గూగుల్‌ వర్సస్‌ దోమల్‌ | Google wants to release millions of mosquitoes | Sakshi
Sakshi News home page

గూగుల్‌ వర్సస్‌ దోమల్‌

Jun 14 2026 4:20 AM | Updated on Jun 14 2026 4:20 AM

Google wants to release millions of mosquitoes

గూగుల్‌ దోమలపై దండయాత్ర మొదలుపెట్టింది. ఏ మైక్రోసాఫ్ట్‌ మీదనో, యాపిల్‌ మీదనో ఈ మాట అంటే బాగుంటుంది కాని దోమలతో ఏంటి విడ్డూరం అనుకుంటున్నారా? కాని ఇది నిజమండీ...గూగుల్‌ మాతృసంస్థ ఆల్ఫాబెట్‌ దోమల బెడదను నివారించేందుకు ‘ప్రాజెక్ట్‌ డీబగ్‌’ పేరిట ఓ విన్నూత్న ప్రయత్నంతో ముందుకు వచ్చింది.

అమెరికాలోని కాలిఫోర్నియా, ఫ్లోరిడా రాష్ట్రాలలో రానున్న రెండు సంవత్సరాలలో ఏకంగా 6.4 కోట్ల మగ దోమలను విడుదల చేసేందుకు అనుమతి కోరుతూ కోర్టును ఆశ్రయించింది. ఈ మగదోమల్లో వోల్‌బ్యాకియా అనే బాక్టీరియా సహజంగా ఉంటుంది. ఇవి అడవిలోని ఆడ దోమలతో జత కడతాయి. కాని ఆడదోమలు గుడ్లు పొదగవు. క్రమంగా వాటి సంఖ్య తగ్గి వ్యాధుల వ్యాప్తి తగ్గుతుందని సంబంధిత పరిశోధకులు చెబుతున్నారు. ముఖ్యంగా వెస్ట్‌ నైల్‌ వైరస్, డెంగీ, జికా వంటì  ప్రమాదకరమైన వ్యాధులను వ్యాప్తి చేయకుండా నివారించడమే తమ లక్ష్యమని వారు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement