మిస్‌ యూఎస్‌ఏ స్థానం నుంచి తప్పుకుంటున్న మరో బ్యూటీ!.. | Sakshi
Sakshi News home page

మిస్‌ యూఎస్‌ఏ స్థానం నుంచి తప్పుకుంటున్న మరో బ్యూటీ!..

Published Mon, May 13 2024 10:29 AM

Indian Mexican Teen Uma Sofia Srivastava Gives Up Miss USA title

గతేడాది 2023లో మిస్‌ యూఎస్‌ఏ విజేతగా ఎంపికైన నోలియా వోయిగ్ట్‌ సడెన్‌గా తన స్థానం నుంచి తప్పుకుంటున్నట్లు​ ఇటీవలే ప్రకటించింది. అది మరువకు మునుపే మరో బ్యూటీ తన కిరీటాన్ని వదులుకుంటున్నట్లు ప్రకటించి అందర్నీ షాక్‌కి గురి చేసింది. అందాల తారలు వరుస ప్రకటనలు అమెరికా అందాల పోటీల నిర్వాహకులను తీవ్ర గందరగోళంలో పడేశాయి. 

నోలియా రాజీనామా చేసిన రెండు రోజులకే 17 ఏళ్ల మిస్‌ టీన్‌ యూఎస్‌ఏ ఉమా సోఫియా తాను కూడా తన స్థానం నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. మెక్సికన్‌ ఇండియన్‌ అమెరికన్‌  అయిన ఉమా సోఫియా నా విలువలు సంస్థ తీరుతో పూర్తిగా సరిపోవడం లేదని అందువల్ల తాను తన స్థానం నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. 

తాను ఈ అత్యున్నత టైటిల్‌ని​ గెలుకోవడంలో సహకరించిన తన కుటుంబం, తన రాష్ట్ర ప్రజలు, తన  సహ మోడళ్లకు ఎంతగానో రుణపడి ఉన్నాను.వారందిరి ఆదరాభిమానానికి కృతజ్ఞతలు అని తన ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది. జాతీయ స్థాయిలో తొలి మెక్సికన్‌ ఇండియన్‌ అమెరికన్‌గా తన రాష్ట్రానికి ప్రాతినిథ్యం వహించినందుకు గర్వంగా ఉందని పేర్కొంది. 

ఆమెకు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు..
ఉమా సోఫియా శ్రీవాస్తవ అమెరికా తొలి మెక్సికన్‌ ఇండియన్‌ అమెరికన్‌ మిస్‌ న్యూజెర్సీ టీన్‌. యూఎన్‌ అంబాసిడర్‌ కావలన్నది ఆమె కల. ఆమె భారతదేశంలోని అనగారిన పిల్లలకు చక్కటి విద్య, సరైన పోషకాహారం, ఆరోగ్య సంరక్షణను అందించడంలో సహాయపడటానికి లోటస్‌ పెటల్‌ ఫౌండేషన్‌తో కలిసి పనిచేస్తుంది. ఉమాసోఫియా తన దివైట్‌ జాగ్వర్‌ పుస్తకాన్ని రచించారు. ఆమె మొత్తం నాలుగు భాషల్లో అనర్గళంగా మాట్లాడగలదు. ఆమె ఒక పియానిస్ట్‌ దట్స్‌ ఫ్యాన్‌ బిహేవియర్‌ని నడుపుతోంది. ప్రస్తుతం ఆమె జూనియర్‌ కళాశాల విద్యను అభ్యసిస్తోంది.

(చదవండి: తెల్లటి చీరలో మెరిసిపోతున్న మిల్కీబ్యూటీ..ధర వింటే నోరెళ్లబెడతారు!)

 

 

Advertisement
 
Advertisement
 
Advertisement