ఇన్‌స్టాగ్రామ్‌ ‘పీక్‌’ ఫీచర్‌ని ఎప్పుడైనా ట్రై చేశారా! | Sakshi
Sakshi News home page

ఇన్‌స్టాగ్రామ్‌లోని ఈ ‘పీక్‌’ ఫీచర్‌ని ఎప్పుడైనా ట్రై చేశారా!

Published Fri, May 24 2024 1:31 PM

Have You Ever Tried Instagram's Peek Feature And New Technology

‘పీక్‌’ అనే కొత్త ఫీచర్‌ని పరీక్షిస్తోంది ఫొటో షేరింగ్‌ యాప్‌ ఇన్‌స్టాగ్రామ్‌. ఈ ఫీచర్‌ ద్వారా ఒక వ్యూ తరువాత మాయం అయ్యే ఎడిట్‌ చేయని, అన్‌ఫిల్టర్, ఇన్‌–ది–మూమెంట్‌ ఫొటోలను యూజర్‌లు స్పీడ్‌గా క్యాప్చర్, షేర్‌ చేయవచ్చు. స్నాప్‌చాట్, బీరియల్‌ను స్ఫూర్తిగా తీసుకొని ‘పీక్‌’పై దృష్టి పెట్టింది ఇన్‌స్టా. ఫొటోలు, వీడియోలను 24 గంటల ΄ాటు చూడడానికి అనుమతించే ఇన్‌స్టాగ్రామ్‌లోని ప్రస్తుత ‘స్టోరీస్‌’ ఫీచర్‌లా కాకుండా ‘పీక్‌’ ఫొటోలు సింగిల్‌ వ్యూలో అదృశ్యం అవుతాయి, ‘లిటిల్‌ మూమెంట్స్‌ విత్‌ ది పీపుల్‌ యూ లవ్‌’ అని ‘పీక్‌’ గురించి చెప్పింది ఇన్‌స్టాగ్రామ్‌.

గూగుల్‌ కొత్త ఏఐ వీడియో అండ్‌ ఇమేజ్‌ జనరేటర్స్‌..
కొత్త ఏఐ వీడియో అండ్‌ ఇమేజ్‌ జనరేటర్స్‌  వియో, ఇమాజెన్‌ 3లను గూగుల్‌ లాంచ్‌ చేసింది. టెక్స్ట్‌ ప్రాంప్ట్‌ల నుంచి వీడియోలను జనరేట్‌ చేయడానికి వియో ఉపయోగపడుతుంది. ఇమాజెన్‌ 3 అనేది గూగుల్‌కు సంబంధించి అత్యంత అధునాతన ‘టెక్ట్స్‌–టు–ఇమేజ్‌’ మోడల్‌. ‘ఇమాజెన్‌ 3 అనేది టెక్స్‌›్ట–టు–ఇమేజ్‌ హైక్వాలిటీ మోడల్‌.

ఫొటోరియలిస్టిక్, లైఫ్‌లైక్‌ ఇమేజ్‌లను సృష్టించే సామర్థ్యం దీని సొంతం’ అంటుంది గూగుల్‌. మోస్ట్‌ అడ్వాన్స్‌డ్‌ వీడియో మోడల్‌గా గూగుల్‌ చెబుతున్న ‘వియో’ వెరైటీ స్టైల్స్‌లో హై–క్వాలిటీ 1080పి వీడియోలను ్ర΄÷డ్యూస్‌ చేస్తుంది. ఈ ఏఐ మోడల్‌ ‘టైమ్‌ల్యాప్స్‌’ ‘ఏరియల్‌ ష్టార్స్‌’లాంటి సినిమాటిక్‌ కాన్సెప్ట్‌లను కూడా అర్థం చేసుకుంటుంది. వీడియో క్రియేటర్‌లకు ఇది గేమ్‌–చేంజర్‌ అవుతుందని ప్రకటించింది గూగుల్‌.

హువావే మేట్‌ బుక్‌ 14..
సైజ్‌: 14.2 అంగుళాలు    
రిజల్యూషన్‌: 2880్ఠ1920 పిక్సెల్స్‌
బరువు: 1.31 కేజీ     మెమోరీ: 16జీబి      
స్టోరేజ్‌: 512 జీబి/1టీబి
బ్యాటరీ లైఫ్‌: 19 గంటలు, ఏఐ ఫీచర్స్‌, ఇన్‌టెల్‌ కోర్‌ ఆల్ట్రా చిప్‌

ఆల్ట్రా హ్యూమన్‌ రింగ్‌ ఏయిర్‌..
థిక్‌: 2.5 ఎంఎం
వైడ్‌: 8.1 ఎంఎం    బరువు: 3 గ్రా.      
కలర్‌ ఆప్షన్‌:  టైటానియం    
పీపీజీ ఆప్టికల్‌ సెన్సర్‌: హార్ట్‌ రేట్‌ అండ్‌ బ్లడ్‌ ఆక్సిజన్‌ సాచ్యురేషన్‌, వాటర్‌ రెసిస్టెంట్‌,
సపోర్ట్స్‌: 22 వర్కవుట్‌ మోడ్స్‌

హెచ్‌ఎండీ  టీ21 ట్యాబ్‌..
సైజ్‌: 10.36 అంగుళాలు    
వోఎస్‌: ఆండ్రాయిడ్‌ 13
రిజల్యూషన్‌: 1200్ఠ2000 పిక్సెల్స్‌  
కలర్‌: బ్లాక్‌ స్టీల్‌
ఇంటర్నల్‌: 64జీబి 4జీబి 
ర్యామ్‌/ 128జీబి 4జీబి ర్యామ్‌ బ్యాటరీ: 8200 ఎంఏహెచ్‌, స్కాచ్‌ రెసిస్టెంట్‌ గ్లాస్‌

ఇవి చదవండి: గేమింగ్‌.. 'రక్షకుడు' వచ్చాడు!

Advertisement
 
Advertisement
 
Advertisement