బేకరీ స్టైల్‌లో.. ఫ్లఫీ పాన్‌కేక్‌ తయారీ ఇలా | How To Make Best Fluffy Pancakes Recipe In Telugu | Sakshi
Sakshi News home page

Fluffy Pancakes Recipe : బేకరీ స్టైల్‌లో.. ఫ్లఫీ పాన్‌కేక్‌ తయారీ ఇలా

Aug 4 2023 2:42 PM | Updated on Aug 4 2023 3:25 PM

How To Make Best Fluffy Pancakes Recipe In Telugu - Sakshi

ఫ్లఫీ పాన్‌కేక్‌ తయారీకి కావల్సినవి: 

గుడ్లు – రెండు; లు – రెండు టేబుల్‌ స్పూన్లు; వెనీలా ఎసెన్స్‌ – పావు టీస్పూను; గోధుమ పిండి – పావు కప్పు; వంటసోడా – టీస్పూను; చక్కెర – రెండు టేబుల్‌ స్పూన్లు; ఉప్పు – చిటికెడు. 



తయారీ విధానమిలా:

  • గుడ్లలోని పచ్చసొనను ఒక గిన్నెలోకి తీసుకుని పాలు, వెనీలా ఎసెన్స్‌ వేసి ఐదు నిమిషాల పాటు నురగవచ్చేంత వరకు చక్కగా కలపాలి.
  • ఇప్పుడు దీనిలో గోధుమ పిండి వేసి పేస్టులా కలిపి పక్కన పెట్టాలి.
  • గుడ్ల తెల్ల సొనలో చిటికెడు ఉప్పు వేసి బాగా కలపాలి. ఒక్కో స్పూను చక్కెర వేస్తూ నురగ వచ్చేంత వరకు కలపాలి.
  • నురగ వచ్చిన మిశ్రమాన్ని గుడ్ల పచ్చసొన మిశ్రమంలో వేసి కలపాలి.
  • వేడెక్కిన నాన్‌స్టిక్‌ పాన్‌ పై కొద్దిగా నెయ్యిరాసి కేక్‌లా పోసుకోవాలి.

  • ఈ కేక్‌ చుట్టూ రెండు మూడు స్పూన్ల నీళ్లుపోసి మూత పెట్టి  గోల్డెన్‌ బ్రౌన్‌ కలర్‌లోకి మారేంత వరకు రెండువైపులా చక్కగా ఉడికిస్తే జపనీస్‌ ఫ్లఫీ పాన్‌కేక్‌ రెడీ వేడిగా ఉన్నప్పుడే బటర్, మేపిల్‌ సిరప్‌తో సర్వ్‌చేసుకోవాలి.

Advertisement
 
Advertisement
Advertisement