యవ్వనానికి ఆక్సిజన్‌ గది

Hyperbaric Oxygen Therapy For New Life - Sakshi

అమృతం తాగితే జరామరణాలు ఉండవని అంటారు. అయితే, కోల్పోయిన యవ్వనాన్ని తిరిగి పొందటానికి అమృతమే తాగాల్సిన పనిలేదు. ఈ గదిలో రోజుకు ఓ గంట పడుకుంటే చాలు. కేవలం సంపన్నులకు మాత్రమే అందుబాటులో ఉండే ‘హెచ్‌బీఓటీ (హైపర్‌బ్యారిక్‌ ఆక్సిజన్‌ థెరపీ)’ నేడు తక్కువ ధరల్లోనే దొరకనుంది.

దీనికోసం అమెరికాకు చెందిన హెచ్‌ఓబీఓ2 అనే సంస్థ ప్రత్యేకమైన ఓ మెటల్‌ చాంబర్‌ను రూపొందించింది. సాధారణంగా మన వాతావరణంలో 21 శాతం ఆక్సిజన్, 79 శాతం నైట్రోజన్, ఇతర వాయువులు ఉంటాయి. అదే ఈ చాంబర్‌లో 95 శాతం స్వచ్ఛమైన ఆక్సిజన్‌ అందుతుంది. ఇక ఇందులోని ప్రత్యేకమైన కొల్లాజెన్‌ ఫైబర్స్, లైటింగ్‌ సిస్టమ్‌ ముడతలను తొలగించి, చర్మాన్ని కాంతిమంతగానూ, మృదువుగా చేస్తుంది. కావాల్సిన వారు వీరి అధికారిక వెబ్‌సైట్‌ నుంచి కొనుగోలు చేయవచ్చు. అద్దెకు కూడా తీసుకోవచ్చు. నెలకు రూ.80 వేల నుంచి, రూ. లక్ష తీసుకుంటారు. ఒక్క రోజుకు కూడా అద్దెకు ఇస్తారు. అయితే, ప్రస్తుతం విదేశాల్లో మాత్రమే అందుబాటులో ఉంది. 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top