
అదేదో సినిమాలో ‘‘హ్యాపీ ఫ్రెండ్షిప్ డే రా చారీ’’ అంటూ బ్రహ్మానందం విష్ చేయగానే ‘‘నేను మీకు ఫ్రెండేమిటి గురువుగారూ’’ అంటాడు జూ. ఎన్టీఆర్ కాస్తంత గురుగౌరవ భావంతో. దానికి బ్రహ్మానందం మళ్లీ ‘‘ఫ్రెండ్‌షిప్‌కు ఏజ్ లిమిటేదీ ఉండదురా’’ బదులిస్తాడు. అవును. ఫ్రెండ్‌షిప్‌కు వయసుపరంగా చిన్నా పెద్దా అనే ఏజ్ లిమిటు లేనట్టే... సైజు పరంగా కూడా చిన్నా పెద్దా తేడా ఉండదు.
అందుకే శ్రీరాముడంతటి వాడికి భక్తితో ఉడత హెల్ప్ చేస్తే... ‘‘నాకే హెల్ప్ చేశావంటే నీ ఫ్రెండ్షిప్ మామూలుది కాదూ... నీ ఫ్రెండ్‌షిప్పూ, నా ఫ్రెండ్‌షిప్పూ లోకానికి ఎప్పటికీ తెలియాలం’’టూ దానికి వీపు మీద పర్మనెంట్ ఫ్రెండ్షిప్ బ్యాండ్‌ను వదిలాడు. అదేంటోగానీ శ్రీరామచంద్రుడికి టాప్ టు బాటమ్... సుగ్రీవుడు మొదలుకొని ఉడత వరకు ఎందరో ఫ్రెండ్సు.
పాపం... అంత ఫ్రెండ్షిప్ చేస్తే అర్జునుడికి భగవద్గీత... ఒక్కటే ‘గీత’! కానీ చిన్న హెల్ప్‌తో పెద్ద క్రెడిట్ కొట్టేసిన ఉడుతగారికి మాత్రం మర్యాదాపురుషోత్తముడి నుంచి మాంచి మార్కింగ్‌లైన్స్ ‘మూడు గీతలు’!! స్నేహం గొప్పదనాల ఉదంతాలకూ... స్నేహం ఔన్నత్త్యాల గురించి ‘నేస్తమ... నేస్తమా’ లాంటి పాటలకూ... కర్ణ సుయోధన, కృష్ణకుచేల, పార్థుడూ ఆయన సారథీలాంటి స్నేహ
తార్కాణాలకు కొదవేవీ లేదు. స్నేహభావన గొప్పది కాబట్టే మొదట... తెలివితేటల కంటే ముందుగా ‘చెలిమి’చేతలనూ... నెనరు–నెయ్యాలనూ... కూరిమి–పేరిమిలనూ, మమతా–మైత్రీ భావాలను జీవుల పరిణామానికి ముందునుంచే సృష్టించి పెట్టిందేమో ప్రకృతిమాత! అదెలాగంటారా...
ఆక్సిజనూ... కార్బన్ డై యాక్సైడ్ ఇచ్చిపుచ్చుకుంటూ మొక్కలూ, జంతువులూ...
పండ్లూ ఫలాలూ ఇచ్చుకుంటూ చెట్టుచేమలూ... ఫారెస్టు యానిమల్సూ...
పూల తేనెతేటల ఊటలు పంచుకుంటూ హనీబీలూ–బటర్‌ఫ్లైసూ..
ఇలా ప్రకృతి నిండా బడ్సీస్ అండ్ ‘బ్రో’లే!
పురాణాలూ... ప్రకృతీ వదిలేసి పిక్చర్లూ మూవీలకు వద్దాం. ఎందుకంటే... పురాణాలూ ప్రకృతీ లాంటి సీరియస్ వ్యవహారాలు కాస్త భారంగా ఉంటాయి కాబట్టి... జనాల ట్రెండును నిర్దేశించేవీ, సమాజానికి అద్దం పట్టేవైన సినిమాలతోనే మొదలుపెట్టాం కాబట్టి... వాటితోనే ముగిద్దాం.
అప్పట్లో... మిస్సమ్మ మొగుడు ఎన్టీ రామారావు పక్కనే రేలంగీ... అడవిరాముడి పక్కనే ఉండి నవ్విస్తుండే రాజబాబూ... సినీ మధ్యయుగాన... అనేక మంది హీరోల స్క్రీన్‌మేటు బ్రహ్మానందం...
ఇప్పటి ట్రెండుకు తగ్గట్టు మహేశ్‌బాబు ‘మహర్షి’ అయితే పాల్ అల్లరి నరేషూ అదే మహేషు ‘శ్రీమంతుడై’΄ోతే పక్కనుండే ఫ్రెండే వెన్నెల కిషోరూ...
అంతెందుకు... ఎర్ర గంధపు చెక్క పుష్పరాజ్ గాడి వెంట ఎప్పుడూ వెన్నంటి ఉండే మంచి ఫ్రెండ్షిప్పు తురుపు ముక్క కేశవ... సినిమాలో ఫ్రెండనే ఫార్మూలా సూపర్ డూపర్ బంపర్ హిట్ అయితే... జీవితంలో ఫ్రెండ్సంటే కామన్‌మేన్ కరేజ్‌కు తోడుండే పెద్ద జట్టు. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే...
(చదవండి: జస్ట్ 30 నిమిషాల పనికి రూ. 18 వేలు..! కార్పొరేట్ ఉద్యోగి రేంజ్‌లో..)