క్రియేటివిటీతో లక్షల్లో సంపాదన: ఓ ‘అమ్మ’ సక్సెస్‌ స్టోరీ

Homemaker UK Mom Makes rs13 Lakh Crafting Earrings While Kids Sleep - Sakshi

కంటెంట్‌,క్రియేటివిటీ ఉంటే చాలు, ఇంట్లో ఉండి కూడా లక్షలు సంపాదింవచ్చు

అటు పిల్లల ఆలనా  పాలనా, ఇటు చక్కటి బిజినెస్‌తో రాణిస్తున్న నేటి మహిళ

మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్యం చాలా ముఖ్యం. నిజానికి  గృహిణులుగా ఉంటూ గ్రామీణ మహిళలు కుటుంబానికి చాలా అండగా ఉంటారు. పశు పోషణ అంతా వారి మీదే  ఆధారపడి ఉంటుంది.  పాలమ్మి, పిడకలమ్మి,  విస్తరాకులు కుట్టి, లేసులు అల్లి మిషన్‌ కుట్టి ఇలా ఒకటి కాదు.. ఏదో రకంగా తమకంటూ కొంత ఆదాయాన్ని సమకూర్చుకుంటారు. కానీ వారి సంపాదన, శ్రమ  లెక్కలోకి రాదు అంతే. విద్యావంతులైన మహిళలు కూడా తమ చదివిన చదువుకు సార్థకత సాధించాలనే ఆలోచిస్తారు. ఆలా యూకేకు చెందిన మహిళ తనకు  నచ్చిన విద్యతో  స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. లక్షలు వెనకేసింది. పూర్తి వివరాల కోసం కథనాన్ని  చదవండి. 

రాచెల్ పెళ్లి, పిల్లల తరువాతఇంట్లోనే ఉంటూ కుటుంబ జీవితాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తూ, ఆర్థికంగా పటిష్టంగా నిలబడింది. రాచెల్ తన కసృజనాత్మకతకు పదును పెట్టి, ఒక పనిని ఎంచుకుంది. సరికొత్తగా కెరీర్‌ బాటలు వేసుకుని ఆర్థిక స్వావలంబన సాధించింది.

ఆకర్షణీయంగా చెవిపోగులను తయారు చేస్తూ పేరు తెచ్చుకుంది. క్రమంగా అది విస్తరించి వ్యాపారంగా మారిపోయింది. అది కూడా చాలా తక్కువ సమయంలోనే దాదాపు  13 లక్షల రూపాయలను ఆర్జించింది.

రాచెల్‌కు ఇద్దరు పిల్లల తల్లిగా వారి ఆలనా పాలనా చేసుకుంటూనే డబ్బులు సంపాదించే మార్గాన్ని అన్వేషించింది. ఈ క్రమంలోనే  పిల్లలు నిద్రపోతున్న సమయంలో స్కల్పే పాలిమర్ క్లేతో అందమైన డిజైన్లతో చెవిపోగులు తయారు చేయడం ప్రారంభించింది.  సిరా,  వైట్,  యాక్రిలిక్ పెయింట్‌తో తయారు చేసిన ఇయర్ రింగ్స్ డిజైన్స్‌కు మంచి ఆదరణ లభించింది. ఆన్‌లైన్‌  వెంచర్‌ (Etsy)   ద్వారా తన వ్యాపారాన్ని అభివృద్ది చేసుకుంది.

ఒక్కో జతను ఎట్సీలో దాదాపు 30 పౌండ్ల (రూ.3,000) చొప్పున విక్రయించేది.  తన వెంచర్‌ను లాభదాయకంగా మార్చుకుంది. హ్యాండ్‌మేడ్ ఒరిజినల్ ఆభరణాలకు మంచి డిమాండ్‌ ఏర్పడింది. 2021 నుంచి  దాదాపు 435 జతల చెవిపోగులను విక్రయించి, రూ. 13 లక్షలకు పైగా ఆదాయాన్ని  సమకూర్చుకుంది.  నేర్చుకోవాలనే ఆసక్తివున్న ఔత్సాహికులకు  శిక్షణ కూడా ఇస్తుంది. 

whatsapp channel

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top