సైన్స్‌కు షాక్ ఇచ్చిన గణేశుడు.. ఆర్నెల్లు నలుపు.. ఆర్నెల్లు తెలుపు | Ganesha Idol Turns Black White Every 6 Months | Sakshi
Sakshi News home page

సైన్స్‌కు షాక్ ఇచ్చిన గణేశుడు.. ఆర్నెల్లు నలుపు.. ఆర్నెల్లు తెలుపు

Jul 13 2026 6:47 PM | Updated on Jul 13 2026 7:18 PM

Ganesha Idol Turns Black White Every 6 Months

మనం ఇప్పటి వరకు ఆధ్యాత్మకతకు సైన్స్‌ను జోడిస్తూ.. సైన్స్ కూడా ఛేదించలేని కొన్ని ఆలయాల విశేషాలు తెలుసుకున్నాం కదా? నేను ఈరోజు మీకు అలాంటి మరో అద్భుతాన్ని చూపించబోతున్నాను. ఒక్కసారి ఊహించుకోండి..! దేవుడు ఉన్నాడా? అని ప్రశ్నించే నాస్తికులను సైతం ముక్కున వేలువేసుకునేలా చేస్తున్న బ్లాక్ అండ్ వైట్ గణేశుడి గురించి నేను మీకు చెప్పబోతున్నాను. ఆ గణపతి విగ్రహం ఇప్పటికీ సైన్స్‌కు అంతు చిక్కలేదు. విశేషం ఏంటనుకుంటున్నారా?

సంవత్సరంలో రెండు ఆయనాలుంటాయి. అవి ఉత్తరాయణం, దక్షిణాయనం. ఆ గణపతి విగ్రహం ఉత్తరాయణంలో నలుపు రంగులో.. దక్షిణాయనంలో తెలుపురంగులో ఉంటుంది. ఆ విగ్రహం ఎదుట ఉండే బావిలో నీరు విగ్రహం రంగుకు వ్యతిరేక వర్ణంలో ఉండడం గమనార్హం..! అంటే.. విగ్రహం తెల్లగా ఉన్నప్పుడు బావినీళ్లు నల్లగా.. విగ్రహం నలుపు రంగులో ఉన్నప్పుడు బావినీళ్లు తెల్లగా ఉంటాయి. అంతేకాదు.. ఆ ఆలయంలోని మర్రిచెట్టు వింత కూడా సైన్స్‌కు చిక్కడం లేదు.

తమిళనాడు – కేరళ సరిహద్దుల్లో ఉన్న కన్యాకుమారి జిల్లా సమీపంలో.. నాగర్‌కోయిల్‌కు దగ్గర్లోని కేరళపురం అనే గ్రామంలో ఉన్న 'శ్రీ మహాదేవర్ అతిశయ వినాయకర్ ఆలయం' ఈ కోవలోకే వస్తుంది. పేరులోనే ఉంది కదా.. 'అతిశయ వినాయకర్'.. అంటేనే అద్భుతాలు చేసే వినాయకుడు అని అర్థం. ఈ రోజు ఈ వీడియోలో ఆ ఆలయం గురించి తెలుసుకుందామా?

సైన్స్ కు పెద్ద సవాల్.. బ్లాక్ అండ్ వైట్ గణేశ..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement