ సారి వీటికి భిన్నంగా మట్టితో తయారు చేసినవి ట్రై చేస్తే ఎలా ఉంటుందంటారు. నగరానికి చెందిన కృష్ణలత గత కొంత కాలంగా వీటి పైనే దృష్టి పెట్టింది. మట్టితో ఒకటి కాదు రెండు ఏకంగా వందల రకాల వస్తువులను తయారు చేస్తుంది. అభరణాలు, గిఫ్ట్ ఆర్టికల్, బొమ్మలు, గృహాలంకరణ వస్తువులతో పాటు ఏ పండగకైనా ఉపయోగించే వస్తు సామాగ్రిని ఇలా ఎకో ఫ్రెండ్లీగా తయారు చేస్తుంది. తన స్వహస్తాలతో తయారైన ఈ ఆభరణాలను చూసి ముచ్చటపడటమే కాక, ధరించి ఆహా అనాల్సిందే. పండగలకు ఉపయోగించే ప్రతి వస్తువులలో సాధారణంగా ప్లాస్టిక్ వినియోగం కనిపిస్తోంది. అయితే ప్రస్తుతం ప్లాస్టిక్ పెనుభూతంగా తయారవుతూ మానవ మనుగడకు తీవ్ర ప్రమాదంగీ తయారవుతోంది. దీంతో ప్లాస్టిక్‌ను తగ్గించి పర్యావరణానికి మేలు జరిగేలా మట్టితో తయారు చేసిన వస్తువులను ఈ ప్రత్యేక పండగలో ఉపయోగిద్దాం. చెడుపై మంచి గెలిచినా విజయానికి దీపావళి జరుపుకుంటారన తెలిసిందే. అలాగే ప్రస్తతం ప్రపంచంలో చెడుగా వ్యాప్తి చెందుతున్న ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిస్తూ మనం కూడా ఓ మంచి పనికి శ్రీకారం చుడుదాం. పరిచయం... అమెరికాలో ఉద్యోగం చేస్తున్న కృష్ణలతకు మట్టితో వివిధ వస్తువులు తయారు చేయడం అలవాటు. అనంతరం అమెరికా నుంచి నగరానికి వచ్చి సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా చేస్తూ సమయం చిక్కినప్పుడల్లా మళ్లీ మట్టితో అభరణాలు, తయారు చేయడం ప్రారంభించారు. తాను ఏం చేసిన పర్యావరణానికి హానీ కలగకుండ ఉండాలి. అంతేగాక కొత్తగానూ, అందరూ మెచ్చేలా ఉండాలని భావించారు. కేవలం తన అభిరుచితోనే ప్రారంభించిన ఈ పనిని 2014లో ఊర్వి పేరుతో ఓ బ్రాండ్‌ను స్థాపించి మట్టితో అనేక వస్తువులను తయారు చేసి బిజెనెస్ ప్రారంభించారు. మట్టి మాత్రమే కాకుండా పర్యావరణానికి మేలు చేసే అనేక పదార్ధాలతో తయారు చేసే వస్తువులు ప్రస్తుతం ట్రెండ్‌గా మారాయి. తయారీ విధానం... అభణానికి కావల్సినంత మట్టిని తీసుకొని మొదట దానిని ఎండబెట్టాలి. ఆ తరువాత మట్టిని 1000 డిగ్రీల ఉష్ణోగ్రతలో వేడి చేయాలి. అప్పుడు అది స్టోన్‌లా మారుతుంది. దానిని మనకు కావల్సిన కలర్స్ వేసుకొని నచ్చిన డిజైన్‌లో జ్యువెల్లరీ తయరు చేసుకోవచ్చు. ఏంటీ ప్రత్యేకత మట్టితో తయారు చేయడం. ఎలాంటి రసాయనాలను వాడకపోవడం ఫ్యాషన్‌కు తగ్గట్టుగా తయారు చేయడం పూర్తిగా పర్యావరణ హితమైనవి, కాలుష్యానికి ఆమడ దూరం వెండి,బంగారం వంటి అభరణాలతో పోలిస్తే తక్కువ ధరకే అందుబాటులో ఉండటం దీపావళికి ప్రత్యేకంగా నూతన వెరైటీలతో జ్యువెల్లరీ(నగలు, చెవి కమ్మలు) తయారీ. అదే విధంగా దీపావళికి ప్రతేక ఆకర్షణ ప్రమిదలు. సాధారణంగా వీటిని మట్టితోనే తయారు చేస్తారు. ఈ మట్టిలో సైతం అనేక ఆకృతులలో అంటే గణేష్ ప్రమిదలు, నెమలి ఆకార ప్రమిదలు, ఏనుగు ప్రమిదలు వంటివి చేస్తోంది. వీటితోపాటు గుమ్మానికి వేలాడదీసే ప్రమిదలు. ఆవు పేడ (కవ్ డంగ్)తో తయారు చేస్తుంది. అంతేగాక పండక్కి వచ్చే అతిథుల కోసం వాయినంగా ఇచ్చే కుంకుమ భరణిని మట్టితో తయారు చేయడం. తులసి కోట వంటివి ఈ దీపావళికి ప్రత్యేకం. ధరలు.. కృష్ణలత తయారు చేసిన ప్రతి వస్తువుకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అలాగే ఒక్క దానికి ఒక్కో ధర ఉంటుంది. అధిక ధరలకు కాకుండా తయారీకి అయిన ఖర్చుతో కలిపి అందరికి అందుబాటులో ఉండే ధరకు వీటిని మనం కొనవచ్చు. ఆవు పేడ ప్రమిదలు- రూ.140 నుంచి రూ. 240....డిజైనర్ ప్రమిదలు-రూ. 320.... నగలు- రూ.450 నుంచి మొదలు... చెవి కమ్మలు రూ. 120 నుంచి ప్రారంభం. సో ఇంవేందుకు అలస్యం వెంటనే కొనేయండి. వీటిని మీ సొంతం చేసుకోవాలంటే అఫీషియల్ ఫేస్బుక్ పేజీలో లాగిన్ అవ్వండి. లేదా నేరుగా ఫోన్ నెంబర్ ద్వారా సంప్రదించండి. -
ఆభరణాలకు రూపమిచ్చే.. జువెలరీ డిజైనర్
అప్‌కమింగ్ కెరీర్: మేని ఆందాన్ని ద్విగుణీకృతం చేసే ఆభరణాలతో భారతీయుల అనుబంధాన్ని వర్ణించడానికి మాటలు చాలవు. ఆకర్షణీయమైన ఆభరణానికి రూపమిచ్చే కళాకారుడు.. జువెలరీ డిజైనర్. దేశంలో నగల వ్యాపారం వందల నుంచి వేల కోట్ల రూపాయలకు చేరడంతో డిమాండ్ పెరుగుతున్న కెరీర్.. జువెలర్ డిజైనింగ్. జువెలరీ డిజైనింగ్ అనేది ప్రధానంగా సృజనాత్మక ప్రక్రియ. అప్పటివరకు మార్కెట్లోని లేని కొత్త డిజైన్‌ను తయారు చేయాలంటే అపూర్వమైన ఊహ శక్తి ఉండాలి. వినియోగదారుల అభిరుచులు, అవసరాలు తప్పనిసరిగా తెలిసి ఉండాలి. ప్రజల సంస్కృతులు, సంప్రదాయాలు, వారు ధరించే నగలపై అవగాహన పెంచుకోవాలి. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో వస్తున్న నూతన డిజైన్లను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. వాటి కంటే భిన్నంగా చేయగల నైపుణ్యం సాధించాలి. అనుభవజ్ఞులకు ఉపాధి అవకాశాలు దేశంలో జువెలరీ డిజైనర్లకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. అనుభవం కలిగిన డిజైనర్లకు రూ.లక్షల్లో వేతనాలు లభిస్తున్నాయి. నిధులు లభిస్తే సొంతంగా డిజైనింగ్ యూనిట్‌ను కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. ఆభరణాల డిజైన్లను జువెలరీ సంస్థలకు విక్రయించుకోవడం ద్వారా అధిక ఆదాయం పొందొచ్చు. మనదేశంతోపాటు విదేశాల్లోనూ డిజైనర్లకు మంచి అవకాశాలున్నాయి. అర్హతలు.. ఇంటర్మీడియెట్ పూర్తిచేసిన తర్వాత జువెలరీ డిజైన్‌లో డిప్లొమా ప్రోగ్రామ్ లేదా గ్రాడ్యుయేషన్ కోర్సును చదవాలి. తర్వాత పోస్టుగ్రాడ్యుయేషన్, ఇంటర్న్‌షిప్ కూడా పూర్తిచేస్తే మెరుగైన అవకాశాలను దక్కించుకోవచ్చు. కొన్ని సంస్థలు స్వల్పకాలిక కోర్సులను కూడా ఆఫర్ చేస్తున్నాయి. వేతనాలు.. జువెలరీ డిజైనర్లకు ఎక్కువగా ప్రైవేట్ రంగంలో అవకాశాలు లభిస్తున్నాయి. ప్రారంభంలో పనితీరు ఆధారంగా నెలకు రూ.10 వేల నుంచి రూ.25 వేల దాకా అందుకోవచ్చు. తర్వాత సీనియారిటీని బట్టి నెలకు రూ.లక్ష దాకా వేతనం పొందొచ్చు. జువెలరీ డిజైన్ కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు ఏ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(నిఫ్ట్) వెబ్సైట్: http://www.nift.ac.in/ ఏ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్(ఎన్ఐడీ)-అహ్మదాబాద్ వెబ్సైట్: http://www.nid.edu/ ఏ జువెలరీ డిజైన్ అండ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్-నోయిడా వెబ్సైట్: http://www.jdtiindia.com/ ఏ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ వెబ్సైట్: http://www.iiftindia.net/ మోడ్రన్ కెరీర్... జువెలరీ డిజైనింగ్ ‘ప్రజల అభిరుచుల్లో చాలా మార్పులొచ్చాయి. దానికి తగినట్లుగా ఫ్యాషన్ డిజైనింగ్‌లోనూ కొత్తదనం చోటుచేసుకుంటోంది. జువెలరీ డిజైన్ కోర్సు ఇప్పుడున్న ఫ్యాషన్ ప్రపంచంలో అగ్రగామి అనే చెప్పొచ్చు. జువెలరీలోనూ విభిన్నమైన మోడల్స్ వస్తున్నాయి. డ్రెస్సింగ్, టైం సెన్స్, అప్పియరెన్స్‌కు తగిన ఆభరణాలను ధరించటం ఫ్యాషన్‌లో భాగమైంది. దీంతో ఈ కోర్సు చేసిన యువతకు అవకాశాలు పెరుగుతున్నాయి. ఢిల్లీ, ముంబై, పుణె వంటి నగరాల్లో బాగా డిమాండ్ ఉంది. హైదరాబాద్‌లో రెండు మూడేళ్లుగా క్రేజ్ సంపాదించుకుంది. మంచి వేతనంతో ఉద్యోగ అవకాశాలున్నాయి. ఆర్థిక వెసులుబాటు ఉంటే.. డిజైనింగ్ షోరూం ఏర్పాటుచేసుకోవచ్చు’’ - డి.గోపాలకృష్ణ, జాయింట్ డెరైక్టర్ (నిఫ్ట్) హైదరాబాద్