ఓట్స్‌ – యాపిల్‌ లడ్డూలు | How To Make Oats Apple Laddu Recipe | Sakshi
Sakshi News home page

ఓట్స్‌ – యాపిల్‌ లడ్డూలు

Sep 10 2023 1:39 PM | Updated on Sep 10 2023 4:01 PM

How To Make Oats Apple Laddu Recipe - Sakshi

కావలసినవి:  యాపిల్‌ – 3 మీడియం సైజ్‌ (తొక్క, గింజలు తీసి గుజ్జులా చేసుకోవాలి)
ఓట్స్‌ పౌడర్‌ – అర కప్పు (నెయ్యితో దోరగా వేయించుకోవాలి)
కొబ్బరి కోరు – 2 కప్పులు, పంచదార – 2 టేబుల్‌ స్పూన్లు
మిల్క్‌ పౌడర్‌– 3 టేబుల్‌ స్పూన్లు
కొబ్బరి పాలు – 1 టేబుల్‌ స్పూన్‌
యాలకుల పొడి – అర టీ స్పూన్‌
డ్రై ఫ్రూట్స్‌ పౌడర్‌ – గార్నిష్‌కి కొద్దిగా (అభిరుచిని బట్టి)
నెయ్యి – 2 లేదా 3 టేబుల్‌ స్పూన్లు


తయారీ: ముందుగా ఒక బౌల్‌ తీసుకుని అందులో యాపిల్‌ గుజ్జు, కొబ్బరి కోరు, పంచదార, మిల్క్‌ పౌడర్‌ వేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత కొబ్బరి పాలు, ఓట్స్‌ పౌడర్, యాలకుల పొడి, నెయ్యి వేసుకుని మరోసారి బాగా కలుపుకోవాలి. తర్వాత చిన్న చిన్న లడ్డూలు తయారు చేసుకోవాలి. వాటిపైన  డ్రై ఫ్రూట్స్‌ పౌడర్‌ కొద్దికొద్దిగా పెట్టుకుని సర్వ్‌ చేసుకోవాలి. 

(చదవండి:  పొటాటో పాప్‌ కార్న్‌.. ఇలా చేస్తే భలే రుచిగా ఉంటాయి)

Advertisement
 
Advertisement
Advertisement