How To Make Rice Vadiyalu Recipe In Telugu - Sakshi
Sakshi News home page

వర్షాకాలంలో వడియాలు.. ఈసారి అన్నంతో ట్రై చేయండి

Jul 21 2023 5:00 PM | Updated on Jul 21 2023 6:06 PM

How To Make Rice Vadiyam Recipe In Telugu - Sakshi

అన్నం వడియం తయారీకి కావల్సినవి:

అన్నం – కప్పు ; ఎండు మిర్చి – మూడు ; జీలకర్ర – రెండు టీస్పూన్లు ;
ఉల్లిపాయ – ఒకటి ; పచ్చిమిర్చి – ఒకటి ; కరివేపాకు – రెమ్మ ;
ఉప్పు – రుచికి సరిపడా ; నూనె – డీప్‌ఫ్రైకి సరిపడా.

తయారీ విధానమిలా..

  • అన్నం మునిగేలా నీళ్లుపోసి రాత్రంతా నానబెట్టుకోవాలి.
  • ఉదయాన్నే నీళ్లు తీసేసి అన్నాన్ని మిక్సీ జార్‌లో వేయాలి.
  • దీనిలో ఎండుమిర్చి, జీలకర్ర వేసి బరకగా గ్రైండ్‌ చేయాలి.
  • ఈ మిశ్రమంలో సన్నగా తరిగిన ఉల్లిపీయను, పచ్చిమిర్చిని వేయాలి.
  • కరివేపాకు, రుచికి సరిపడా ఉప్పు వేసి చక్కగా కలుపుకోవాలి.
  • ఈ మిశ్రమాన్ని చిన్నచిన్న ఉండలు చేసి మూడు రోజులు ఎండలో ఆరబెట్టాలి.
  • ఉండలు చక్కగా ఆరాక, గాలిచొరబడని డబ్బాలో వేసి నిల్వచేయాలి.
  • స్నాక్స్‌ సమయం లేదా అన్నం తినేటప్పుడు ఈ ఉండలను గోల్డెన్‌ బ్రౌన్‌ కలర్‌లోకి మారేంత వరకు డీప్‌ఫ్రై చేసి సర్వ్‌చేసుకోవాలి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement