రాత్రికి రాత్రే మిలియనీర్‌గా..జాలరి దశ మార్చిన చేపలు | Telia Bhola fish Fisherman becomes millionaire overnight | Sakshi
Sakshi News home page

రాత్రికి రాత్రే మిలియనీర్‌గా..జాలరి దశ మార్చిన చేపలు

Jun 20 2025 4:53 PM | Updated on Jun 20 2025 5:41 PM

Telia Bhola fish Fisherman becomes millionaire overnight

భువనేశ్వర్‌: అదృష్టవశాత్తూ, దిఘా నదీముఖద్వారంలోకి అడుగుపెట్టిన ఒక మత్స్యకారుడు రాత్రికి రాత్రే 29 అరుదైన ,అత్యంత విలువైన 'తెలియా భోలా' చేపలను పట్టుకుని  మిలియనీర్‌ అయ్యాడు.

వేట కోసం విసిరిన వలలో ఔషధీయ విలువలతో నిండిన చేపలు చిక్కడంతో అతడి దశ తిరిగింది. దిఘా నదీ ముఖద్వారం పరిసరాలలో నానీ గోపాల్‌ ట్రాలరు నుంచి  పన్నిన వలలో తెలియా భోలా చేపలు పడ్డాయి. ఒకేసారి 29 అరుదైన, అత్యంత విలువైన తెలియా భోలా చేపలు చిక్కడంతో అదృష్టం కలిసి వచ్చింది.  దెబ్బకి లక్షాధికారి అయిపోయాడు.

 ఒక్కో చేప 20 కిలోలు పైబడి బరువు తూగింది. నదీ ముఖద్వారం సమీపంలోని చేపల వేలం కేంద్రంలో రూ.33 లక్షలకు ఈ చేపలు అమ్ముడయ్యాయి. తెలియా భోలా చేపలను ఔషధీయ విలువల కారణంగా తీవ్రమైన వ్యాధులకు మందులు, సౌందర్య సాధనాల ఉత్పత్తిలో వాడతారు. 

ఇదీ చదవండి: నో డైటింగ్‌, ఓన్లీ జాదూ డైట్‌ : నెలలో 7 కిలోలు తగ్గడం పక్కా!

 

Advertisement
 
Advertisement
Advertisement