breaking news
communicate
-
కార్ల మధ్య రహస్య సంభాషణతో రోడ్డు ప్రమాదాలకు చెక్
దేశంలోని రోడ్లపై ప్రయాణం ఇకపై పూర్తిగా మారిపోనుంది. ఎదురుగా వచ్చే ప్రమాదాలను ముందే పసిగట్టి, ఒకదానితో ఒకటి మాట్లాడుకునే సరికొత్త కార్లు త్వరలోనే మన ముందుకు రాబోతున్నాయి. దేశంలో ఏటా పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ‘వెహికల్-టు-వెహికల్’ (వీ టు వీ) కమ్యూనికేషన్ వ్యవస్థను తప్పనిసరి చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు.. కేంద్రం సంచలన నిర్ణయం2025లో దేశవ్యాప్తంగా జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఏకంగా 1.83 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. గత ఏడాదితో పోలిస్తే ఈ సంఖ్య సుమారు 6,000 పెరగడం ప్రభుత్వాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేసింది. ఈ ప్రమాదాల తీవ్రతను తగ్గించేందుకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ వినూత్న పరిష్కారంతో ముందుకొచ్చింది. ఇందులో భాగంగా ‘కేంద్ర మోటార్ వాహనాల (సవరణ) నిబంధనలు, 2026’ ముసాయిదాను జూలై 22న విడుదల చేసి, ప్రజల నుంచి సలహాలు, అభ్యంతరాలను స్వీకరించింది.అసలు ఏమిటీ ‘వీ టు వీ’టెక్నాలజీ?వీ టు వీ అంటే ‘వెహికల్-టు-వెహికల్’ వైర్లెస్ కమ్యూనికేషన్ సిస్టమ్. ఈ సాంకేతికత ద్వారా రోడ్డుపై వెళ్లే వాహనాలు పరస్పరం సమాచారాన్ని మార్పిడి చేసుకుంటాయి. ప్రస్తుతం కార్లలో వస్తున్న ఏడీఏఎస్ భద్రతా ఫీచర్ల కంటే ఇది ఎంతో ముందంజలో ఉంటుంది. ఈ వ్యవస్థ సాయంతో ప్రయాణంలో ఎదురయ్యే ముప్పును డ్రైవర్ కంటే ముందే వాహనం గుర్తించి హెచ్చరిస్తుంది.అమలు గడువులు.. పాటించాల్సిన ప్రమాణాలుకొత్త నిబంధనల ప్రకారం, 2027 అక్టోబర్ 1 నుంచి తయారయ్యే ఎల్ (ద్విచక్ర, త్రిచక్ర), ఎం (కార్లు, బస్సులు), ఎన్ (సరుకు రవాణా వాహనాలు) కేటగిరీ వాహనాల్లో వీ టు వీ సిస్టమ్ అమర్చితే అవి కచ్చితంగా ‘ఏఐఎస్-230’ ప్రమాణాలకు లోబడి ఉండాలి. అలాగే 2028 అక్టోబర్ 1 తర్వాత దేశంలో తయారయ్యే ఈ కేటగిరీల అన్ని వాహనాల్లోనూ ‘వీ టు వీ’ సిస్టమ్ ఏర్పాటును ప్రభుత్వం తప్పనిసరి చేసింది. సిగ్నల్స్ బదిలీ, రేడియో ఫ్రీక్వెన్సీ, జీపీఎస్ అనుసంధానం, సైబర్ భద్రత నియమాలను ఈ ఏఐఎస్-230 ప్రమాణాలు నిర్దేశిస్తాయి.సాంకేతికత ఎలా పనిచేస్తుంది?వాహనంలో అమర్చే చిన్న ‘ఆన్-బోర్డ్ యూనిట్’ (ఓబీయూ)ద్వారా ఈ వ్యవస్థ పనిచేస్తుంది. ఇది 5.875 GHz నుండి 5.925 GHz ఫ్రీక్వెన్సీ బ్యాండ్‌పై సెల్యులార్ వెహికల్-టు-ఎవ్రీథింగ్ (C-V2X) సాంకేతికతను వాడుకుంటుంది. టెలికాం శాఖ (DoT) ఇప్పటికే ఈ స్పెక్ట్రమ్‌ను లైసెన్స్ రహితంగా ప్రకటించింది. ఈ ఓబీయూ పరికరం దాదాపు 300 మీటర్ల పరిధిలోని వాహనాలను సులువుగా పసిగడుతుంది. కొత్త కార్లలో అమర్చే ఈ పరికరం ఖరీదు సుమారు రూ.5,000 నుంచి రూ.7,000 వరకు ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.సాధారణ సెన్సార్లకు ‘వీ టూ వీ’కి తేడా ఏమిటి?ప్రస్తుతం కార్లలో ఉండే కెమెరా లేదా రాడార్ ఆధారిత ఏడీఏఎస్ వ్యవస్థలు కేవలం డ్రైవర్ లేదా కెమెరా చూడగలిగే పరిధిని మాత్రమే గుర్తిస్తాయి. కానీ ‘వీ టూ వీ’ వ్యవస్థ దృష్టికి ఆవల ఉన్న ప్రమాదాలను కూడా పసిగడుతుంది. ప్రమాదకరమైన మలుపులు (బ్లైండ్ కార్నర్స్), భారీ ట్రక్కుల వెనుక ఉన్న కార్లు, దట్టమైన పొగమంచులో దాగి ఉన్న వాహనాల వివరాలను వేగం, దిశ, బ్రేకింగ్ డేటా ద్వారా పరస్పరం పంచుకుంటుంది. విమానాలు తమ ఎత్తు, వేగాన్ని రేడియో సిగ్నల్స్ ద్వారా పంచుకునే విధానాన్ని పోలి ఉండే ఈ వ్యవస్థతో ఎదురెదురు ప్రమాదాలు గణనీయంగా తగ్గుతాయి.డేటా భద్రత.. ఎదురవుతున్న సవాళ్లు‘వీ టు వీ’ ఎంతో ఉపయోగకరమైనప్పటికీ, ప్రయాణ డేటా, వాహనం లొకేషన్, రూట్ సమాచారం నిరంతరం సేకరించడం వల్ల సైబర్ దాడులు, గోప్యతా సమస్యలు తలెత్తే ముప్పు ఉంది. లక్షలాది వాహనాలు ఒకేసారి రోడ్లపైకి వచ్చినప్పుడు ఫ్రీక్వెన్సీ బ్యాండ్‌పై ట్రాఫిక్ లోడ్ పెరగడం, సిగ్నల్ లోపాలు రాకుండా చూసుకోవడం ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారనుంది. ఈ భద్రతా లోపాలను అధిగమించేందుకు పటిష్టమైన సైబర్ చట్టాలు, రక్షణ చర్యలు అవసరమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.ఇది కూడా చదవండి: నేపాల్: శవాల గుర్తింపు ఎలా? కుటుంబ సభ్యులకు చూపిస్తారిలా.. -
తేనెటీగల డాన్సింగ్ సీక్రెట్ : నోబెల్ బహుమతి కూడా
పిల్లలూ, మనం మన స్నేహితులను మనతో ఆడుకోవడానికి మనం ఎలా పిలుస్తాం? మాటలతోనో, సైగలతోనో పిలుస్తాం కదా! మరి తేనెటీగలు (HoneyBees) వాటి తోటి ఫ్రెండ్స్ ని పిలవాలంటే ఎలా పిలుస్తాయో అని ఎప్పుడైనా ఆలోచించారా? లేదా! అయితే ఇప్పుడు తెలుసుకుందాం. తేనెటీగలు పువ్వుల ద్వారా తేనెని సేకరిస్తాయి అని మనందరికి తెలుసు. అయితే, అన్ని తేనెటీగలు మాకుమ్మడిగా పువ్వులను వెతకడానికి వెళ్ళవు. ముందుగా స్కౌట్ బీ లేదా కార్మికటీగ వెళ్ళి తేనెకు అనుకూలమైన పువ్వులను కనుగొంటుంది. ఆ తరువాత తేనెపట్టులోకి తిరిగివచ్చి, తన సహచర తేనెటీగల ముందు ఒక వత్తాకారంలో తిరుగుతూ, ఆ తర్వాత నడుము కదిలిస్తూ నృత్యం చేస్తుంది. దీనిని ‘వాగ్గిల్ డ్యాన్స్‘ (Waggle Dance) అని అంటారు. ఈ డాన్స్ ద్వారాటీగ తన శరీరాన్ని సూర్యుని దిశకు సంబంధించి ఏ కోణంలో కదిలిస్తుందో, అది పుష్పాలు ఉన్న దిశను సూచిస్తుంది. ఈ విధంగా, ఒకే నృత్యంతో దూరం, దిశ, మరియు కొన్నిసార్లు పుష్పాల నాణ్యత కూడా తెలియజేస్తాయి. ఈ డ్యాన్స్‌ను 1940లలో ఆస్ట్రియన్ శాస్త్రవేత్త కార్ల్ వాన్ ఫ్రిష్ అధ్యయనం చేసి, దాని రహస్యాలను వెల్లడించారు, దీనికిగాను అతనికి నోబెల్ బహుమతి కూడా లభించింది.ఇదీ చదవండి: రాత్రికి రాత్రే మిలియనీర్‌గా..జాలరి దశ మార్చిన చేపలు -
వైద్యరంగంలోనే ఓ అద్భుతం ఆ బాలుడు
లండన్: సెరిబ్రెల్ పాల్జీ (మస్తిష్క పక్షవాతం)తో బాధపడుతున్న జొనాథన్ బ్య్రాన్ ఏడేళ్ల వరకు నరకం అనుభవించాడు. శరీరంలోని ఏ అవయవం కదిలేది కాదు. కాళ్లు చేతులే కాకుండా ముఖాన నవ్వుకూడా విరిసేది కాదు. కనురెప్పలు మిటకరించడం తప్ప ఎలాంటి భావాన్ని వ్యక్తం చేయడం సాధ్యమయ్యేది కాదు. ఇలాంటి పరిస్థితుల్లో జొనాథన్‌కు వైద్యం కొనసాగించేందుకు కూడా వైద్యులు నిరాకరించారు. వైద్యం ఆపేసి ప్రశాంతంగా కన్నుమూసేందుకు అవకాశం ఇద్దామని కూడా వైద్యులు సలహాలు ఇచ్చారు. అంగవికలుర పాఠశాలలో చేర్చుకునేందుకు కూడా పాఠశాలల యజమానులు నిరాకరించారు. కన్నపేగు తీపేమిటో కన్నతల్లైన చంతన్కే తెలుసు. ఆమె ఈ సలహాలేవీ వినేందుకు సుముఖంగా లేదు. ఎందుకు తన బాబుకు మాట్లాడడం రాదు, ఎందుకు కాలు, చేయి కదపడం రాదు, ఎందుకు అందరిలా ఎదగలేడు? అన్న విషయాన్ని పదే పదే ఆలోచించారు. ఎలాగైనా తన బాబుకు మాటలు నేర్పించాలని, నడవడం నేర్పించాలని భావించారు. ఓ రోజు మార్కెట్‌కు వెళ్లి ‘పర్స్పెక్స్ స్పెల్లింగ్ బోర్డు’ను కొని తెచ్చారు. ఓపిగ్గా ఇంగ్లీషు ఓనమాలు నేర్పడం ప్రారంభించారు. కొంతకాలం పాటు కళ్లు మిటకరి చూడడం తప్ప జొనాథన్ ఏమీ చేయలేకపోయాడు. అయినా పట్టువదలని విక్రమార్కునిలా చంతన్ అకుంఠిత దీక్షతో కొడుక్కి ఓనమాలు నేర్పడానికి ప్రయత్నిస్తూనే వచ్చారు. కొన్ని రోజులకు జొనాథన్ పెదాలు కదపడం మొదలుపెట్టాడు. తల్లిలో కొత్త ఆశ చిగురించింది. ప్రతి ఉదయం ఒకటి, రెండు పదాలు జొనాథన్‌కు ఒంటబడుతూ వచ్చాయి. అలా నెలలు గడిచిపోయాయి. ఓ ఆరు నెలల్లో ఒనమాలు పలకడం, రాయడం జొనాథన్ నేర్చుకున్నాడు. పెదాలు పలకడంతో వచ్చిన ఉత్సాహంతో జొనాతన్ మెల్లగా కాళ్లు, చేతులు కలపడం ప్రారంభించాడు. ఇప్పుడు జొనాథన్‌కు తొమ్మిదిన్నర ఏళ్లు. ఆ బాలుడు ఇప్పుడు రాయడం, చదవడమే కాదు. పాఠశాలకు కూడా వెళుతున్నాడు. లెక్కల్లో క్లాస్‌లోనే ఫస్ట్. వ్యాసాలు, కథలు రాయడం కూడా ప్రారంభించాడు. ఇటీవల బీబీసీ నిర్వహించిన ఓ పోటీకి వ్యాసాన్ని కూడా రాశాడు. తన ఆత్మకథ రాసుకున్నాడు. ‘ఐకాంట్టాక్ (కన్ను మాట్లాడలేదు) అనే బ్లాగ్‌ను కూడా నడుపుతున్నాడు. జొనాథన్‌లో వచ్చిన అద్భుతమైన మార్పును చూసి వైద్యులే ముక్కున వేలేసుకుంటున్నారు. తల్లి, కొడుకు చూపిన అకుంఠిత దీక్ష వల్లనే ఇది సాధ్యమైందని వైద్యులు భావిస్తున్నారు. వైద్య చరిత్రలోనే బాబు ఇలా కోలుకోవడం అనేది ఓ అధ్యాయమని వారు భావిస్తున్నారు. అయినా ఇప్పటికీ బాలుడి మెదడుకు కావాల్సిన ఆక్సిజన్‌ను కృత్రిమంగా అందించాల్సి వస్తోంది. ఆ బాలుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు జరిగిన కారు యాక్సిడెంట్ కారణంగా బాలుడి మెదడుకు ఆక్సిజన్ అందకుండా పోయింది. అందుకనే ఆయన ‘సెరిబ్రెల్ పాల్జీ’ వ్యాధిన పడ్డాడు. ఇలాంటి పిల్లలకు మాట్లాడే అవకాశాలు ఎప్పటికీ ఉండవు. బ్రిటన్‌లో ప్రస్తుతం 30వేల మంది పిల్లలు ఈ జబ్బుతో బాధపడుతున్నారు. జొనాథన్ పురోగతి గురించి తెల్సిన మీడియా ఇటీవల విల్ట్‌షైర్‌లోని జొనాథన్ ఇంటికి వెళ్లి బాలుడిని పలుకరించింది. బ్రిటన్‌లో ఇటీవల నిర్వహించిన ‘బ్రెగ్జిట్’ గురించి ఆ బాలుడిని ప్రశ్నించగా, ఇది మనమంతా కలసి ఉండాల్సిన సమయం అంటూ జొనాథన్ ఎంతో పరిణతితో చెప్పాడు. పెద్దయ్యాక ఏమవుతావని ప్రశ్నించగా, జీసస్ గార్డెన్‌కు వెళతానని చెప్పాడు. జొనాతన్కు తల్లి చంతన్తో తండ్రి క్రిస్టఫర్, ఒక అక్క, ఓ చెల్లెలు ఉన్నారు.


