ట్రెక్కింగ్‌ స్టార్‌ @ 52 | Gemini Ganesan granddaughter Dr Priya Selvaraj creates history | Sakshi
Sakshi News home page

ట్రెక్కింగ్‌ స్టార్‌ @ 52

Jun 23 2026 6:39 AM | Updated on Jun 23 2026 6:39 AM

Gemini Ganesan granddaughter Dr Priya Selvaraj creates history

జెమిని గణేషన్‌ గారి మనవరాలు

ప్రముఖ నటుడు జెమిని గణేషన్‌ మనవరాలు డాక్టర్‌ ప్రియా సెల్వరాజ్‌ 52 ఏళ్ల వయసులో మౌంట్‌  ఎవరెస్ట్‌ను విజయవంతంగా అధిరోహించింది. చెన్నైకి చెందిన ప్రియా సెల్వరాజ్‌ ఎన్నో నెలల సాధన ద్వారా 8,849 మీటర్ల ఎత్తైన శిఖరాన్ని అధిరోహించింది. డాక్టర్‌ ప్రియ పర్వతారోహణ ప్రయాణం నలభై ఎనిమిది సంవత్సరాల వయసులో ట్రెక్కింగ్‌తో మొదలైంది. 

ఆ తరువాత పర్వతారోహణపై ఆమెలో అంతకంతకూ ఆసక్తి పెరుగుతూ పోయింది. ‘ప్రతి సంవత్సరం ట్రెక్కింగ్‌ చేస్తుంటాను. ట్రెక్కింగ్‌ నా జీవితాన్ని మార్చేసింది’ అంటుంది ప్రియ. ఎవరెస్ట్‌ అధిరోహణకు ముందే పర్వతారోహణలో సత్తా చాటింది డాక్టర్‌ ప్రియ.

నేపాల్‌లోని 8,163 మీటర్‌ల ఎత్తైన పర్వతమైన మానస్లును విజయవంతంగా అధిరోహించింది. ఓర్పు, శారీరక బలం, మానసిక దృఢత్వానికి ఒక పరీక్షగా భావించే ఎవరెస్ట్‌ అధిరోహణకు మానస్లు విజయం మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది. కొన్ని సంవత్సరాల క్రితమే డా. ప్రియ ట్రెక్కింగ్‌ మొదలుపెట్టడం వల్ల ఆమె ఎవరెస్ట్‌ అధిరోహణ అనేది ఆసక్తిగా మారింది. ఈ తాజా విజయం ఆమెకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement