తేనెటీగల డాన్సింగ్‌ సీక్రెట్‌ : నోబెల్‌ బహుమతి కూడా | Honey Bees Social Signal Through The Waggle Dance, Know Interesting Facts In Telugu | Sakshi
Sakshi News home page

తేనెటీగల డాన్సింగ్‌ సీక్రెట్‌ : నోబెల్‌ బహుమతి కూడా

Jun 21 2025 10:35 AM | Updated on Jun 21 2025 11:46 AM

Honey bees Social signal through the waggle dance

పిల్లలూ, మనం మన స్నేహితులను మనతో ఆడుకోవడానికి మనం ఎలా పిలుస్తాం? మాటలతోనో, సైగలతోనో పిలుస్తాం కదా! మరి తేనెటీగలు (HoneyBees) వాటి తోటి ఫ్రెండ్స్‌ ని పిలవాలంటే ఎలా పిలుస్తాయో అని ఎప్పుడైనా ఆలోచించారా? లేదా! అయితే ఇప్పుడు తెలుసుకుందాం. తేనెటీగలు పువ్వుల ద్వారా తేనెని సేకరిస్తాయి అని మనందరికి తెలుసు. అయితే, అన్ని తేనెటీగలు మాకుమ్మడిగా పువ్వులను వెతకడానికి వెళ్ళవు. ముందుగా స్కౌట్‌ బీ లేదా కార్మికటీగ వెళ్ళి తేనెకు అనుకూలమైన పువ్వులను కనుగొంటుంది. 

ఆ తరువాత తేనెపట్టులోకి తిరిగివచ్చి, తన సహచర తేనెటీగల ముందు ఒక వత్తాకారంలో  తిరుగుతూ, ఆ తర్వాత నడుము కదిలిస్తూ నృత్యం చేస్తుంది. దీనిని ‘వాగ్గిల్‌ డ్యాన్స్‌‘  (Waggle Dance) అని అంటారు. ఈ డాన్స్‌ ద్వారాటీగ తన శరీరాన్ని సూర్యుని దిశకు సంబంధించి ఏ కోణంలో కదిలిస్తుందో, అది పుష్పాలు ఉన్న దిశను సూచిస్తుంది. ఈ విధంగా, ఒకే నృత్యంతో దూరం, దిశ, మరియు కొన్నిసార్లు పుష్పాల నాణ్యత కూడా తెలియజేస్తాయి. ఈ డ్యాన్స్‌ను 1940లలో ఆస్ట్రియన్‌ శాస్త్రవేత్త కార్ల్‌ వాన్‌ ఫ్రిష్‌ అధ్యయనం చేసి, దాని రహస్యాలను వెల్లడించారు, దీనికిగాను అతనికి నోబెల్‌ బహుమతి కూడా లభించింది.

ఇదీ చదవండి: రాత్రికి రాత్రే మిలియనీర్‌గా..జాలరి దశ మార్చిన చేపలు


 

Advertisement
 
Advertisement
Advertisement