ఆస్ట్రోనాట్లు రోదసిలో తేనీరు ఎలా తాగుతారో తెలుసా? | How Astronauts Drink Tea In Space And The Precautions Involved | Sakshi
Sakshi News home page

ఆస్ట్రోనాట్లు రోదసిలో తేనీరు ఎలా తాగుతారో తెలుసా?

Jun 20 2026 1:27 PM | Updated on Jun 20 2026 1:37 PM

How Astronauts Drink Tea In Space And The Precautions Involved

కిడ్స్‌ స్పెషల్‌

అంతరిక్షంలో టీ తాగితే మజా ఉంటుందా? ఉండదట!

ఫ్రెండ్స్‌... మనం ఉదయం లేవగానే వేడివేడి టీ తాగుతాం కదా? మరి రోదసిలోకి వెళ్లిన ఆస్ట్రోనాట్లు టీ ఎలా తాగుతారు?
రోదసిలో టీ, కాఫీ, జ్యూస్‌ అన్నీ ప్యాకెట్లలో పెట్టి సీల్‌ చేస్తారు. టీ ప్యాకెట్‌లో టీపొడి, పంచదార, పాలపొడి ఉంటాయి. తాగాలనిపించినప్పుడు ఆస్ట్రోనాట్లు ఒక మిషన్‌ దగ్గరికి వెళ్తారు. అక్కడ వేడి నీళ్ల పైపు ఉంటుంది. ప్యాకెట్‌కి ఉన్న చిన్న నాజిల్‌లోకి ఆ పైప్‌ గుచ్చి వేడి నీళ్లు నింపుతారు. తర్వాత బాగా  కలుపుతారు. టీ తయారువుతుంది.

ఇంకో రంధ్రంలో స్ట్రా పెట్టి తాగేస్తారు. గ్లాసు అవసరం లేదు. ఒలికిపోతుందనే భయం లేదు. మరి స్ట్రా లేకుండా తాగాలంటే? అదీ అవుతుంది. ప్యాకెట్‌లోంచి కొంచెం టీని బయటకు పిండితే అది గాల్లో గుండ్రటి బుడగలా తేలుతుంది. ‘సర్ఫేస్‌ టెన్షన్‌’ వల్ల అది విడిపోకుండా బంతిలా ఉంటుంది.

ఆస్ట్రోనాట్లు నోరు తెరిచి ఆ బుడగని మింగేస్తారు. కానీ జాగ్రత్తగా చేయాలి. లేదంటే ఆ బుడగ మిషన్‌ వైర్లలోకి దూరి షార్ట్‌ సర్క్యూట్‌ అయిపోతుంది. అంతరిక్షంలో టీ తాగితే మజా ఉంటుందా? ఉండదట. గురుత్వాకర్షణ లేకపోవడం వల్ల శరీరంలో రక్తం, నీరు అంతా తల వైపు చేరుతుంది. దాంతో ముక్కు దిబ్బడగా అనిపిస్తుంది. జలుబు చేసినట్టు రుచి, వాసన సరిగా తెలియవు. ఇంటి టీ రుచి కోసం భూమ్మీదకు వచ్చేదాకా ఆగాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement