ఫండే
టెక్ టమారం
వర్షాకాలంలో మనిషికన్నా ఎక్కువ కష్టపడేది షూలు, కార్ మిర్రర్లు, మొబైల్ టార్చ్‌లే! వాటి బాధలు తగ్గించడానికి వచ్చేసిన ఈ కూల్ గాడ్జెట్స్ రెయిన్ సీజన్ ని కాస్త ఈజీగా మార్చేస్తాయి. అలా వర్షాకాలంలో గొడుగులు కంటే ముందుగా ఈ గాడ్జెట్స్ కూడా హీరోలుగా మారాయి!
మిర్రర్‌కి రెయిన్ కోట్!
వర్షంలో కారు డ్రైవ్ చేస్తుంటే అసలు టెన్షన్ రోడ్డుకన్నా సైడ్ మిర్రర్‌పైనే ఉంటుంది! రెండు చినుకులు పడితే చాలు, మిర్రర్ మొత్తం బ్లర్ అయి ‘వెనక ఎవరు వస్తున్నారు?’ అనేది గెస్ గేమ్‌లా మారిపోతుంది. అలాంటి టైంలో ఈ ‘కార్ సైడ్ మిర్రర్ రెయిన్ గార్డ్’ బాగా ఉపయోగపడుతుంది.

ఈ చిన్న పీవీసీ గార్డ్స్‌ను మిర్రర్‌పై అతికిస్తే, వర్షపు నీరు నేరుగా మిర్రర్‌పై పడకుండా అడ్డుకుంటాయి. దీంతో డ్రైవింగ్‌లో విజిబిలిటీ కాస్త క్లియర్‌గా ఉంటుంది. రాత్రివేళ వెనక వాహనాల హెడ్‌లైట్ గ్లేర్‌ను కూడా కొంతవరకు తగ్గిస్తాయి. కార్లు, ట్రక్కులు ఇలా దాదాపు అన్ని వాహనాలకు సరిపడే యూనివర్సల్ డిజైన్ తో వస్తుంది. అతికించడం కూడా ఈజీ! తీసేసినా మిర్రర్‌పై మార్కులు పడవు. నాలుగు పీసులతో వచ్చే ఈ సెట్ ధర రూ. 300 మాత్రమే!
షూస్‌కి ఎయిర్ స్పా!
వర్షాకాలంలో బట్టలు ఉతకడానికే భయపడిపోతాం, అలాంటిది షూలు తడిస్తే ‘ఇవి ఇక రెండు రోజులు ఆరవు!’ అని మూలన పెట్టేయకండి. ఎందుకంటే, ఇప్పుడు వచ్చింది ఒక సూపర్ ఎలక్ట్రిక్ షూ డ్రయర్! ఇది ఉంటే, వర్షంలో తడిసిన షూలు, జిమ్ తర్వాత చెమట వాసన వచ్చే స్నీకర్స్, ఉదయం వేసుకునే సరికి ఇంకా తడిగానే ఉండే స్కూల్ షూలన్నీ క్షణాల్లోనే డ్రై అయిపోతాయి.

360 డిగ్రీల హాట్ ఎయిర్ టెక్నాలజీతో పనిచేసే ఈ చిన్న గాడ్జెట్ షూల లోపలికి వేడి గాలిని పంపి త్వరగా ఆరబెడుతుంది. అంతేకాదు, చెడు వాసనను కూడా తగ్గిస్తుంది. ఓవర్ హీటింగ్ కాకుండా టెంపరేచర్‌ను ఆటోమేటిక్‌గా కంట్రోల్ చేసే సేఫ్టీ ఫీచర్ కూడా ఉంది. స్పోర్ట్స్ షూలు, బూట్లు, స్లిప్పర్లు, సాక్స్ దాదాపు అన్ని రకాల ఫుట్‌వేర్‌కు ఇది సరిపోతుంది. మడిచే డిజైన్ తో ఉండటంతో ట్రావెల్‌లో కూడా సులభంగా తీసుకెళ్లొచ్చు. ధర సుమారు రూ.1,500.
చేతులకే టార్చ్‌లైట్!
కరెంట్ పోయినప్పుడు మొబైల్ టార్చ్‌ని నోట్లో పట్టుకుని పని చేసిన అనుభవం ఉందా? ఇక ఆ టెన్షన్ అవసరం లేదు! ఈ ‘ఎల్‌ఈడీ ఫ్లాష్‌లైట్ గ్లోవ్స్’ వేసుకుంటే, మీ చేతులే చిన్న టార్చ్‌లైట్‌లా మారిపోతాయి.

ఈ గ్లోవ్స్‌లో వేళ్ల దగ్గర చిన్న ఎల్‌ఈడీ లైట్లు ఉంటాయి. స్విచ్ ఆన్ చేస్తే చేతులు ఎటు కదిలితే వెలుతురు కూడా అటే వస్తుంది. బైక్ రిపేర్, ఫిషింగ్, క్యాంపింగ్, రాత్రివేళ చిన్న పనులు చేయడానికి ఇవి బాగా ఉపయోగపడతాయి. చేతిలో టార్చ్ పట్టుకోవాల్సిన పని లేకుండా ‘హ్యాండ్స్ ఫ్రీ’గా పని చేసుకోవచ్చు. స్ట్రెచ్ ఫ్యాబ్రిక్‌తో తయారైన ఈ గ్లోవ్స్ సాఫ్ట్‌గా, కంఫర్ట్‌గా ఉంటాయి. బ్యాటరీ కూడా మార్చుకునే సదుపాయం ఉంది. టూల్ బాక్స్‌లో పెట్టుకోవడానికి, గిఫ్ట్‌గా ఇవ్వడానికి ఇది కూల్ గాడ్జెట్! ధర రూ. 180 మాత్రమే.


